కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
పంక్తి 1:
'''కాట్రగడ్డ బాలకృష్ణ''' ఒక అసాధారణ మేధావి. గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామములో కోటయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 26]], [[1906]] న జన్మించాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 183</ref>.
==విద్య==
ప్రాథమిక విద్యాభ్యాసము [[గుంటూరు]]లో జరిగింది. తరువాత [[బాపట్ల]] బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్థి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. బ్రిటన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చేరారు. ఏకాగ్రత కుదరకపోవడంతో అమెరికా వెళ్ళి హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం అధ్యయనం చేసారు.<ref>[https://books.google.co.in/books?id=CVITAwAAQBAJ&pg=PT179&lpg=PT179&dq=katragadda+balakrishna&source=bl&ots=GJywhu8Df3&sig=JIKqcULG-wJIhw6UI-lGz3a1nLQ&hl=te&sa=X&ved=0ahUKEwjdpOnR7NnMAhWMN48KHU92BpoQ6AEIWzAO#v=onepage&q=katragadda&f=false land water language&political in andhra book]</ref> వరుసగా ఈ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు ఫెలోషిప్ పొందిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందారు.<ref name="andhra scientists">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=1 August 2011|publisher=శ్రి వాసవ్య|pages=407|edition=krishnaveni publishers,vijayawada|accessdate=14 May 2016}}</ref> 1939 సెప్టెంబర్ లో చిదంబరం లోచిదంబరంలో జరిగిన విద్యార్థి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట పాల్ఘాట్, కొయంబత్తూరు లలో జరిగిన విద్యార్థి సమావేశాలలో పాల్గొని, దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించాడు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 3, 1941న అరెస్ట్ చేసి వెల్లూరు కారాగారంలో నిర్బంధించింది.
 
==రచనలు==
మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. 64 మౌలిక పరిశోధనాత్మక రచనలు చేసి Father of Marxist Ideology గా పరిగణించబడ్డాడు. [[భౌతికవాదం]] పాశ్చాత్యదేశాలనుండి చేసుకున్న దిగుమతి కాదనీ, భారతీయ భావనా సంప్రదాయములో ఒక ముఖ్య భాగమనీ Hindu Materialism అనే పుస్తకములో వ్రాశాడు.<ref>[http://franklin.library.upenn.edu/search.html?filter.author_creator_facet.val=Krishna%2C%20K.%20B.%20%28Katragadda%20Balakrishna%29%2C%201898-1948 Franklin library]</ref> 1941 జూన్ 21న [[అడాల్ఫ్ హిట్లర్|హిట్లర్]] సోవియట్ యూనియన్ పై దాడిచేసిన తరువాత యుద్ధరీతిలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ 300 పుటల బృహత్ గ్రంథాన్ని పది రోజులలో రచించాడు. 1942 జూన్ 24న జైలు నుండి విడుదలైన తరువాత బెల్గాం విశ్వవిద్యాలయం లోవిశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం బోధించాడు. తరువాత బొంబాయిలోని అఖిల భారత పరిశ్రమల సంస్థలోనూ, లక్నో విశ్వవిద్యాలయం, టాటా సాంఘిక సంస్థలలోనూ పనిచేసి అచట ఇమడలేక మానివేశాడు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫెలోషిప్ తో రెండు సంవత్సరాలు అమెరికా లోఅమెరికాలో పనిచేశాడు. తిరిగి వచ్చిన తరువాత గ్రంథ రచన చేబట్టి Theories of kingship in ancient India<ref>[http://nationallibrary.gov.in/showdetails.php?id=768326 Bibliographic Detail in national library]</ref>, The Problem of Minorities; or, Communal representation in India, The Second World War and Industrialization in India, Political Thought in Dravidian Literature, Class and Class Struggle, Economic Planning in India మున్నగు పుస్తకాలు రచించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/కాట్రగడ్డ_బాలకృష్ణ" నుండి వెలికితీశారు