జలుబు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
<!-- నివారణ మరియు చికిత్స -->
జలుబుకు ఎలాంటి వ్యాక్సీన్ లేదు. నివారణకు[[నివారణ]]కు ప్రధాన ఉపాయం చేతులు కడుక్కోవడం; అశుభ్రమైన చేతులు కళ్ళలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకపోవడం; జబ్బుగా ఉన్నవారి నుంచి దూరంగా ఉండటం.<ref name=CDC2015/> ముఖానికి తొడుగులు ధరించడం వల్ల కూడా కొంత వరకు ప్రయోజనం ఉండవచ్చని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి.<ref name=E209>Eccles p. 209</ref> శాస్త్రీయంగా జలుబుకు విరుగుడు కూడా ఏమీ లేదు. ఏ [[మందులు]] వాడినా జలుబు వల్ల కలిగిన లక్షణాలకు చికిత్స చేయడం వరకే.<ref name=CDC2015/> ఇబుప్రొఫేన్ లాంటి యాంటి ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడవచ్చు.<ref>{{cite journal|last1=Kim|first1=SY|last2=Chang|first2=YJ|last3=Cho|first3=HM|last4=Hwang|first4=YW|last5=Moon|first5=YS|title=Non-steroidal anti-inflammatory drugs for the common cold.|journal=The Cochrane database of systematic reviews|date=21 September 2015|volume=9|pages=CD006362|pmid=26387658|doi=10.1002/14651858.CD006362.pub4}}</ref> యాంటీబయోటిక్ మందులు అసలు వాడకూడదు.<ref>{{cite journal|last1=Harris|first1=AM|last2=Hicks|first2=LA|last3=Qaseem|first3=A|last4=High Value Care Task Force of the American College of Physicians and for the Centers for Disease Control and|first4=Prevention|title=Appropriate Antibiotic Use for Acute Respiratory Tract Infection in Adults: Advice for High-Value Care From the American College of Physicians and the Centers for Disease Control and Prevention.|journal=Annals of Internal Medicine|date=19 January 2016|pmid=26785402|doi=10.7326/M15-1840|volume=164|pages=425}}</ref> [[దగ్గు మందు]] లు కూడా ఎటువంటి ప్రయోజనం చూపించడం లేదని నిర్ధారణ అయింది.<ref name=CMAJ2014/>
 
<!-- రోగ విజ్ఞానం మరియు చరిత్ర -->
పంక్తి 25:
 
==గుర్తులు మరియు లక్షణాలు==
[[దగ్గు]], [[కారుతున్న ముక్కు]], [[ముక్కు దిబ్బడ]] మరియు [[గొంతు రాపు]] జలుబు ప్రధాన లక్షణాలు. కొన్నిసార్లు కండరాల నొప్పి, అలసట, [[తలనొప్పి]], మరియు ఆకలి లేకుండా ఉండటం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.<ref name=E24>Eccles p. 24</ref> గొంతు రాపు దాదాపు 40% రోగుల్లో, దగ్గు సుమారు 50% రోగుల్లో కనిపిస్తుంది.<ref name=CE11/> కండరాల నొప్పి మాత్రం అందులో సగం మందిలో కనిపించవచ్చు.<ref name=Eccles2005/> యుక్తవయస్కులలో జ్వరం కనిపించదు కానీ పిల్లల విషయంలో మాత్రం ఇది సాధారణం.<ref name=Eccles2005/> ఇన్ ఫ్లూయెంజా తో కూడుకుని ఉండకపోతే తేలికపాటి [[దగ్గు]] ఉంటుంది.<ref name=Eccles2005/> యుక్తవయస్కుల్లో దగ్గు, జ్వరం కనిపిస్తుంటే దాన్ని ఇన్ ఫ్లూయెంజా గా అనుమానించవచ్చు.<ref>Eccles p. 26</ref> జలుబును కలిగించే అనేకమైన వైరస్ లు ఇతర ఇన్ ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు.<ref>Eccles p. 129</ref><ref>Eccles p. 50</ref>
 
ముక్కునుంచి కారే శ్లేష్మం (చీమిడి) [[పసుపు]], పచ్చ లాంటి రంగుల్లో ఉండవచ్చు. దీన్ని బట్టి జలుబు ఏ వైరస్ వల్ల వచ్చిందో చెప్పలేము.<ref>Eccles p. 30</ref>
 
===పురోగతి===
జలుబు సాధారణంగా అలసట, శరీరం చలితో వణకడం, తుమ్ములు, [[తలనొప్పి]] తో ప్రారంభమై రెండు రోజుల్లో ముక్కు కారడం, దగ్గు మొదలవుతుంది.<ref name=E24/> ఈ లక్షణాలు వైరస్ బారిన పడ్డ 16 గంటలలోపు బయటపడతాయి.<ref>{{cite book|editor=Richard A. Helms|title=Textbook of therapeutics: drug and disease management|year=2006|publisher=Lippincott Williams & Wilkins|location=Philadelphia, Pa. [u.a.]|isbn=9780781757348|page=1882|url=https://books.google.com/books?id=aVmRWrknaWgC&pg=PA1882|edition=8.}}</ref> మరో రెండు మూడు రోజుల్లో తీవ్ర స్థాయికి చేరుకుంటాయి.<ref name=Eccles2005/><ref>{{cite book|last=al.]|first=edited by Helga Rübsamen-Waigmann ... [et|title=Viral Infections and Treatment.|year=2003|publisher=Informa Healthcare|location=Hoboken|isbn=9780824756413|page=111|url=https://books.google.com/books?id=AltZnmbIhbwC&pg=PA111}}</ref> సాధారణంగా ఇవి 7 నుంచి పది రోజుల్లో ఆగిపోతాయి కానీ కొంతమందులో మూడు వారాలవరకు ఉండవచ్చు.<ref name=Heik2003/> దగ్గు సగటున 18 రోజుల దాకా ఉంటుంది.<ref name="pmid23319500">{{cite journal | last1 = Ebell | first1 = M. H. | last2 = Lundgren | first2 = J. | last3 = Youngpairoj | first3 = S. | title = How long does a cough last? Comparing patients' expectations with data from a systematic review of the literature. | journal = Annals of Family Medicine | date = Jan–Feb 2013 | volume = 11 | issue = 1 | pages = 5–13 | pmid = 23319500 | doi = 10.1370/afm.1430 | pmc = 3596033}} {{open access}}</ref> మరికొన్ని సందర్భాల్లో వైరస్ ప్రభావం పోయినా దగ్గు ఎక్కువ కాలం ఉంటుంది.<ref name="pmid21198555">{{cite journal |author=Dicpinigaitis PV |title=Cough: an unmet clinical need |journal=Br. J. Pharmacol. |volume=163 |issue=1 |pages=116–24 |date=May 2011 |pmid=21198555 |pmc=3085873 |doi=10.1111/j.1476-5381.2010.01198.x |url=}} {{open access}}</ref> 35%-40% పిల్లల్లో దగ్గు 10 రోజులకంటే ఎక్కువ ఉంటుంది. 10% పిల్లల్లో 25 రోజులకన్నా ఎక్కువ రోజులు ఉంటుంది.<ref>{{cite journal |vauthors=Goldsobel AB, Chipps BE | title = Cough in the pediatric population | journal = J. Pediatr. | volume = 156 | issue = 3 | pages = 352–358.e1 | date = March 2010 | pmid = 20176183 | doi = 10.1016/j.jpeds.2009.12.004 }}</ref>
 
==కారణము==
పంక్తి 43:
 
=== వాతావరణం ===
సాంప్రదాయ వాదం ప్రకారం ఎవరైనా చలి, వాన లాంటి చల్లటి వాతావరణంలో[[వాతావరణం]]లో ఎక్కువ సేపు గడిపితే పడిశం పట్టుకుంటుందని భావిస్తూ వచ్చారు.<ref>{{cite news |author=Zuger, Abigail |title='You'll Catch Your Death!' An Old Wives' Tale? Well.. |newspaper=[[The New York Times]] |date=4 March 2003 |url=http://www.nytimes.com/2003/03/04/science/you-ll-catch-your-death-an-old-wives-tale-well.html}}</ref> జలుబుకు కారణమయ్యే వైరస్ లు ఎక్కువగా చలికాలంలోనే ఎక్కువ కనిపిస్తాయి.<ref>Eccles p. 79</ref> చలికాలం లోనే ఎందుకు వస్తుందనే విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు.<ref name=nhs>{{cite web|title=Common cold – Background information|url=http://www.cks.nhs.uk/common_cold/background_information/prevalence|publisher=National Institute for Health and Clinical Excellence|accessdate=19 March 2013}}</ref> చల్లటి వాతావరణం [[శ్వాస వ్యవస్థలోవ్యవస్థ]]లో కలగజేసే మార్పులు,<ref name="EcclesPg" /> వ్యాధి నిరోధక శక్తిలో తగ్గుదల,<ref name="Mourtzoukou"/> వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం వల్ల వైరస్ సులభంగా సంక్రమించడం, గాలిలో ఎక్కువ దూరం వ్యాపించడమే కాక, ఎక్కువ సేపు నిలవ ఉండటం మొదలైన కారణాలు చూపవచ్చు.<ref>Eccles p. 157</ref>
 
చలికాలంలో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇంట్లోనే ఉండటం, జబ్బు చేసిన వారి సమీపంలో ఉండటం,<ref name="EcclesPg">Eccles p. 80</ref>, ముఖ్యం బడిలో పిల్లలు దగ్గరగా కూర్చోవడం<ref name=Text2007/><ref name=nhs/> లాంటి సామాజిక అవసరాలు కూడా కారణం కావచ్చు. శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల జలుబు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉందనే విషయం పై చిన్న వివాదం ఉంది. కానీ అలా జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉందని ఆధారాలున్నాయి.<ref name="Mourtzoukou">{{cite journal |vauthors=Mourtzoukou EG, Falagas ME | title = Exposure to cold and respiratory tract infections | journal = The International Journal of Tuberculosis and Lung Disease | volume = 11 | issue = 9 | pages = 938–43 | date = September 2007 | pmid = 17705968 | doi = }}</ref>
 
=== ఇతరము ===
పిల్లల్లో శ్వాస సంబంధిత వ్యాధులు సంక్రమించడం ఎక్కువ.<ref name=E78/> ఎక్కువ సార్లు వైరస్ బారిన పడటం వల్ల మనుషుల్లో కొంచెం తట్టుకునే గుణం వస్తుంది. దీని వల్ల సమాజంలో వైరస్ వ్యాప్తి చెందడం తక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం కూడా జలుబుకు అనుకూలమే.<ref name=E78/><ref>Eccles p. 166</ref> [[నిద్రలేమి]], సరైన పోషణ లేకపోవడం లాంటి కారణాల వల్ల కూడా వ్యాధినిరోదక శక్తి తగ్గి రైనో వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. <ref>{{cite journal |vauthors=Cohen S, Doyle WJ, Alper CM, Janicki-Deverts D, Turner RB | title = Sleep habits and susceptibility to the common cold | journal = Arch. Intern. Med. | volume = 169 | issue = 1 | pages = 62–7 | date = January 2009 | pmid = 19139325 | pmc = 2629403 | doi = 10.1001/archinternmed.2008.505 }} {{open access}}</ref><ref>Eccles pp. 160–165</ref> తల్లిపాలు తాగడం వల్ల చిన్న పిల్లల్లో శ్వాస సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది,<ref>{{cite journal|last1=McNiel|first1=ME |last2=Labbok |first2=MH |last3=Abrahams |first3=SW |title=What are the risks associated with formula feeding? A re-analysis and review.|journal=Breastfeeding Review|date=July 2010|volume=18|issue=2|pages=25–32|pmid=20879657}}</ref> అందుకే శిశువుకు జలుబు చేసినప్పుడు కూడా పాలు పట్టడం ఆపవద్దని వైద్యులు సలహా ఇస్తారు.<ref>{{cite book|last=Lawrence|first=Ruth A. Lawrence, Robert M.|title=Breastfeeding a guide for the medical profession|publisher=Mosby/Elsevier|location=Maryland Heights, Mo.|isbn=9781437735901|page=478|url=https://books.google.com/books?id=c4BnozBW3EMC&pg=PA478|edition=7th|date=2010-09-30}}</ref> అభివృద్ధి చెందిన దేశాల్లో పాలు పట్టడం అనేది జలుబుకి నివారణగా భావించడం లేదు.<ref>{{cite book|last=Williams|first=[edited by] Kenrad E. Nelson, Carolyn F. Masters|title=Infectious disease epidemiology : theory and practice|year=2007|publisher=Jones and Bartlett Publishers|location=Sudbury, Mass.|isbn=9780763728793|page=724|url=https://books.google.com/books?id=o_j-G4zJ4cQC&pg=PA724|edition=2nd}}</ref>
 
== వ్యాధివిజ్ఞానశాస్త్రం ==
[[File:Illu conducting passages.svg|thumb|upright=1.3|జలుబు శ్వాస నాళిక పై భాగానికి కలిగే జబ్బు.]]
శరీరంలో ప్రవేశించిన వైరస్ ను ఎదుర్కోవటానికి శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ స్పందన వల్లనే జలుబు లక్షణాలు కలుగుతాయి.<ref name=E112/> ఈ స్పందన వైరస్ ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు రైనోవైరస్ నేరుగా తాకడం వల్ల సంక్రమిస్తుంది. తరువాత ICAM-1 రిసెప్టర్ల ద్వారా వాపును కలిగించే కణాలను విడుదల చేసేలా చేస్తాయి.<ref name=E112/> ఈ కణాలే జలుబు లక్షణాలను కలుగజేస్తాయి.<ref name=E112/> ఇవి సాధారణంగా ముక్కు లోపలి ఉపతలానికి హాని చెయ్యవు.<ref name=Eccles2005/> రెస్పిరేటరీ సింకిషియల్ వైరస్ (Respiratory Syncytial Virus - RSV) కూడా నేరుగా తాకడం వల్ల, గాలి కణాల వల్ల సంక్రమిస్తుంది. ఇది ముక్కులోకి, గొంతులోకి చేరగానే తనంతట తానుగా అభివృద్ధి చెంది క్రమంగా శ్వాసనాళిక కింది భాగంలోకి కూడా వ్యాపిస్తుంది.<ref name=E116>Eccles p. 116</ref> RSV ఉపతలానికి హాని చేస్తుంది.<ref name=E116/> మనుషుల్లో వచ్చే పారాఇన్ ఫ్లూయెంజా వైరస్ ముక్కు, [[గొంతు]], వాయునాళాల్లో వాపును కలుగజేస్తుంది.<ref name=E122>Eccles p. 122</ref> చిన్నపిల్లల్లో ఇది శ్వాసనాళం మీద దాడి చేసినప్పుడు, వారిలో ఆ మార్గం చిన్నదిగా ఉండటం మూలాన విలక్షణ శబ్దంతో (గొర్రె అరుపు) కూడిన దగ్గు వస్తుంది.<ref name=E122/>
 
==రోగనిర్ధారణ==
పంక్తి 64:
==నిర్వహణ==
[[File:Pneumonia strikes like a man eating shark.jpg|thumb|సాధారణ జలుబు యొక్క చికిత్స కోసం "మీ వైద్యుడిని సంప్రదించండి" పౌరులను ప్రోత్సహిస్తున్నటువంటి పోస్టర్]]
సంక్రమణము యొక్క కాలవ్యవధిని తగ్గించేందుకు నిష్కర్షగా ప్రదర్శించబడినటువంటి ఎటువంటి ఔషధాలు లేదా మూలికల[[మూలిక]]ల మందులు ప్రస్తుతము లేవు.<ref>{{cite web| title = Common Cold: Treatments and Drugs| publisher = Mayo Clinic| url =http://www.mayoclinic.com/health/common-cold/DS00056/DSECTION=treatments-and-drugs| accessdate = 9 January 2010}}</ref> ఇట్లా చికిత్స రోగసూచిత లక్షణాలు ఉపశమనమును కలిగి ఉంటుంది.<ref name=AFP07/> చాలా విశ్రాంతి పొందడం, హైడ్రేషన్‌ను నిర్వహించేందుకు ద్రవాలను త్రాగడం, మరియు ఉలెచ్చని ఉప్పు నీటితో [[పుక్కిలించడం]], సముచిత పరిరక్షణ చర్యలు.<ref name="NIAID2006"/> చికిత్స నుంచి చాలా వరకు ప్రయోజనం ఏమైనప్పటికి [[ప్లాసిబో ప్రభావము]] నకు ఆరోపించబడింది.<ref>Eccles Pg.261</ref>
 
===రోగసూచిత లక్షణాలుము===
పంక్తి 84:
 
==సాంక్రమిక రోగ విజ్ఞానం==
సాధారణ జలుబు అనేది అత్యంత సాధారణ మానవ [[వ్యాధి]]<ref name=E1>Eccles Pg. 1</ref> మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ప్రభావితమైతారు.<ref name=Text2007/> వార్షికంగా పెద్దలకు విలక్షణంగా రెండు నుంచి ఐదు సంక్రమణాలు ఉంటాయి<ref name=CE11>{{cite journal |author = Arroll B | title = Common cold | journal = Clinical evidence | volume = 2011 | issue = 3 | pages = | year = 2011 | month = March | pmid = 21406124 | doi = }}</ref><ref name=Eccles2005/> మరియు సంవత్సరంలో పిల్లలు ఆరు నుంచి పది జలుబులు కలగి ఉండవచ్చు (మరియు పాఠశాల పిల్లలకు సంవత్సరంలో[[సంవత్సరం]]లో పన్నెండు జలుబుల వరకు).<ref name=AFP07>{{cite journal | author = Simasek M, Blandino DA | title = Treatment of the common cold | journal = American Family Physician | volume = 75 | issue = 4 | pages = 515–20 | year = 2007 | pmid = 17323712 | doi = | url = http://www.aafp.org/afp/20070215/515.html }}</ref> అధ్వాన్నమౌతున్న రోగనిరోధక వ్యవస్థ కారణంగా పెద్దవారిలో రోగలక్షణాల సూచన సంక్రమణాల రేట్లు పెరుగుతాయి.<ref name=E78>Eccles Pg. 78</ref>
 
==చరిత్ర==
సాధారణ జలుబు యొక్క కారణము 1950ల నుంచి మాత్రమే గుర్తించబడినను వ్యాధి పూర్వకాలము నుంచి మానవజాతితో[[మానవజాతి]]తో కలిసి ఉన్నది.<ref>Eccles Pg. 3</ref> దాని లక్షణాలు మరియు చికిత్స ఈజిప్టియన్ [[ఎబర్స్ పాపిరస్‌]] లో వివరించబడినది, ఇప్పటికి సజీవంగా ఉన్నటువంటి అతి ప్రాచీనమైన వైద్య పాఠము, 16వ [[శతాబ్దము]] బిసిఇకు ముందు వ్రాయబడినది.<ref>Eccles Pg.6</ref> "సాధారణ జలుబు" అనే పేరు 16వ శతాబ్దములో వాడుకలోకి వచ్చింది, దాని లక్షణాలు మరియు చల్లటి వాతావరణముకు గురి అయిన వాటి యొక్క వాటి మధ్య సారూప్యత కారణంగా.<ref>{{cite web | publisher=Online Etymology Dictionary | url=http://www.etymonline.com/index.php?term=cold |title=Cold | accessdate=12 January 2008 }}</ref>
 
యునైటెడ్ కింగ్‌డమ్‌లో, [[మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్ (యుకె)|మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్]] వారిచే 1946 లో [[సాధారణ జలుబు యూనిట్]] నెలకొల్పబడినది మరియు ఇక్కడే 1956లో రైనోవైరస్ కనుగొనబడింది.<ref>Eccles Pg.20</ref> 1970లలో, రైనోవైరస్ సంక్రమణం యొక్క పొదిగే దశ సమయంలో [[ఇంటర్‌ఫెరాన్‌]] తో చికిత్స వ్యాధికి విరుద్ధంగా కొంతవరకు రక్షిస్తుందని సిసియు నిరూపించింది,<ref name="pmid2438740">{{cite journal | author = Tyrrell DA | title = Interferons and their clinical value | journal = Rev. Infect. Dis. | volume = 9 | issue = 2 | pages = 243–9 | year = 1987 | pmid = 2438740 | doi = 10.1093/clinids/9.2.243 }}</ref> కాని ఎటువంటి ఆచరణాత్మక చికిత్స అభివృద్ధి చేయబడలేదు. 1989 లో యూనిట్ మూసివేయబడింది, రెండు సంవత్సరాల తరువాత [[ప్రొఫిలాక్సిస్‌]] లో [[జింక్ గ్లూకోనేట్#జింక్ మరియు సాధారణ జలుబు|జింక్ గ్లూకోనేట్ లోజెంగెస్]] యొక్క పరిశోధన మరియు రైనోవైరస్ జలుబుల యొక్క చికిత్స పూర్తి చేసింది, యూనిట్ యొక్క చరిత్రలో ఒకేఒక విజయవంతమైన చికిత్స.<ref>{{cite journal | author = Al-Nakib W | title = Prophylaxis and treatment of rhinovirus colds with zinc gluconate lozenges | journal = J Antimicrob Chemother. | volume = 20 | issue = 6 | pages = 893–901 | year = 1987 |month = December | pmid = 3440773 | doi = 10.1093/jac/20.6.893 | last2 = Higgins | first2 = P.G. | last3 = Barrow |first3 = I. | last4 = Batstone | first4 = G. | last5 = Tyrrell | first5 = D.A.J. }}</ref>
పంక్తి 114:
 
== జలుబు చేస్తే ==
జలుబు సోకిన వ్యక్తికి మంచి ఆహారం, పండ్ల రసాలు ఇవ్వాలి. రోగి వీపు, రొమ్ముపై యూకలిప్టస్ నూనె రాయాలి. [[ఆవిరి]] పట్టాలి. ఇంకా క్రింది పద్దతులను అనుసరించడం వల్ల ఉపయోగముంటుంది.
* వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు తగ్గుముఖం పడుతుంది.
* పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగవచ్చు.
* ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టె దాకా ఆవిరి పడితె చాలా తేడా కనిపిస్తుంది. దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది.
* [[తులసి]], అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.
* శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని [[కషాయం]] కాచాలి. దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది.
* ఇరవై గ్రాముల [[దాల్చినచెక్క]] పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి.
* ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల [[తేనె]] కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.
<!--అంతర్వికీ లింకులు--->
 
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు