కోలాటం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థంభ → స్తంభ, వున్నాయి. → ఉన్నాయి. (4), వున్నది. → ఉంది., using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లొ → లో, లో → లో , వీథుల్లో → వీధుల్లో, పద్దతి using AWB
పంక్తి 1:
[[దస్త్రం:DSCN0111.JPG|thumb|300px|కోలాటం ఆడుతున్న పిల్లలు.]]
ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళా రూపాలతో పాటు ఈ '''కోలాట నృత్యం''' కూడా తెలుగు జానపదుల జీవితాలతొ పెన వేసుకుకు పోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం.కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దు పోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తి భావంతో దేవుని స్తంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీథుల్లోనూవీధుల్లోనూ ప్రదర్శిస్తారు.
==కోలాటం==
'''కోలాటం''' ఒక రకమైన సాంప్రదాయక సామూహిక [[ఆట]]. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.[[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు [[అబ్దుల్ రజాక్]] అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. గ్రామదేవతలైన [[ఊరడమ్మ]], [[గడి మైశమ్మ]], [[గంగాదేవి]], [[కట్టమైసమ్మ]], [[పోతలింగమ్మ]], [[పోలేరమ్మ]] [[దనుకొండ గంగమ్మ]], మొదలగు గ్రామ దేవతల జాతర సందర్భంగా కోలాటం ఆడుతారు.
పంక్తి 21:
కోలాటం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా[[ప్రార్థన]] చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి కోలన్న పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కళ్ళకు గజ్జెలతో చూడముచ్చటగా ఉంటారు. కోలాటంలో అనేకమైన [[గతి]] భేదాలుంటాయి. వాటిని కోపులు అంటారు. కోపు అంటే నాట్య గతి విభేదం. ప్రాంతాలను బట్టి కోపుల పేర్లు మారుతూ ఉంటాయి. రాత్రీ, పగలూ ఈ ప్రదర్శనలుంటాయి.
==జడ కోలాటం==
కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమసంఖ్యలో సాధారణంగా ఒక చింతచెట్టు క్రింద ఆడేటప్పుడు ఆ చింత చెట్టుకు పైనున్న కొమ్మకు ఆటగాళ్లు ఎంత మంది వున్నారో అన్ని తాళ్లు కడతారు. అన్ని సరి సంఖ్యలో మాత్రమే వుండాలి. ప్రతి ఒక్కరు ఒక తాడును పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ (రెండు పక్షాలుగా చీలుతారు) . [[లయ]] ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన ఒకరి స్థానం నుంచి మరోకరి స్థానంలోకి ఒకరి తర్వాత మరొకరు వరుసక్రమంలో మారుతూ తిరగడంతో ఈ తాళ్ళన్నీ ఒక క్రమ పద్దతిలోపద్ధతిలో అల్లబడిన [[జడ]] లాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా వ్వతిరేక దిశలొదిశలో ఆడి తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం. ఒక వేళ ఈ ఆటలో ఏదేని అపశృతి జరిగితే అనగా ఎవరైనా లయ తప్పితే క్రమ పద్దతిలోపద్ధతిలో అల్లిన ఆ జడలో తెలిసి పోతుంది ఎవరు తప్పుచేశారనని. తిరిగి విడదీసేటప్పుడు కూడా అదే తప్పును చేసి ఆ జడను విడగొట్టాలి. అది మరింత క్లిష్టమైన ప్రక్రియ. తప్పు జరిగిన సమయం అతి జాత్రగా గుర్తుపెట్టుకొని ఆ జడను విడదీసేటప్పుడు అదే తప్పును చేస్తే (వ్యతిరేఖ దిశలో) ఆ జడ విచ్చుకుంటుంది. అలా చేయకపోతే ఆ జడ అనేక దారాలు కలిగి వున్నందున చిక్కుబడి పోతుంది. ఆటలో అడుగులు తడబడకుంటే జడ చాల అందంగా తయారవుతుంది. ఆ తర్వాత దాన్ని వ్వతిరేక దిశలో ఆడి విడదీస్తారు. అది అద్బుతమే. కాని మొదట ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే .... ఎవరు తప్పు చేసారని ఆ దారం పట్టుకున్న వ్వక్తి అని తెలిసి పోతుంది. కాని ఆ తప్పు చేసిన వ్వక్తి ఆ జడను విడదీసేటప్పుడు వ్వతిరేక దిశలో ఆడుతునప్పుడు, మొదట చేసిన తప్పును అదే సమయానికి చేస్తే ఆ జడ సులభంగా విడి పోతుంది. లేకుంటే ఆ జడ ఆ తర్వాత అనేక చిక్కుముడులు పడిపోతుంది. ఇందులో విశేషమేమంటే...... తప్పును చేయడం మానవ సహజం.... కాని ఆ తప్పును సరిదిద్దు కోవడం మంచి పద్దతిపద్ధతి. ఈ జడ కోలాటంలో ఎన్ని అడుగులకు తర్వాత తప్పు జరిగింది, తెలుసుకోవాలి. వ్వతిరేక దిశలో ఆడుతున్నప్పుడు దాన్ని గుర్తుంచుకొని అన్ని అడుగుల తర్వాత అదే తప్పుడు అడుగు వేస్తే ఆ దారం సక్రమం అయి అల్లిన జడ యదాతధంగా విడిపోతుంది. ఇందులో ఒక ప్రాముఖ్యత ఉంది. '''తప్పులు అందరు చేస్తారు దాన్ని సరిదిద్దుకున్న వాడే గొప్ప '' అనే సందేశం వున్నది. దానికి ఇది మంచి ఉదాహరణ. తప్పటడుగు వేసినవాడు ఏ సమయంలో తప్పటడుగు వేశాడో గుర్తుపెట్టుకొని అదే సమయానికి అదే తప్పుచేసి సమం చేస్తే ఆ అల్లబడిన జడ సులభంగా విడిపోతుంది. లేదా..... మొదట తప్పుచేసి తిరిగి సక్రమంగా చేస్తే ఆ జడ అనేక చిక్కు ముడులతో తయారయి ప్రేక్షకుల దృష్టిలో అవమానము పాలౌతారు. కనుక తప్పడడుగు వేసి జడను సరిగా అల్లక పోయాడనే నిందకన్నా దాన్ని అదే తప్పు చేసి విడదీసేటప్పుడు అదే విధంగా ఆడితే అది విడిపోతుంది. ఇలా చేయడం అంత సులభం కాదు. కాని కొందరు నిష్ణాతులు కావాలని తప్పు చెసి .... వ్వతిరేక దిసలో అదే తప్పును చేసి ఆటను సరి చేసి తమ గొప్ప తనాన్ని నిలబెట్టుకుంటారు. అదే గొప్ప విషయం. ఎలాగైతేనేమి ఈ జడ కోలాటము అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనిని చూసి తరించ వలసినదే. ఆటలు, బజనలు, నాట్యాలు, వంటి అనేక విధానాలలో అత్యంత సంక్లిస్టమైనది ఈకోలాటమె. సాధారణ కోలాటాలు ..... మామూలె... చాల నృత్యాల లాగ వుంటాయి. ఈ జడకోపు కోలాటలు మాత్రమే అత్యంత క్లిస్టమైనవి........ అసధారణమైనవి,.
==ఆడటం, పాడటం==
ఆటలో ఆసక్తి కలిగిన కొంత మంది ఆట గాళ్ళు బృంద నాయకుని అధీనంలో బృందంగా ఏర్పడి, కోలాట నృత్యాన్ని నిర్వహిస్తారు. ముంకారంగా నిలబడతారు. ముందుగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తారు. వారు ప్రదర్శన ఇచ్చే స్థలాన్ని [[గరిడీ]] అని పిలుస్తారు. వలయంగా నిసుచున్న కళాకారులు ఇద్దరు చొప్పున ఒకరి కొకరు ఎదురుగా నిలబడతారు. వారు పట్టుకున్న చిరుతలను లయబద్దంగా కొడతారు. వేగాన్ని పెంచడానికి జట్టు నాయకుడు ఇట్తయ్యకుడు దద్ధిమితా అనడంతో లయ, తాళం మారిపోయి వలయంలో వున్న వారు కొందరు లోపల వలయంగానూ, మిగిలినారు నెలుపలి వలయంగానూ మారుతారు.
"https://te.wikipedia.org/wiki/కోలాటం" నుండి వెలికితీశారు