మిస్టర్ పర్‌ఫెక్ట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
తనలోని లోపాలను పట్టించుకోకుండా ప్రియ తనని ప్రేమించిందని తెలుసుకున్నాక విక్కీకి ప్రియని కాదని తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. అలాగే తన తండ్రి చెప్పినట్టు మన వాళ్ళకోసం రాజీపడాల్సిన అవసరాన్ని తెలుసుకుంటాడు. ఇంతలో మ్యాగీ తండ్రి ద్వారా ఇంట్లో వాళ్ళందరూ విక్కీ-మ్యాగీల పెళ్ళికి ఒప్పుకున్నారని తెలిసిన తర్వాత విక్కీ మ్యాగీకీ, తన పూర్తి కుటుంబానికీ, తన-ప్రియల కథను చెప్తాడు. విక్కీ వల్ల తను కూడా తన తండ్రిని బాధపెట్టిన విషయాన్ని గమనించిన మ్యాగీ తన ప్రవర్తనను మార్చుకుంటుంది. ఎలాగైనా ప్రియను సొంతం చేసుకోవాలని ఇండియాకి వచ్చిన విక్కీ ప్రియకు ఎన్నో రకాలుగా తన ప్రేమను తెలియచేసే ప్రయత్నం చేస్తాడు. మొదట్లో బాగా ఇబ్బంది పెట్టినా, చివరికి ప్రియ తనతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. "కెరియర్లో గెలవాలంటే రాజీపడకుండా కష్టపడాలి. అప్పుడే గెలుస్తాం. కానీ బంధాల్లో కొన్నిసార్లు రాజీపడితేనే గెలుస్తాం." అని విక్కీ చెప్పే మాటలతో ఈ సినిమా ముగుస్తుంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మిస్టర్_పర్‌ఫెక్ట్" నుండి వెలికితీశారు