శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
==కుటుంబము==
కృష్ణదేవ రాయలుకు [[తిరుమల దేవి]], [[చిన్నాదేవి]] ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, [[ఆముక్తమాల్యద]] ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల).<ref name=voices1>[http://books.google.com/books?id=PxvDNBc4qwUC&pg=PA118&lpg=PA118&dq=krishnadevaraya#v=onepage&q=krishnadevaraya&f=false Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William Joseph Jackson]</ref> కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=WS9uAAAAMAAJ&q=nagalamba Krishnadeva Raya: the great poet-emperor of Vijayanagara - G. Surya Prakash Rao]</ref> పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. [[ప్రతాపరుద్ర గజపతి]] ని ఓడించి, ఆయన కూతురైన [[తుక్కా దేవి]] ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.<ref>[http://books.google.com/books?id=QaIRAQAAMAAJ&q=krishnadevaraya+wives&dq=krishnadevaraya+wives Encyclopaedia of Indian Literature: K to Navalram - Amaresh Datta, Sahitya Akademi]</ref> [[చాగంటి శేషయ్య]], కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు.<ref name=voices1/><ref>[http://books.google.com/books?id=1N5Hgos5mScC&pg=PA48&lpg=PA48&dq=krishnadevaraya+wives#v=onepage&q=krishnadevaraya%20wives&f=false Courts of Pre-Colonial South India By Jennifer Howes]</ref> కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం<ref>[http://books.google.com/books?id=5OQdAAAAMAAJ&q=tirumaladevi&dq=tirumaladevi Readings in South Indian history - T. V. Mahalingam]</ref> ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు [[1524]] లో మరణించాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు [[తిమ్మరుసు]] ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు [[చంద్రగిరి]] దుర్గమునందున్న సోదరుడు, [[అచ్యుత రాయలు]] ను వారసునిగా చేసాడు.
 
==మతము, కులము==