ఈమని శంకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, స్థాయుల → స్థాయిల using AWB
పంక్తి 9:
ఆయన 1942-50 మధ్యలో [[మద్రాసు]]లోని జెమినీ స్టూడియోలో [[సాలూరు రాజేశ్వరరావు]]కు సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశాడు. ఆ కాలంలోనే [[చిట్టిబాబు]] ఆయనకు శిష్యుడయాడు. 1951లో [[పి.బి.శ్రీనివాస్‌]]ను సినీ గాయకుడుగా పరిచయం చేసాడు. 1953 ప్రాంతాల్లో శంకరశాస్త్రి జెమినీలో అనేక సినిమాలకు పనిచేశారు. ‘సీతారామకల్యాణం’ చిత్రంలో రావణుడు వీణవాయించే ఘట్టంలో, ప్లేబ్యాక్‌లో శంకరశాస్త్రి వీణ వాయించారు. ‘వెంకటేశ్వర మహాత్యం’ సినిమాలో వాచస్పతి రాగంలో వీణ వాయించారు.
==గాత్రము==
తన కచేరీలలో అప్పుడప్పుడూ పాట పాడి వినిపిస్తూ, వీణ మీద అవే సంగతులు పలికించేవారు. మంత్రపుష్పం వంటివి వాయిస్తున్నప్పుడు, ‘ప్రజా’ వంటి పదాలను ఉచ్చరిస్తూ కుడిచేత్తో అందుకు అనుగుణంగా రెండు తీగెల మీద డబుల్ మీటు వేసేవారు. ఇక సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన తీగెలను కుడిచేత్తో మీటే పద్ధతి గొప్పగా ఉండేది. చేతి పొజిషన్‌ను నాలుగైదు రకాలుగా మార్చేవారు. అది అనితరసాధ్యం. మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటనవేలితో మీటుతూ, మంద్ర, అనుమంద్ర స్థాయుల్లోస్థాయిల్లో వాయించేవారు. రాగస్వభావాన్ని గంభీరంగా, హుందాగా వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. తాను పూర్తిగా సంగీతంలో లీనమై, ప్రేక్షకుల ఉనికిని కూడా గమనించకుండానే వారిని కూడా సంగీతంలో ఓలలాడించేవారు.
==ఇతర వాద్యాలు మరియు జుగల్ బందీ==
హిందుస్తానీ కళాకారులతో జుగల్‌బందీ చేయడం ఆయనకు సులభసాధ్యం. కచేరీలో వీణ బుర్ర మీద జాజ్ శబ్దం వాయిస్తూ స్వరరచనలు చేసేవారు. మంద్రస్థాయిలో అచ్చు గిటార్ లాగే వినపడేది. కదనకుతూహల రాగంలో ‘రఘువంశ సుధాంబుధి చంద్ర’ కీర్తనను ద్వారం వెంకటస్వామినాయుడు గారి పద్ధతిలో వెస్టర్న్ కార్డ్స్ ఉపయోగించేవారు. వీణ మీద ఎన్ని రకాల శబ్దాలు చేయవచ్చో సంపూర్ణంగా అర్థం చేసుకున్న కళాకారుడు శాస్త్రిగారు.
పంక్తి 18:
 
==రేడియో కార్యక్రమాలు==
1940లో [[తిరుచ్చి]] రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది. అలా మెల్లగా ఎదుగుతూ వచ్చారు. [[ఆకాశవాణి]] డైరక్టరేట్ లో సంగీత విభాగంలొవిభాగంలో చీఫ్ ప్రొడ్యూశర్ గా పనిచేసిన మరో ప్రముఖులు [[ఈమని శంకరశాస్త్రి]]. వైణికులుగా లబ్ధ ప్రతిష్టులైన శంకరశాస్త్రి [[ఢిల్లీ]]లో సముచిత గౌరవాన్ని పొందారు.
 
==విదేశీయానము మరియు సత్కారములు==
విమానం ఎక్కడమంటే ఆయనకు చాలా భయము. అందువల్ల ఆయన ఎన్నిసార్లు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు. చివరికి 1970వ దశకంలో ఫ్రాన్స్ వెళ్లి కచేరీలు చేశారు. అక్కడివారు ఎంతో సంబరపడ్డారు. ‘కాన్సర్ట్ ఆఫ్ ది సెంచురీ’ అని పత్రికలు ప్రశంసించాయి..
 
[[వర్గం:1922 జననాలు]]
[[వర్గం:1987 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఈమని_శంకరశాస్త్రి" నుండి వెలికితీశారు