ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (7), లో → లో (4), తో → తో using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →ఆంధ్ర ప్రదేశ్ అవతరణ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB |
||
పంక్తి 3:
{{ఆధునికాంధ్రచరిత్ర}}
==ఆంధ్ర ప్రదేశ్ అవతరణ==
[[1953]]లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, [[భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు]] పై వత్తిడి పెరిగింది. కాంగ్రెసు, కమ్యూనిస్టులతో సహా అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో [[విశాలాంధ్ర]] స్వప్నం నిజమయే రోజు దగ్గరపడింది. [[1953]] డిసెంబర్లో సయ్యద్ [[ఫజల్ ఆలీ]] నేతృత్వంలో [[రాష్ట్రాల పునర్విభజన కమిషను]] ఏర్పాటయింది. [[1955]] [[సెప్టెంబర్ 30]] న తన నివేదిక సమర్పించింది., [[తెలంగాణా]] రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను [[మహారాష్ట్ర]]లోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలను [[కర్ణాటక]]లోను కలిపి తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించింది. అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్ర [[శాసనసభ]]లో మూడింట రెండు వంతులు సభ్యులు ఒప్పుకుంటే, ఆంధ్రతో విలీనం చెయ్యవచ్చని కూడా సూచించింది. కమిషను సూచనలను ఆహ్వానించి, ప్రత్యేక రాష్ట్రవాదనను సమర్ధించిన వారిలో [[కె.వి.రంగారెడ్డి]], [[మర్రి చెన్నారెడ్డి]] ప్రముఖులు. [[హైదరాబాదు]] శాసనసభలో అధిక శాతం సభ్యులు ఆంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది సభ్యులు ఆంధ్ర ప్రదేశ్‌కు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉండిపోయారు. ఆంధ్ర ప్రదేశ్‌ను సమర్ధించిన ప్రముఖ నాయకులలో అప్పటి ముఖ్యమంత్రి [[బూరుగుల రామకృష్ణా రావు]], [[మాడపాటి హనుమంతరావు]], [[స్వామి రామానంద తీర్థ]] మొదలైనవారు ఉన్నారు. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, [[హైదరాబాదు]] శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా ఆంధ్ర ప్రదేశ్నే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. [[1956]] [[ఫిబ్రవరి 20]] న ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరపున [[బూరుగుల రామకృష్ణా రావు]], [[కె.వి.రంగారెడ్డి]] (మర్రి చెన్నారెడ్డికి మామ. ఈయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.)
==ఉపముఖ్యమంత్రి==
|