రక్తం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
రక్తాన్ని పరీక్ష నాళికలో పోసి నిలడితే కొద్ది సేపటిలో రక్తం మూడు స్తరాలు (layers) గా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కవ మందం ఉన్న స్తరం, ఎండుగడ్డి రంగులో, పారదర్శకంగా, పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని తెలుగులో [[రసి]] అనిన్నీ ఇంగ్లీషులో ప్లాస్మా (plasma) అనిన్నీ అంటారు. దీని దిగువన, అతి తక్కువ మందంతో తెల్లటి స్తరం ఒకటి కనిపిస్తుంది. ఇవే తెల్ల రక్త కణాలు (white blood cells), లేదా సూక్ష్మంగా [[తెల్ల కణాలు]] (white cells or leukocytes). నాళికలో అట్టడుగున దరిదాపు రసి స్తరం ఉన్నంత మందం గానూ ఎర్రటి స్తరం మరొకటి కనిపిస్తుంది. ఇవి ఎర్ర రక్త కణాలు (red blood cells), లేదా సూక్ష్మంగా [[ఎర్ర కణాలు]] (red cells or erythrocytes). ఉరమరగా రసి స్తరం 55 శాతం ఉంటే ఎర్ర కణాల స్తరం 45 శాతం.
 
'''ఎర్ర రక్త కణాలు''' (ఎరిత్రోసైట్లు) : ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్థం ఉండడం వలన అవి ఎర్రగా ఉంటాయి. ఇవి గుండ్రంగా, ద్విపుటాకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 450 నుండి 500 కోట్ల ఎర్ర రక్త కణాలుంటాయి. ఈ కణాలు ఎముకల[[ఎముక]]ల మధ్య ఉన్న మజ్జలో ఉత్పత్తి అవుతాయి. ఇలా ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఎరిత్రోపాయిసిస అంటారు. ఎర్ర రక్త కణాలు షుమారు 120 రోజులు జీవిస్తాయి. ఇవి ఆక్సిజన్ రవాణాకు తోడ్పడతాయి. వీటి జీవితకాలం తరువాత ఇవి ప్లీహంలో, కాలేయంలో[[కాలేయం]]లో విచ్ఛిన్నమవుతాయి.
 
'''తెల్ల రక్తకణాలు''' (ల్యూకోసైట్లు) : వీటిలో [[హిమోగ్లోబిన్]] ఉండదు. ఇవి అమీబా వంటి ఆకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 50 నుండి 90 లక్షల రక్త కణాలుంటాయి. ఇవి లింపు కణుపులలోను, ప్లీహంలోను ఉత్పత్తి అవుతాయి. ఇని ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అంటారు. ఇవి షుమారు 12-13 రోజులు జీవిస్తాయి. వ్యాధులనుండి సంరక్షించడం తెల్ల రక్తకణాల పని. వీటి జీవితకాలం తరువాత తెల్లరక్తకణాలు కాలేయంలోను, లింపు ద్రవంలోను విచ్ఛిన్నమవుతాయి.
 
రక్తంలో రసి చాల ముఖ్యమైనది. పోషణకి కావలసిన విటమినులు, ఖనిజాలు, చక్కెరలు, ప్రాణ్యములు, కొవ్వులు, మొదలయిన వాటి రవాణాకి ఒక రహదారి కల్పిస్తుందీ రసి. ఈ రసిలో - కొన్ని చిల్లర మల్లర సరుకులు మినహా - తేలియాడే పదార్ధాలలో మూడు ముఖ్యమైన ప్రాణ్యాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీషులో [[ఆల్బ్యుమిన్‌]] (albumin), [[గ్లాబ్యులిన్]] (globulin), [[ఫైబ్రినోజెన్‌]] (fibrinogen) అని అంటారు. ఆల్బ్యుమిన్‌ ని తెలుగులో 'శ్వేతధాతువు' అంటారు. గ్లాబ్యులిన్‌ కి ప్రస్తుతానికి తెలుగు పేరు లేదు కాని ఇది మూడు రకాలు: ఆల్ఫా, బీటా, గామా. నీటిని పుట్టించేది ఉదజని (hydrogen), ఆమ్లాన్ని పుట్టించేది [[ఆమ్లజని]] (oxygen) అయినట్లే ఫైబర్‌ ని పుట్టించేది ఫైబ్రినోజెన్‌. ఫైబర్‌ అంటే నార, పీచు, తాంతవం అని తెలుగు మాటలు ఉన్నాయి. కనుక నార వంటి పదార్ధాన్ని పుట్టించే ఫైబ్రినోజెన్‌ ని తెలుగులో 'తాంతవజని' అనొచ్చు. దెబ్బ తగిలి రక్తం స్రవిస్తూన్నప్పుడు, రక్తానికి గాలి సోక గానే ఈ తాంతవజని రక్తం లోంచి బయటకి పుట్టుకొచ్చి, సాలెపట్టులా దెబ్బ చుట్టూ అల్లి పక్కు కట్టేలా చేస్తుంది. మనం ఆహారంతో తినే [[పిప్పి పదార్ధాలు]] ఇవి కావు; అవి మరొకటి.
 
== రక్తం చేసే పనులు ==
"https://te.wikipedia.org/wiki/రక్తం" నుండి వెలికితీశారు