కోన ప్రభాకరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (3), ప్రాధమిక → ప్రాథమిక, ఉన్నది. → ఉంది using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Kona Prabhakararao.jpg|right]]
'''కోన ప్రభాకరరావు''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర మాజీ [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు|శాసనసభ సభాపతి]], [[కాంగ్రేస్ పార్టీ]] కి చెందిన రాజకీయ నాయకుడు మరియు 1940లలో [[తెలుగు సినిమా]] నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.
==విద్యాభ్యాసం==
ప్రభాకరరావు [[1916]], [[ జూలై 10]]న [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] లో జన్మించాడు. ప్రాధమికవిద్యప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని [[మద్రాసు]] లోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత [[పూణే]] లోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.
 
పాఠశాలలో ఉండగా [[మోతీలాల్ నెహ్రూ]] మరణించిన సందర్భముగా తరగతుల బహిష్కరణ నిర్వహించాడు. [[ఉప్పు సత్యాగ్రహము]] లోనూ చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి [[ఖాదీ]] వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశాడు.
==రాజకీయ జీవితం==
ప్రభాకరరావు 1940 లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ [[శాసన సభ]] కు తొలిసారిగా ఎన్నికైనాడు. ఈయన [[బాపట్ల శాసనసభ నియోజకవర్గం]] నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972 మరియు 1978) శాసనసభకు ఎన్నికైనాడు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతిగా నియమితుడైనాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. [[భవనం వెంకట్రామ్]] మరియు [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] మంత్రివర్గాలలో ఆర్ధిక మరియు ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశాడు.
==గవర్నరుగా==
ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న [[పాండిచ్చేరి]] గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17న [[సిక్కిం]] గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 1985, మే 30 న [[మహారాష్ట్ర]] గవర్నరుగా నియమితుడైనాడు. 1986 ఏప్రియల్ లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చెలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడడంతో మహారాష్ట్ర గవర్నరు పదవికి రాజీనామా చేశాడు. <ref>President Shankar Dayal Sharma, the Scholar and the Statesman By Attar Chand పేజీ.46 [http://books.google.com/books?id=iCReqnq6j0oC&pg=PA46&dq=Kona+Prabhakar+rao]</ref>
==క్రీడలు, సినిమాలు==
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల మరియు ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ [[కుస్తీ]] లు పట్టేవాడు. మరియు బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉన్నదిఉంది. తొలినాళ్ళలో అనేక [[తెలుగు సినిమా]] లను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో [[మంగళసూత్రం]], [[నిర్దోషి]], [[ద్రోహి]] మరియు [[సౌదామిని]].<ref>[http://www.imdb.com/name/nm0464807/ ఐ.ఎమ్.డి.బి.లో కోన ప్రభాకరరావు పేజీ.]</ref>
==శాసనసభ్యునిగా==
బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంత ఊరులో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/కోన_ప్రభాకరరావు" నుండి వెలికితీశారు