కాంతి శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: యెక్క → యొక్క using AWB
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
'''కాంతి శాస్త్రం''' అంటే [[కాంతి]] యొక్క లక్షణాలను మరియు ప్రవర్తనను వివరించే [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్ర]] విభాగం. ఈ శాస్త్రంలో కాంతిని గుర్తించే పరికరాలు, కాంతిని వాడుకునే పరికరాలు, వివిధ రకాలైన పదార్థాల మీద కాంతి ప్రభావం లాంటి అంశాలు ఉంటాయి. ప్రధానంగా మానవులు చూడగలిగే కాంతి, [[అతినీలలోహిత కిరణాలు]], [[పరారుణ కిరణాలు]] గురించి ఇందులో వివరణ ఉంటుంది. కాంతిని [[విద్యుదయస్కాంత తరంగాలు]]గా కూడా అభివర్ణిస్తారు కాబట్టి ఆ తరంగాల యొక్క ఇతర రూపాలైన [[ఎక్స్-రే]], [[మైక్రోవేవ్]], [[రేడియో తరంగాలు|రేడియో తరంగాలను]] అధ్యయనం చేయడం కూడా ఇందులో భాగమే.
 
కాంతి యొక్క చాలా ధర్మాలను కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా భావించి వివరించవచ్చు. అయితే ఈ భావన ద్వారా కాంతి యెక్కయొక్క అన్ని ధర్మాలను ప్రయోగపూర్వకంగా నిరూపించడం కష్టసాధ్యం. అందుకోసం సరళమైన నమూనాల ద్వారా కాంతి మీద ప్రయోగాలు సాగించారు. కాంతి జ్యామితి ఇందులో ప్రధానమైనది. ఇందులో కాంతిని ఋజువుగా (నేరుగా) ప్రయాణించే కిరణాల సముదాయంగా అభివర్ణించారు. అవి ఏదైనా ఉపరితలాన్ని తాకినప్పుడు వంగడమో లేదా ఆ వస్తువుల గుండా చొచ్చుకుని ప్రయాణించడమో చేస్తాయి. కాంతి భౌతిక శాస్త్ర నమూనా కాంతి ధర్మాలను మరింత విపులంగా వివరిస్తుంది. 19వ శతాబ్దంలో విద్యుదయస్కాంత సిద్ధాంతం అభివృద్ధి సాధించడంతో కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు.
 
కొన్ని కాంతి ధర్మాలు వివరించాలంటే కాంతిని తరంగాలు గానూ, మరియు కణాలుగా కూడా ఊహించాలి. క్వాంటమ్ మెకానిక్స్ ద్వారా వీటిని వివరిస్తారు. కాంతిని కణధర్మాలను వివరించడానికి దానిని ఫోటాన్ల సముదాయంగా భావిస్తారు.
 
కాంతి శాస్త్రాన్ని దాని అనుబంధ రంగాలైన [[ఖగోళ శాస్త్రం]], వివిధ ఇంజనీరింగ్ రంగాలు, [[ఫోటోగ్రఫీ]], [[వైద్యశాస్త్రము|వైద్యరంగాలలో]] విరివిగా వాడుతున్నారు. నిత్యజీవితంలో మనం వాడే వస్తువులైన అద్దాలు, కటకాలు, టెలిస్కోపు, మైక్రోస్కోపు, లేజర్లు, ఫైబర్ ఆప్టిక్స్ మొదలైనవి కాంతి సూత్రాల ఆధారంగా తయారుచేయబడ్డవే.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కాంతి_శాస్త్రం" నుండి వెలికితీశారు