సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఒక సమాజం జీవనంలో మిళితమైన [[కళ]]లు, [[నమ్మకం|నమ్మకాలు]], [[సంస్థ]]లు, [[తరం|తరాలలో]] జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును.<ref>Williams, Raymond. ''Keywords'', "Culture"</ref> ఆ సమాజంలో పాటించే [[ఆచారం|ఆచారాలు]], పద్ధతులు, [[అభివాదం|అభివాదాలు]], [[వస్త్ర ధారణ|వస్త్రధారణ]], [[భాష]], [[మతం]], [[ఆట]]లు, [[విశ్వాసం|విశ్వాసాలు]], [[కళ]]లు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి
== సంస్కృతి నిర్వచనం ==
ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.<ref name="Williams">[[:en:Raymond Williams|]] (1976) ''[[:en:Keywords: A Vocabulary of Culture and Society]]''. Rev. Ed. (NewYork: Oxford UP, 1983), pp. 87-93 and 236-8.</ref> ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.<ref>John Berger, Peter Smith Pub. Inc., (1971) ''Ways of Seeing''</ref> వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే[[సంస్కృతి]]లోనివే అని '''మానవ శాస్త్రజ్ఞులు''' భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.
 
1874లో [[:en:social anthropology|సామాజిక పురా శాస్త్రము]] గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత" ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు మరియు సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును.("సంస్కృతి లేదా [[నాగరికత]], దాని విస్తృత ఎథ్నోగ్రాఫిక్ కోణంలో తీసుకున్న, జ్ఞానం, నమ్మకం, కళ, నీతులు, చట్టం, ఆచారం కలిగి సంక్లిష్ట మొత్తంగా ఉంటుంది మరియు ఏ ఇతర సామర్థ్యాలు మరియు అలవాట్లు సమాజంలో సభ్యుడిగా మనిషికి సొంతం")<ref>Tylor, E.B. 1874. ''Primitive culture: researches into the development of mythology, philosophy, religion, art, and custom''.</ref>'''
 
[[ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ]] ([[యునెస్కో]]) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే.<ref>[[UNESCO]]. 2002. [http://www.unesco.org/education/imld_2002/unversal_decla.shtml] Universal Declaration on Cultural Diversity.</ref> ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో [[:en:Alfred Kroeber|ఆల్ఫ్రెడ్ క్రోబర్]] మరియు [[:en:Clyde Kluckhohn|క్లైడ్ క్లుఖోన్]] అనే రచయితలు తమ<ref> ''Culture: A Critical Review of Concepts and Definitions'' అనే Kroeber, A. L. and C. Kluckhohn, 1952. ''Culture: A Critical Review of Concepts and Definitions.''</ref>సంకలనంలో "సంస్కృతి"కి 164 నిర్వచనాలను సేకరించారు
 
== సంస్కృతి, నాగరికత ==
 
"https://te.wikipedia.org/wiki/సంస్కృతి" నుండి వెలికితీశారు