ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, హైదరాబాద్ → హైదరాబాదు, ఉదాహరించి → ఉదహరించి, using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Enugula Veeraswamayya 1.jpg|right|thumb|200px]]
[[ఫైలు:Enugula Veeraswamayya 2.jpg|right|thumb|200px]]
'''ఏనుగుల వీరాస్వామయ్య''' ([[1780]] - [[1836]]) [[తెలుగు]] రచయిత, యాత్రికుడు. ఇతడు [[కాశీయాత్ర చరిత్ర]] విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. [[కాశీయాత్ర చరిత్ర]] మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, [[దిగవల్లి వేంకటశివరావు]], ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.
==బాల్యం==
ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో ఉండేది.
 
==ఉద్యోగం==
12 యేళ్ళకే వీరాస్వామయ్య [[ఆంగ్లం]] ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు నేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరు గానే చేరి, తమ శక్త్యానుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. అతి చిన్న వయసులోనే అతని ప్రతిభ చూసి పై అధికారులు అతనిని తమ వద్ద పనిచేయించుకోవాలని పోటీ పడేవారట. [[తెలుగు]], [[తమిళ]], [[ఇంగ్లీషు]] భాషలలో కూడా అతను మంచి ప్రతిభ సాధించి ఉండవచ్చును. 13వ యేట తిరునల్వేలి జిల్లా కలెక్టరు ఆఫీసులో [[ఇంటర్ప్రిటర్|ద్విభాషి]] గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పట్లో కలెక్టరు చాలా చాలా పెద్ద ఉద్యోగం. అంత చిన్నవయసులో కలెక్టరు ఆఫీసులో చేరగలగడం వీరాస్వామయ్య ప్రతిభకు తార్కాణం.
 
రెండు సంవత్సరాల తరువాత వీరాస్వామయ్య [[చెన్నపట్నం]] చేరి, అనేక వ్యాపార సంస్థలలో పనిచేసి, బుక్‌ కీపింగ్ లాంటి అనేక విద్యలలో నిపుణుడయ్యాడు. బోర్డ్ ఆఫ్ ట్రేడ్‌ లో ఎకౌంటెంట్‌గా పని చేశాడు. ఈ సమయంలోనే సంస్కృతంలోను, జ్యోతిష్యం, ఖగోళం, స్మృతులు, పురాణాలు వంటి అనేక విషయాలలో పండితుడైనట్లున్నాడు. 15యేళ్ళ బాలుడు బాధ్యత గల ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతూ అంత శాస్త్రవిజ్ఞానం సంపాదించడం ఆశ్చర్యకరం. అతని ప్రతిభను గుర్తించి మద్రాసు సుప్రీం కోర్టువారు అతనికి "హెడ్ ఇంటర్ప్రిటర్" ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇది చాలా గొప్ప ఉద్యోగంగా భావింపబడేది. పాశ్చాత్య చట్టాలను, స్థానిక ధర్మ సాంప్రదాయాలను, ఆచారాలను సమన్వయపరుస్తూ విచారణ జరపడానికి బ్రిటిషు జడ్జీలకు ద్విభాషీలు సహాయపడేవారు. క్రొత్త ఉద్యోగంలో చేరేముందు పాత సంస్థవారు అతనికి ఘనమైన వీడ్కోలు ఇస్తూ బంగారపు నశ్యపు డబ్బాను బహూకరించారు. అప్పటిలో బ్రిటషు పాలనలో ఉన్న ప్రాంతాలలోని బలమైన చట్టాల వలన నెలకొన్న స్థిరత్వానికి, ఇతర పాలకుల ప్రాంతాలలో జరిగే అరాచకాలకు మధ్య భేదాన్ని వీరాస్వామయ్య యాత్రా చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చును.
 
అప్పటికి [[కృష్ణా]] [[గోదావరి]] నదులపై ఆనకట్టలు కట్టలేదు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. ప్రజల ఆకలి తీర్చడానికి "గంజిదొడ్లు" (ఆహార సహాయ కేంద్రాలు) ఏర్పాటు చేశారు. అలాంటి గంజిదొడ్ల దగ్గర ఒక తపస్విలా తన బాధ్యత నిర్వహించి వీరాస్వామయ్య వీలయినంతమందికి సహాయపడ్డాడు.
 
సర్ రాల్ఫు ఫాల్మరు దొర, ఆయనకు వ్రాసి యిచ్చిన టెష్టిమోనియల్ అనే యోగ్యతా పత్రికలో - అయన కోర్టులో నున్ను, చేంబరులో నున్ను, అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చెననిన్ని, ఆయన తన గొప్ప ఉద్యోగపు పనులను మిక్కిలి నమ్మకముగా జరిపించెననిన్ని, మరిన్ని ప్రజల మేలు కోరి స్మృతిచంద్రిక మొదలైన పుస్తకములకు అనువాదము చేసెననిన్ని, నేనెరిగినంతలో ప్రభుత్వవారి విశేష కృపకు యీ పురుషుడు పాత్రుడైనట్లు హిందు పెద్దమనుషులలో ఎవరున్ను ఎక్కువైనవారు లేరని నాకు తోచియున్నదనిన్ని వ్రాయబడియున్నది.