నిర్మలమ్మ అసలు పేరు '''రాజమణి'''. స్వస్థలం [[కృష్ణా జిల్లా]] [[బందరు]]. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1943లో తన పదహారేళ్ల వయసులో '[[గరుడ గర్వభంగం]]' సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి [[నందమూరి తారక రామారావు|ఎన్.టీ రామారావు]], [[అక్కినేని]], [[యస్వీఆర్]] ల నుంచి నేటి [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[వెంకటేష్]] వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. [[మయూరి]], [[సీతారామరాజు]] సినిమాలకు నంది, అవార్డులను అందుకున్నారు.
[[శంకరాభరణం]], [[యమగోల]], [[పదహారేళ్ల వయసు]], [[మావిచిగురు]], గ్యాంగ్‌లీడర్[[గ్యాంగ్ లీడర్]], [[శుభసంకల్పం]], ఆపద్భాంధవుడు[[ఆపద్బాంధవుడు]], [[స్వాతిముత్యం]] తదితర చిత్రాల్లో వయసుమీదపడినావయసు మీద పడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. ''[[స్నేహం కోసం]]'' చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ''[[ప్రేమకు ఆహ్వానం]]''.కులో నటించడానికి ఒప్పించాడు.