ఉరుము నృత్యము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శబ్ధం → శబ్దం (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, తో → తో , హైదరాబదు → హైదరాబాదు, రధ → రథ, వున్నార using AWB
పంక్తి 6:
* అర్జున అర్జున ఫల్గుణా
* అర్జున మొండిగోడ కింద
* ముండమోపులున్నారు బద్రం అర్జున... అనే మాటలు వినిపిస్తాయి. [[అర్జునుడు]] ఇంద్రుని కుమారుడు. ఇంద్రుడు మేఘాలకు అధిపతి. వర్షం వచ్చే సమయంలో అర్జునుడి రథం వస్తుందని అ రధరథ చక్రాల అదురులు ఉరుములుగా వస్తాయని గ్రామీణుడి నమ్మకం. ఇప్పటికి ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది. ఈ శబ్దం భయంకరమైనది అయినా దీనిని అనుసరించి చేసే నృత్యం ఆకర్షణీయంగా, హృద్యంగా ఉంటుంది. ([[డా. చిగిచర్ల కృష్ణా రెడ్డి]]; జానపద నృత్య కళ) మతపరమైన కర్మ కాండతో ముడిపడి ఉన్న సాంప్రదాయ కళలు ఏదో ఒక మతానికి కట్టుబడి ఉంటాయి. ఉదాహరణకు గొరవయ్యల నృత్యం శైవ మతారాధనలో భాగమైంది. కానీ ఉరుములోల్లూ మాత్రం అన్ని మతాల దేవతలను ఆరాధిస్తారు.
 
 
ఉరుముల వారిని అక్కమ్మ దేవతల ప్రతిరూపంగా భావిస్తారు. దైవ సమానంగా భావించి ఆ దేవతలను పూజించే సమయంలో వారి కాళ్ళు కడిగి పాదాభివందనం చేస్తారు. నిండు కుండలోని అన్నం ఇంటి ముందుకొచ్చిన ఉరుములోల్లకు భోజనం పెడ్తారు. ఉరుములోల్లు బీజాక్షరాలతో వారిని దీవించడం కనిపిస్తుంది. ఈ బీజాక్షరాల వాక్కులు మూడు. 1. [[అమృత వాక్కు]] 2. [[విషవాక్కు]] 3. [[వేదవాక్కు]].
==రాయల కాలంలో==
[[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] కాలంలో వీరికి మాన్యాలు ఇచ్చినా కాలక్రమేణా అంతరించి పోయి, ప్రస్తుతం కుల వృత్తిని నమ్ముకుంటూ పొట్ట గడవని స్థితిలో డెబ్బై కుటుంబాల దాకా ఉరుములవారు [[అనంతపురం]] జిల్లాలో వున్నారుఉన్నారు. వీరిని [[ఉరుములోళ్ళు]] అని కూడకూడా పిలుస్తారు. వీరు [[మాల]] తెగలో ఎక్కువగా వున్నారుఉన్నారు. [[ఉరుము]] అనబడే చర్మ వాయిద్యం ప్రాచీనమైంది. ఆదిమ జాతుల నర్తన రూపంలో వలయాకార విన్యాసాలు చేస్తూ ఉరుములతో భయంకర మైన శబ్దాలు సృష్టిస్తూ, వీరు చేసే నాట్య అతి గంభీరంగా వుంటుంది.ఉరుముల వాయిద్యం ఒకే సారి ఏక ధాటిగా వాయిస్తే కారు మొయిళ్ళు ఉరుములతో పయనిస్తున్నట్లు భ్రమ వ్వక్త మౌతుంది. అందుకే ఆ వాయిద్యానికి ఉరుము అని పేరు పెట్టారేమో ననిపిస్తుంది. ఒక చేత అరీరణం యొక్క చర్మాన్ని ప్రేము పుల్లలతో రాస్తూ ఈ శబ్దాలు సృష్టిస్తారు. మరో చేతితో పుల్లతో లయ విన్యాసాలు తాళ యుక్తంగా సాగుతాయి. వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న. ఆయన మహాత్య్వ గాథలు ఉరుముపై దరువులు వేస్తూ గాన చేస్తారు. చరణానికి చరణానికీ మధ్య ముక్తాయింపుల్తో గంభీరమైన శబ్దాలు సృష్టించి వలయాకార విన్యాసాలు చేస్తారు:
 
==ఉరుము వాద్య నిర్మాణం==
ఈ ఉరుము వాద్యానికే [[వీరణం]] అని పేరు. చిత్తూరు జిల్లాలో వీరణం అనే వాద్యం ఉంది. కానీ వీరణానికి ఉరుముకు తేడా ఉంది. ఉరుము [[మద్దెల]] ఆకారంలో ఉంటుంది. ఒకటిన్నర అడుగుల వ్యాసార్ధం, రెండున్నర అడుగుల పొడవు ఉంటుంది. ఇత్తడి లేదా కంచు చేత తయారు చేస్తారు. మద్దెల లాంటి ఈ గొట్టానికి ఇరువైపులా మేక చర్మం బాగా శుద్ది చేసి అమర్చబడి ఉంటుంది. రెండువైపులా చర్మాలను బిగించేందుకు రెండు కడియాలు వేస్తారు. చర్మాలకు తాళ్ళ బిగింపు వళ్ళవల్ల మంచి బిగింపు వస్తుంది. ఖాదర కాయ చెట్టు పుల్లలను ఈ వాద్యాన్ని వాయించడానికి ఉపయోగిస్తారు. ఎడమచేతిలోని పుల్లతో రాపాడిస్తారు. ఎడమచేతి లోని పుల్లను జిగుపుపుల్ల అంటారు. కుడి చెతిలోని పుల్లతో వాయిస్తారు. దీనిని కొట్టుడు పుల్ల అంటారు. ఎడమవైపు పుల్లతో రాపాడిస్తే బూర్ బూర్ బూర్ బూర్ అనే శభ్దం వస్తుంది. కుడివైపు పుల్లతో కొడితే డబు, డబు, డబు, డబు అనే శబ్దం వస్తుంది.
 
ఉరుములోల్లు నిష్టాగరిష్టులు. వీరిలో నియమాలు ఎక్కువ. ఇంట్లో ఈత పరకలు వాడరు. [[ఈత చెట్టు]] క్రింద కూర్చోరు. కాళ్ళకు [[చెప్పులు]] ధరించరు. వీరు అక్కమ్మ దేవతను కొలుస్తారు. ఈమె [[గ్రామదేవత]]. ఉరుముల వాళ్ళను [[అక్కమ్మ దేవత]]కు ప్రతిరూపంగా భావిస్తారు. వీరు అక్కమ్మ దేవత సృష్టి అని చెప్పడానికి ఒక కథ ఉంది.
 
[[శివుడు]] తన తలలోని నాలుగు [[జడపాయ]]లను నాలుగు లోకాలకు విస్తరిస్తాడు. నాగలోకంలోని అక్కమ్మ శివుని జడను చూసి ఈ జడయే ఇంత సుందరంగా ఉంటే కైలాస సౌందర్యం ఎలా ఉంటుందోనని ఆ జడ ద్వారా కైలాసం చేరుకుంటుంది. పార్వతి పరమేశ్వరులు అక్కమ్మను భూలోకం ఏలుకోవడానికి అనుమతి ఇస్తారు. అక్కమ్మ పంచాంగం అడగడానికి పాల కొండమల దగ్గర ఉన్న బ్రహ్మ ముని దగ్గరకు పోతుంది. బ్రహ్మ ముని భయపడి గుహలో దాక్కుంటాడు. అక్కమ్మ పిలిచినా బ్రంహముని పలకడు. అక్కమ్మ మట్టి తోమట్టితో రెండు బొమ్మలను చేసి వాటికి ప్రాణం పోసి సింగరయ్య, సోమన్న అని పేర్లు పెట్టి వేపమాను తొలిపించి మేకచర్మంతో రెండువైపుల మూయించి కుదురు పుల్లలతో వాద్యాన్ని వాయించమని పురమాయించిందని, ఆ వాద్యాల ద్వనులు ఓంకారంలా ద్వనించి ఉరుములా వినిపిస్తే బ్రహ్మ ముని బయటకు వచ్చాడని సింగరయ్య, సోమన్నలకు అక్కమ్మ బీజాక్షరాలను ప్రసాదించిందని కథ.
 
==వాయిద్యపు తీరు==
పంక్తి 85:
 
==[[మేలుకొలుపు పాట]]==
*[[ఉరుము నృత్యం]] [[మేలుకొలుపు పాట]]తో మొదలవుతుంది. మేలుకొలుపు పాటలొపాటలో ఎడంచేతి పుల్లతో రాపాడించడం ఉండదు. కేవలం కుడిచేతి పుల్లతో కొట్టడం మాత్రమే ఉంటుంది.
<poem>
మేలూకొనవే వో మేలూకొనవే
పంక్తి 121:
</poem>
 
ఉరుము వాద్యం అనంతపురం జిల్లాలో మాత్రమే కనిపిస్తుంది. [[ధర్మవరం]], [[కళ్యాణదుర్గం, కుందుర్పి, రొద్దం, గూగూడు, [[ముదిగుబ్బ]], కమ్మవారిపల్లె, [[గుంజేపల్లె]] వంటి ప్రాంతాల్లో [[ఉరుములోల్లు]]న్నారు. ఉరుము నృత్యాన్ని గురించి పరిశోధన చేసిన వారిలో [[డా. ఛిగిచెర్ల కృష్ణారెడ్డి]] ప్రముఖులు. వీరు హైదరాబదుహైదరాబాదు లోని [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో]] రీడర్ గా పనిచేస్తున్నారు.
 
==పతాక సన్నివేశం==
పంక్తి 128:
==కళాకారులు==
 
ఈ నాడు అనంత పురం జిల్లాలో వురుముల కథల్లో పాల్గొనే కళాకారులు ఉరుముల నారాయణ, ఉరుముల నారాయణ స్వామి, వురుముల నాగన్న, ఉరుముల చంద్రప్ప, ఉరుముల ఆంజనేయులు మొదలైన వారు కళను ప్రచారం చేస్తూ, దేవతల కొలువులు చేయిస్తూ జీవితాలను సాగిస్తున్నారు. ఇలా ఉరుములోళ్ళు ధర్మవరం, సుబ్బారావు పేట, ముస్టూరు, గూగూరు, మేడాపురం, రేగాటి పల్లె మొదలైన చోట్ల వున్నారుఉన్నారు. ఈ మాదిరి ఉరుముల బృందాలు ఆంధ్ర దేశంలో మరెక్కడా లేవు.
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/ఉరుము_నృత్యము" నుండి వెలికితీశారు