ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (2), లో → లో , ను → ను (5), గా → గా (2), ఉన్నది. → ఉంద using AWB
పంక్తి 24:
}}
 
'''ఐజాక్ మెరిట్ సింగర్''' ([[అక్టోబరు 27]] , [[1811]] - [[జూలై 23]] , [[1875]]) అమెరికన్ ఆవిష్కర్త, నటుడు మరియు పారిశ్రామిక వేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరణ అయిన [[కుట్టు మిషను]] ను ఆవిష్కరించాడు. ఈయన [[:en:Singer Corporation| సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ]] యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను ఇంటిలోని దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు<ref>[http://www.shveya.org/history_zinger/ Все о швейных машинах -История создания корпорации Зингер<!-- Bot generated title -->]</ref>
 
==తొలినాళ్ళు==
పంక్తి 32:
 
==మొదటి ఆవిష్కరణలు==
1839 లో సింగర్ రాళ్ళను డ్రిల్లింగ్ చేసే యంత్రాన్ని కనిపెట్టి దానిపై పేటెంటును పొందాడు. ఈ పేటెంటు హక్కును ఇల్లినాయ్ & మిషిగన్ కెనాల్ కంపెనీకి రెండువేల డాలర్లకు అమ్మాడు. అలా సమకూరిన డబ్బుతో తన నట జీవితాన్ని తిరిగి కొనసాగించాలని అనుకున్నాడు. ఆయన తన ఆశయం కోసం ఆయన ఒక నట వర్గాన్ని ప్రోగుచేసుకొని దేశమంతా పర్యటన ప్రారంభించాడు. ఈ బృందానికి "మెరిట్ ప్లేయర్స్" అనే పేరుపెట్టాడు. బృందం యొక్క ప్రదర్శనలలో సింగర్ "ఐసాక్ మెరిట్" అనే పేరుతో పాల్గొనేవాడు. ఈయన సరసన ఆ బృందంలో "మేరీ అన్న్" "మిసెస్ మెరిట్" గా ప్రదర్శనలిచ్చేది{{Citation needed|date=March 2011}}. ఆ బృందం యొక్క ప్రదర్శనా పర్యటన ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది.
 
సింగర్ చెక్కను మరియు లోహాన్ని తొలుచే యంత్రాన్ని అభివృద్ధి చేసి ఏప్రిల్ 10, 1849 న దానిపై పేటెంటును నమోదుచేశాడు.
 
38 వ సంవత్సరంలో ఆయన మేరీ అన్న్ మరియు ఎనిమిదిమంది పిల్లలతో [[న్యూయార్క్]] నగరానికి తిరిగి వచ్చాడు. అచట ఆయన చెక్క బల్లలను కోసే యంత్రాన్ని మార్కెట్ లోకి విడుదల చేయాలనుకున్నాడు. పూర్తిస్థాయిలో పనిచేసే నమూనా యంత్రాన్ని తయారుచేసేందుకు ఎ.బి.టైలర్ అండ్ కో వద్ద అడ్వాన్సును పుచ్చుకొని వాళ్ళ షాపులోనే ఒక నమూనా యంత్రాన్ని నిర్మించాడు. అక్కడే తన భవిష్యత్తు ఆర్ధిక భాగస్వామి, పెట్టుబడిదారుడు జి.బి.జీబర్ ను కలుసుకున్నాడు. అయితే నమూనా యంత్రం తయారైన కొంతకాలానికే ఆ షాపులో ఆవిరి బాయిలర్ పేలి, నమూనా యంత్రాన్ని కూడా నాశనం చేసింది. జీబెర్ బోస్టన్ (ప్రింటింగ్ ట్రేడ్ కేంద్రం) లో తిరిగి కొనసాగించేందుకు సింగర్‌ను ఒప్పించాడు. 1850 లో సింగర్ బోస్టన్ వెళ్ళి తన ఆవిష్కరణను "ఆర్సన్ సి.ఫెల్ప్స్" షాపులో ప్రదర్శించాడు. సింగర్ యొక్క చెక్క కోసే యంత్రానికి మాత్రం పెద్దగా ఆర్డర్లులేవు.
 
ఫెలిఫ్స్ షాపులో లెరో అండ్ బ్లాడ్గెట్ (కుట్టు మిషన్లు) యంత్రాలు తయారీ మరియు రిపైర్ చేయబడుతుండేవి. ఫెల్ప్స్ తయారీకి క్లిష్టంగా ఉన్న తయారీ మరియు ఉపయోగాలు గల ఆ యంత్రాలను చూచి సరిచేయాలని చెప్పాడు <ref name=pbs>{{cite web |url=http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html |title=Isaac Merritt Singer |publisher=[[Public Broadcasting Service|PBS]] |accessdate=March 10, 2011}}</ref> సింగర్ ఆయంత్రంలో వృత్తాకార మార్గంలో కాకుండా సరళరేఖలో షటిల్ చలించేటట్లు చేసి, సూదిని వక్రంగా కాకుండా సరళరేఖలో పోవునట్లు చేయడం వలన సులువుగా కుట్టవచ్చని నిర్థారించాడు. సింగర్ ఆగష్టు 12, 1851 లో యునైటెడ్ స్టేట్స నుండి 8294 సంఖ్యగల పేటెంట్ హక్కును పొందాడు.
పంక్తి 43:
 
==ఐ.ఎం.సింగర్ & కంపెనీ==
1856 లో ఈ యంత్రం తయారీదారులైన గ్రోవెర్ అండ్ బాకెర్, సింగర్ అంరియు వీలర్ అండ్ విల్సన్ లు పేటెంట్ ఉల్లంఘన గూర్చి ఒకరినొకరు నిందించుకుంటూ న్యూయార్క్ నందులో ఆల్బనీలో కలుసుకొని తమ వాదాలను పరిష్కరించుకున్నారు. ఓర్లాండో B. పోటర్ (గ్రోవర్ మరియు బేకర్ కంపెనీ న్యాయవాది మరియు అధ్యక్షుడు) వారి లాభాలను విచ్చలవిడిగా వ్యాజ్యం కోసం ఖర్చుచేయకుండా వారి యొక్క పేటెంట్లను విలీనం చేయాలని ప్రతిపాదించాడు{{ఆధారం}}. ఈ విధానం క్లిష్ట యంత్రాల ఉత్పత్తి కోసం న్యాయ ప్రతేక హక్కులను అనుమతిస్తుంది. వారు కుట్టు యంత్రాల సంయుక్త ప్రతిపాదనకు అంగీకరించారు. కానీ వాటిని ఏవిధంగానైనా ఉపయోగించుటకు వారు ఇప్పటికీ కొన్ని కీలక నిరాటంకమైన పేటెంట్లు జరిపించిన "ఎలియాస్ హ్యూ" యొక్క సహకారాన్ని పెటెంట్ రక్షణ కోసం పొందారు. నిబంధనలు ఏర్పాటు చేశారు; హ్యూ ప్రతి కుట్టుయంత్రం పై రాయల్టీని సంపాదించాడు.{{ఆధారం}}
 
కుట్టుపని యంత్రాలు చాలా అధిక సంఖ్యలో తయారు కావడం మొదలైంది. 1856 లో ఐ.ఎం.సింగర్ అండ్ కంపెనీ 2564 యంత్రాలను తయారుచేసింది. 1860 లో 13,000 యంత్రాలను న్యూయార్క్ నందులో గల మోట్ స్ట్రీట్ వద్ద గల ప్లాంట్ లో తయారుచేశారు. తర్వాత ఎలిజిబెత్, న్యూజెర్సీలో పెద్ద ప్లాంట్ ప్రారంభమైనది<ref>[http://www.sil.si.edu/digitalcollections/trade-literature/sewing-machines/browse-lists/all-libraries.htm]</ref>. అప్పటి వరకు కుట్టు యంత్రాలను దుస్తులు, బూట్లు, బ్రిడిల్స్ మరియు టైలర్స్ కొరకు తయారుచేయబడిన పారిశ్రామిక యంత్రాలు. కానీ 1856 లో గృహ వినియోగానికి అవసరమైన చిన్న కుట్టు యంత్రాన్ని మార్కెట్ లో విడుదల చేశారు. ఈ యంత్ర ధరను $100 గా నిర్ణయించారు. కొన్ని అమ్మబడినవి<ref name=mit>{{cite web |url=http://web.mit.edu/invent/iow/singer.html |title=Inventor of the Week / Isaac Merrit Singer (1811-1875) |publisher=[[Lemelson Foundation#Initiatives supported in the United States|Lemelson-MIT Program]] |accessdate=March 10, 2011}}</ref> సమ్యూల్ కోట్స్ మరియు ఎలి వైట్నీ లువైట్నీలు వారి తుపాకీలలో ఉపయోగించుటకు అభివృద్ధి చేసిన మార్చుకునే వీలున్న యంత్రభాగాల భావనను ఉపయోగించి కుట్టు యంత్రాలలో కూడా మార్చుకొనే విడిభాగాలను తయారుచేయుటకు సింగర్ పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అదే సమయంలో తన [[లాభం]] 530% పెరుగుతున్న సమయంలో, సగం ధర కోత చేయగలిగింది<ref name=mit/> మార్కెట్లో కుటుంబం ఉపయోగించు యంత్రం "ద టర్టిల్ బేక్" ను సింగర్ మొట్టమొదట తయారుచేశాడు. దాని ధర పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసు ప్రకారం $10. కు తగ్గినది. ఆయన భాగస్వామి ఎడ్వర్డ్ క్లార్క్ అమ్మకాలను పెంచడానికి వాయిదాల కొనుగోలు ప్రణాళికలను సిద్ధం చేశాడు."<ref name=pbs/>
 
ఐ.ఎం.సింగర్ తన వ్యాపారాన్ని ఐరోపాకూ విస్తరించాడు. ఆయన గ్లాస్గో వద్ద క్లైడ్ బాం వద్ద కర్మాగారాన్ని నెలకొల్పాడు. మాతృ సంస్థ నియంత్రణలో మొదటి అమెరికన్ ఆధారిత [[బహుళజాతి సంస్థ]] లు [[పారిస్]] మరియు [[రియో డి జనైరో]] లలో నెలకొల్పబడ్డాయి.
 
==వివాహాలు, విడాకులు మరియు పిల్లలు ==
ఆర్థిక విజయంతో సింగర్, న్యూయార్క్‌లోని ఐదవ ఎవెన్యూ లోఎవెన్యూలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అందులోకి 1860 లో తన రెండవ కుటుంబాన్ని మార్చాడు. స్టీఫెన్ కెంట్ తో అక్రమ సంబంధముందన్న ఆధారంతో సింగర్ తన మొదటి భార్య క్యాథరిన్ కు విడాకులు ఇచ్చాడు. మేరీ అన్న్ తో సహజీవనం యధాతథంగా కొనసాగించాడు. ఒక రోజు అనుకోకుండా మేరీ అన్న్‌కు, ఐజాక్ తన వద్ద పనిచేస్తున్న మేరీ మెక్‌గోనిగల్ అనే ఒక ఉద్యోగి పక్కన కూర్చుని ఐదవ ఎవెన్యూలో వివహరిస్తూ కనపడేవరకు ఈ సహచర్యం కొనసాగింది. మేరీ అన్న్‌కు అంతకు మునుపే మేరీ మెక్‌గోనిగల్‌పై ఉన్న అనుమానం ఋజువైంది. అయితే అప్పటికే, మెక్‌గోనిగల్ సింగర్ యొక్క ఐదుగురు పిల్లలకి జన్మనిచ్చింది. ఈ కుటుంబ సభ్యుల యింటిపేర్లు మాథ్యూస్ గా వాడబడినవి. మేరీ అన్న్ (ఇంకనూ మిసెస్ ఐ.ఎం.సింగర్ గా పిలుచుకొనేది) తన భర్తను రెండవ వివాహం నకు అరెస్టు చేయించింది. సింగర్ బెయిలుపై విడుదలై, 1862 లో మేరీ మెక్ గోనియల్ తో సహా లండన్ పారిపోయాడు. ఆ తరువాత ఈ విషయపు దృష్టాంతంలో ఐజాక్‌కు లోవర్ మన్‌హాటన్లో మేరీ ఈస్ట్‌వుడ్ వాల్టర్స్ అనే మరో భార్య ఉందని వెలికివచ్చింది. ఆమెతో పుట్టిన కుమార్తె ఆలిస్ ఈస్ట్‌వుడ్, మెరిట్ ను యింటిపేరుగా స్వీకరించింది. 1860 లో ఐజాక్ తనకు మొత్తం నలుగురు స్త్రీలతో పద్దెనిమిది మంది సంతానం (అప్పటికి 16 మంది జీవించి ఉన్నారు) ఉన్నట్టు అంగీకరించాడు.
 
ఐజాక్ లండన్లో ఉండగా, మేరీ ఆన్, ఐజాక్ ఆస్తులన్నింటి మీద ఆర్ధిక హక్కులను సాధించేందుకు ఐజాక్ యొక్క అక్రమసంబంధాలను వివరిస్తూ దస్తావేజులను పంపించింది. తనకు ఐజాక్ తో సాంప్రదాయకంగా ఎప్పుడూ పెళ్లిపెళ్ళి జరగకపోయినా, ఉమ్మడి చట్టం ప్రకారం ఐజాక్ తన మొదటి భార్య కాథరిన్‌కు విడాకులిచ్చిన తర్వాత తనతో ఏడునెలలు కలిసి ఉండటం వలన భార్యాభర్తలైనట్టు న్యాయస్థానంలో దరఖాస్తు పెట్టుకుంది. తుదకు న్యాయస్థానం ఈ విషయంపై ఒక ఒప్పందం కుదిర్చింది కానీ విడాకులు మంజూరు చేయలేదు. తను ఎవరినైనా పెళ్ళిచేసుకునేందుకు స్వతంత్రురాలినని ప్రకటించుకొని జాన్ ఈ.ఫాస్టర్ ను వివాహమాడింది. ఇదిలా ఉండగా ఐజాక్ 1860 లో పారిస్ నివసిస్తున్నప్పుడు పరిచయమైన ఫ్రెంచి వనిత ఇసబెల్లా యూజీన్ బోయర్ ను తిరిగి సంబంధమేర్పరచుకొన్నాడు. ఆమె తన భర్తను వదిలి జూన్ 13, 1863న ఇసబెల్లా యూజీన్ సోమర్‌విల్ల్ అనే పేరుతో గర్భవతిగా ఉన్నప్పుడే ఐజాక్ ను పెళ్ళిచేసుకొంది. ఇసబెల్లాతో ఐజాక్ కు ఇద్దరు కూతుర్లు మరియు నలుగురు కుమారులు కలిగారు. ఐజాక్ మరణం తర్వాత ఈమె 1879లో ఈమె విక్టర్ ర్యూబ్సెట్ (మ.1887) ను, ఆ తర్వాత 1891 లో పాల్ సొహేజ్ ను పెళ్ళిచేసుకొంది.
 
==ఐరోపాలో చివరి రోజులు ==
[[Image:Singer grave.jpg|250px|thumb|right|టార్క్వే శ్మశానవాటికలో సింగర్ సమాధి ]]
 
1863 లో ఐ.ఎం.సింగర్ అండ్ కో పరస్పర అంగీకారం ద్వారా రద్దు చేసుకొని 1887 లో "ది సింగర్ తయారీ కంపెనీ" గా తన వ్యాపారాన్ని కొనసాగించింది.
 
1871 లో సింగర్ ఇంగ్లండ్ లో పెయింటన్ వద్ద ఒక ఎస్టేటును కొనుగోలు చేశాడు. తాను ఓల్డ్ వే మాన్షన్ ను తన వ్యక్తిగత నివాసంగా ఏర్పాటుచేసుకున్నాడు. దానిని ఆయన మూడవ కుమారుడు, పారిస్ సింగర్ వెర్సెయిల్స్ ప్యాలెస్ శైలిలో పునర్నిర్మించాడు.
 
==వారసులు==
ఐజాక్ యొక్క ఇరవైయ్యో సంతానం, విన్నరెట్టా సింగర్ (ఇసబెల్లా బోయెర్ కూతురు) తన 22వ యేట 1887లో ప్రిన్స్ లూయీ దే స్కీ-మాంట్‌బెలిర్డ్ ను వివాహమాడింది. 1891లో ఈ వివాహం తెగతెంపులైన తర్వాత, ఈమె 1893లో ప్రిన్స్ ఎడ్మండ్ దే పొలినాక్ ను పెళ్ళిచేసుకొంది. ఆ తర్వాత కాలంలో ఈమె ఫ్రెంచి అవాంట్ గార్డ్ సంగీతానికి ప్రముఖ పోషకురాలైంది. మచ్చుకు ఎరిక్ సేటీ తన సొక్రాటే అనే సంగీత ఖండాన్ని ఆమె పురమాయింపుతోనే సృష్టించాడు. లెస్బియనుగా ఈమెకు 1923 నుండి ఇంగ్లీషు రచయిత్రి వయొలెట్ ట్రెఫూసిస్ తో సంబంధం ఉన్నదిఉంది.
 
ఐజాక్, ఇసబెల్లా బోయెర్ల యొక్క మరో కూతురైన, ఇసబెల్-బ్లాంచ్ సింగర్ (1869–1896), జాన్ డూక్ దే డెకాజెస్ ను పెళ్ళిచేసుకుంది. డెయిజీ ఫెల్లోస్ వీరి కూతురే. ఇసబెల్-బ్లాంచ్ 1896లో ఆత్మహత్య చేసుకొంది.
 
ఐజాక్ యొక్క పెద్ద కుమారుడు, 1914లో మరణించిన విలియం సింగర్, సారా సింగర్ వెబ్ తో వివాహం ద్వారా విలియం సువర్డ్ వెబ్‌కు స్వయానా బావమరిది. విలియం వెబ్ భార్య వాండర్బిల్ట్ వంశానికి చెందిన ఎలీజా వాండర్బిల్ట్. విలియం సింగర్ కూతురు, ఫ్లోరెన్స్ సింగర్ (ఆ తర్వాత కాలంలో కౌంటెస్ వాన్ డిర్న్), తన మేనత్తలు విన్నరెట్టా మరియు ఇసబెల్‌ల మాదిరిగానే ఐరోపా సాంప్రదాయ రాజకీయ కుటుంబంలో పెళ్ళిచేసుకొంది.
 
ఐజాక్ రెండో కుమారుడు పారిస్ యూజీన్ సింగర్ (జ. పారిస్, 20 ఫిబ్రవరి 1867; మ. లండన్, 24 జూన్ 1932), సిసీలియా హెన్రియట్టా ఆగస్టా "లిల్లీ" గ్రహామ్ ను పెళ్ళిచేసుకున్నాడు (జ. [[పెర్త్]] [[ఆస్ట్రేలియా]], 6 జూన్ 1867; మ. పెయింటన్, 7 మార్చి 1951).
 
వాష్టింగన్ సింగర్, (ఇసబెల్లా బోయెర్ కుమారుడు) ఆ తర్వాత కాలంలో ఎక్సీటర్ విశ్వవిద్యాలయంగా రూపుదాల్చిన యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సౌత్-వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యొక్క ప్రధానదాత. విశ్వవిద్యాలయంలో ఒక భవనానికి ఈయన పేరే పెట్టారు.
 
సింగర్ కుటుంబపు ప్రముఖ వారసులలో హెర్బర్ట్ మోన్రోస్ సింగర్ (జ. పెయింటన్, 22 జూన్ 1888; మ. [[లండన్]], 3 నవంబర్ 1941), సీసిల్ మార్టిమర్ సింగర్ (జ. [[లండన్]], 16 జూలై 1889; మ. [[న్యూయార్క్]], 28 జనవరి 1954 ), పారిస్ గ్రహామ్ సింగర్ మరియు జార్జెస్ ఫర్క్వార్ సింగర్ (జ. లండన్, 28 ఫిబ్రవరి 1892; మ. డేటోనా బీచ్, ఫ్లోరిడా, 19 జూలై 1955) మరి కొందరు.
పంక్తి 85:
==ఇతర లింకులు==
*[http://www.rootsweb.com/~nyrensse/bio206.htm Biography]
 
 
{{DEFAULTSORT:Singer, Isaac}}
[[Categoryవర్గం:1811 జననాలు]]
[[Categoryవర్గం:1875 మరణాలు]]
[[Categoryవర్గం:అమెరికాలో ప్రసిద్దులు]]
[[Categoryవర్గం:అమెరికా పారిశ్రామికవేత్తలు]]
[[Categoryవర్గం:న్యూయార్క్ ప్రజలు]]
[[వర్గం:ఆవిష్కర్తలు]]
[[వర్గం:అమెరికన్ ఆవిష్కర్తలు]]