భానుమతీ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే [[తెలుగు సినిమాలు 1939|1939]] లో విడుదలైన [[వరవిక్రయం]] అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.
 
ఆమె [[1943]], [[ఆగష్టు 8]] న [[తమిళ]] , [[తెలుగు]] చిత్ర నిర్మాత, [[డైరెక్టరు]], ఎడిటరు అయిన శ్రీ [[పి.యస్. రామకృష్ణారావు]] ను ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం [[భరణి]]. ఈ భరణి పేరుమీదనే [[భరణీ స్టూడియో]] నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
 
[[2005]] [[డిసెంబర్ 24]] న [[చెన్నై]] లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.
"https://te.wikipedia.org/wiki/భానుమతీ_రామకృష్ణ" నుండి వెలికితీశారు