ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ( → ( (2), లో → లో , ని → ని using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధ → గ్రంథ, లబం → లభం, ఉన్నది. → ఉంది., → using AWB
పంక్తి 13:
==మహాయాన కాలం==
[[బొమ్మ:AP Amaravathi Stupam model.JPG|right|thumb|200px|అమరావతి స్థూపం నమూనా]]
మహాయానానికి ఆంధ్రదేశం జన్మస్థలం అనవచ్చును. ఇక్కడినుండి "మాధ్యమిక వాదం" లేదా "శూన్యవాదం" సిద్ధాంతకారుడు [[నాగార్జునుడు]] మహాయానానికి ఊపిరి పోశాడు. ఆర్యదేవుడు (మాధ్యమిక వాదం వ్యాఖ్యాత), బుద్ధపలితుడు (మాధ్యమిక వాదంలో ప్రసంగిక సంప్రదాయానికి ఆద్యుడు), భావవివేకుడు (స్వతంత్రిక సంప్రదాయం గురువు), దిజ్ఞాగుడు (బౌద్ధ మీమాంస కారుడు), ధర్మకీర్తి (తర్కంలో నిష్ణాతుడు) తరువాతి మూడు శతాబ్దాలలోను బౌద్ధానికి దీపస్తంభాలలా నిలచారు. థేరవాద సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన బుద్ధఘోషుడు 4వ శతాబ్దంలో పలనాడు ప్రాంతంలో జన్మించాడు. త్రిపిటకాలపై అతని "విశుద్ధి మాగ్గ" అనే భాష్యం థేరవాదంలో అనన్యమైన గౌరవం కలిగి ఉన్నదిఉంది.<ref name="Bhikku"/>
[[File:Bavikonda Mahastupa Visakhapatnam AP.jpg|thumb|200px|[[బావికొండ]] మహా స్తూపం]]
[[బొమ్మ:Guntupalli Buddist site 8.JPG|thumb|మధ్య|200px|గుంటుపల్లి స్థూపాలు]]
పంక్తి 40:
కృష్ణానదీ తీరాన వెలసిన మరొక ఆరామస్థానం జగ్గయ్యపేట అప్పటిలో "ఎలగిరి" అనబడేది. క్రీ.పూ.2వ శతాబ్దిలోనే ఇక్కడ మహాచైత్యవిహారాదులు వెలిశాయి. ఇక్కడి పుణ్యశాలా శిల్పంలో మహాబలిపురం రాతిరధాలను, అజంతా చిత్రాలను పోలిన రీతి ఉంది. మహాయాన సిద్ధాంతకర్త ఆచార్యనాగార్జునుని స్థానమైన శ్రీపర్వతంలోని మహాచైత్యవిహారాలు కూడా బుద్ధధాతువుపైనే నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. ఇక్కడి విహారాన్ని "పారావత విహారం" అని చైనా యాత్రికుడు [[ఫాహియాన్]] పేర్కొన్నాడు. ఇక్కడ ఐదు అంతస్తుల భవనంలో పెద్ద గ్రంథాలయం ఉండేది. సింహళదేశపు యాత్రికులకోసం ప్రత్యేక విహారాలుండేవి. ఇక్కడినుండి మహాయానం చైనా, టిబెట్ వంటి దేశాలకు వ్యాపించింది.
 
[[వేంగి]]ని హ్యూన్‌ త్సాంగ్ "పింగ్-కీ-లో" అని వ్రాశాడు. ఇక్కడ అచల అర్హతుడు ఇరవై సంఘారామాలు నిర్మించాడని, వాటిలో మూడువేల బౌద్ధ భిక్షువులు ఉండేవారని వ్రాశాడు. ఇక్కడ చైత్యగృహంలో జనబోధిసత్వుడు నివశిస్తూ తర్కశాస్త్రం వ్రాశాడట. ఆ జనబోధిసత్వుడే దిజ్ఞాగుడు అని చరిత్రకారులు భావిస్తున్నారు.
 
'''వజ్రయాన కేంద్రాలు''': ఉత్తరాంధ్ర తీరంలోని రామతీర్థం, [[శాలిహుండం]], [[బొజ్జన్నకొండ]], సంఘరం వంటి క్షేత్రాలలో వజ్రయానపు చిహ్నాలు ఎక్కువగా కనిపిస్తాయి. కళింగపట్నం రేవునుండి వజ్రయానం సుమత్రాదీవులకు పయనించి ఉండవచ్చును. సంఘరం అసలు పేరు సంఘారామం కావచ్చును. ఆరామతీర్థం రామతీర్థంగా పరిణమించి ఉండవచ్చును. ‍‌బొజ్జన్నకొండలోని లింగాలమెట్టయే బోరోబదూరు బౌద్ధక్షేత్రానికి నమూనా అయ్యిందని ఒక అభిప్రాయం<ref name="BSL"/>.
పంక్తి 155:
 
;[[రంగారెడ్డి జిల్లా]]
* గాజులభండ
* గాజులబండ
 
;[[గుంటూరు జిల్లా]]
పంక్తి 165:
* [[భట్టిప్రోలు]]
* [[బుద్ధాం]]
* గ్రంధసిరిగ్రంథసిరి (అచంపేట)
* [[వేల్పూరు]] (అచంపేట)
* [[చేజర్ల]]