కరీనా కపూర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ), → , , ( → ( (13) using AWB
పంక్తి 1:
<span>'''కరీనా కపూర్ ''' (</span>జననం 21 సెప్టెంబర్ 1980), <ref name="HT" /> ప్రముఖ బాలీవుడ్ నటి. ప్రముఖ నటులు రణధీర్ కపూర్, బబితాల కుమార్తె, కరిష్మా కపూర్ చెల్లెలు ఆమె. రొమాంటిక్ కామెడీల నుంచీ క్రైం డ్రామాల వరకూ ఎన్నో రకాల సినిమాలు చేశారు కరీనా. ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆమె ఆరు ఫిలింఫేర్ పురస్కారాలను పొందారు. ఆమె బాలీవుడ్ లో ప్రముఖ నటి, ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు.<ref name="HT"><cite class="citation news">Saini, Minakshi (18 September 2012). </cite></ref>
 
2000లో రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేసిన కరీనా 2001లో చారిత్రాత్మక చిత్రం అశోకాలో నటించారు. అదే ఏడాది ఆమె నటించిన కభీ ఖుషీ కభీ గమ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత ఆమె ఒకేలాంటి ప్రాత్రలు చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోవడమే కాక, ఆమె నటనపై విమర్శలు కూడా వచ్చాయి. 2004 ఆమె కెరీర్ లో మలుపుగా చెప్పుకోవచ్చు. ఆమె నటించిన చమేలీ, దేవ్ సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సినిమాలతో పాటు, ఓంకారాలో ఆమె నటనకు ప్రశంసల వర్షం కురిసింది. 2007లో నటించిన జబ్ వియ్ మెట్ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి, 2010లో నటించిన వియ్ ఆర్ ఫ్యామిలీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు కరీనా.  ఆ తరువాత ఆమె నటించిన 3 ఇడియట్స్ (2009), బాడీగార్డ్ (2011), రా.వన్ (2011), భజరంగీ భాయీజాన్ (2015) సినిమాలు అత్యంత భారీ వసూళ్ళు సాధించి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 2009లో నటించిన కుర్బానా, 2012లో చేసిన హీరోయిన్ సినిమాల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారామె.
 
నటుడు [[సైఫ్ అలీ ఖాన్]] ను వివాహం చేసుకున్నారు కరీనా.  భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమె చాలా  ప్రముఖమైన నటి. కరీనా స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు కూడా ఇస్తారు. అంతే కాక ఆమె మూడు పుస్తకాలు సహ రచయిత కూడా ఒకటి తన జీవిత చరిత్ర కాగా, రెండు పోషకవిలువలకు సంబంధించిన పుస్తకాలు. అంతర్జాతీయ బ్రాండ్ గ్లోబస్ తో కలసి ఆమె స్వంతంగా ఒక బట్టల బ్రాండ్ ను ప్రారంభించారు.
 
== తొలినాళ్ళ జీవితం, నేపథ్యం ==
[[దస్త్రం:Kapoor_Women.jpg|alt=Kareena and Karisma Kapoor with their mother Babita|thumb|విలేఖరి వీర్ సంఘవీకి ఇచ్చన ఇంటర్వ్యూలో తల్లి బబిత (ఎడమ), అక్క కరిష్మా కపూర్ లతో కరీనా.]]
21 సెప్టెంబరు 1980న [[ముంబై]]<nowiki/>లో [[పంజాబీ హిందువులు|పంజాబీ హిందువులైన]] నటుడు  రణధీర్ కపూర్, బబితలకు జన్మించారు కరీనా.<ref name="Little girl"><cite class="citation web">Verma, Sukanya (30 October 2002). </cite></ref><ref name="Bio"><cite class="citation web">[http://www.rediff.com/movies/2002/oct/30sotw.htm "Star of The Week-Kareena Kapoor"]. </cite></ref> ఆమె అక్క కరిష్మా కూడా నటే. ఆమె తాత (తండ్రికి తండ్రి) [[రాజ్ కపూర్]] ప్రముఖ బాలీవుడ్  నటుడు. కరీనా తల్లి గర్భం దాల్చినప్పుడు ఆమె చదివిన అన్న కరెనినా పుస్తకం పేరునే మార్చి కరీనా అని పేరు పెట్టారట.<ref><cite class="citation web">IndiaFM News Bureau (29 December 2004). </cite></ref> ఆమె తండ్రి పంజాబీ, తల్లి సింధీ-బ్రిటిష్ కుటుంబానికి చెందినవారు.<ref><cite class="citation news">Upala KBR (23 December 2008). </cite></ref> చిన్నతనంలో తమ కుటుంబంతో కలసి హిందూ పూజలలో ఎక్కువగా పాల్గొన్న ఆమె, తల్లితో కలసి క్రిస్టియన్ సంప్రదాయాలనూ పాటించేవారు.<ref name="Wedding"><cite class="citation news">[http://www.telegraphindia.com/1121017/jsp/frontpage/story_16099644.jsp "Sajid beats Saif to the altar&nbsp;– After civil marriage, a suspense at play"]. </cite></ref>
 
తను చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లననీ, ఇంటినిండా నటులే కావడంతో సినిమాలపై ఎక్కువ ఆసక్తి కలిగిందనీ వివరిస్తారు కరీనా. నటి నర్గీస్, మీనా కుమారి తనకు ఆదర్శమని తెలిపారు ఆమె. నటుల కుటుంబమే అయినా ఆడవారు సినిమాల్లోకి రావడానికి తన తండ్రికి అంతగా ఇష్టం లేదని అంటారు కరీనా.<ref name="Kapoor dynasty"><span>(</span>[[Kareena Kapoor#CITEREFChatterjeeDeenviNihalani2003|Chatterjee, Deenvi &#x26; Nihalani 2003]]<span>, p.</span>&nbsp;<span>483)</span></ref> ఈ గొడవతోనే ఆమె తల్లితండ్రులిద్దరూ  విడిపోయారు.<ref name="Parents"><cite class="citation news">Lalwani, Vickey (10 October 2007). </cite></ref> అందుకే ఆమె తల్లి పెంపకంలో పెరిగారు. 1991లో కరిష్మా సినిమాల్లోకి వచ్చేవరకు బబితా వివిధ పనులు చేసి వారిని పోషించారు.<ref name="Full-On"><cite class="citation news">Thakraney, Anil (16 December 2007). </cite></ref> చాలా ఏళ్ళు విడిగా ఉన్న తరువాత కరీనా తల్లిదండ్రులు అక్టోబరు 2007లో తిరిగి ఒకటయ్యారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ "తండ్రి కుటుంబానికి ఎంతో ముఖ్యమైనవారు. చాలా ఏళ్ళు ఆయనతో కలసి మేం ఉండకపోయినా, ఇప్పుడు మేం ఒక కుటుంబం అయ్యాం" అని వివరించారు.
పంక్తి 16:
 
=== 2000–03: కెరీర్ తొలినాళ్ళు, మొదటి హిట్ ===
ట్రైనింగ్ లో ఉన్నప్పుడే హృతిక్ రోషన్ నటించిన కహో నా.. ప్యార్ హై (2000) సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అయితే మొదట్లో ఒప్పుకున్నా, తరువాత సినిమా నుంచి తప్పుకున్నారు ఆమె. అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ సినిమాతో తెరంగేట్రం చేశారు కరీనా. ఈ సినిమాలో అక్రమంగా పాక్ కు తరలింపబడే అభిషేక్ తో ప్రేమలో పడే బంగ్లాదేశ్ యువతిగా నటించారు ఆమె. ఈ సినిమాలోని ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.<ref><cite class="citation web">Adarsh, Taran (30 June 2000). </cite></ref><ref><cite class="citation news">Chopra, Anupama (18 September 2000). </cite></ref> ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.<ref name="KK BOI"><cite class="citation web">[https://web.archive.org/web/20150205043108/http://boxofficeindia.com/Star_Cast/actor_detail/kareena_kapoor/actor "Kareena Kapoor: Box Office Details and Filmography"]. </cite></ref> ఈ సినిమాకు ఫిలింఫేరు ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు.<ref name="Awards"><cite class="citation web">[https://web.archive.org/web/20100806140053/http://www.bollywoodhungama.com/celebrities/awards/8746/index.html "Kareena Kapoor: Awards & Nominations"]. </cite></ref>
 
== సినిమాలు, అవార్డులు ==
 
=== అవార్డులు, నామినేషన్లు ===
కరీనా మొత్తం 6 ఫిలింఫేర్ పురస్కారాలు, 10 నామినేషన్లు  పొందారు.<ref name="Awards" /><ref name="Awards1" /> రెఫ్యూజీ సినిమాలోని నటనకు 2000లో ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం గెలుచుకున్నారు. చమేలీ (2003) సినిమాకు ప్రత్యేక జ్యూరీ గుర్తింపు అందుకున్నారు. దేవ్ (2004), ఓంకారా (2006) సినిమాల్లోని నటనకు విమర్శకుల ఉత్తమ నటి పురస్కారం లభించాయి ఆమెకు. జబ్ వియ్ మెట్ (2007) సినిమాకు ఉత్తమ నటి, వియ్ ఆర్ ఫ్యామిలీ (2010) సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు కరీనా.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కరీనా_కపూర్" నుండి వెలికితీశారు