గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎రేల పూతలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మత్రమే → మాత్రమే using AWB
పంక్తి 51:
== ఏకనాదం ==
==రేల పూతలు ==
ఎవరికో కొన్ని వర్గాల వారికి మత్రమేమాత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో ' రేలపూతలు ' ఒకటి
ఇక 'రేల పూతల' పరిమళాలలోకి వెళ్తే... [[ప్రపంచీకరణ]] మాయా మబ్బులు పల్లెలను సైతం కమ్మేసి, కుమ్మేస్తున్నప్పుడు, కుల వృత్తులు ద్వంసమై, మూలకు పడుతున్నప్పుడు, పల్లెలను మింగి పట్టణాలు బలుస్తున్నప్పుడు, మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్నపుడు కవి హృదయం వేదనతో రగిలి, పాటగా రూపుదాల్చి, ఈ 'రేల పూతలు' పూశాయి.
ఎంకన్న పాట పల్లె చుట్టూ ప్రదిక్షణ చేస్తుంది. పల్లె అందాలు, పల్లెలోని అమాయకుల అనుబంధాలు, వారి జీవితాల్లోని సుఖం- దుఃఖం, కష్టం -నష్టం, వేదన, పోరాటం ఒకటేమిటి అన్నీ కరిగి గోరటి గొంతులో పాటలై మొలకెత్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో అతని దృష్టి నుండి ఏ వస్తువు తప్పించుకోలేదు. సెలకల్లో ఆడే పిల్లల నుంచి ఆకాశంలో ఎగిరే కొంగల దాకా అన్నీ తన పాటల్లోకి రావాల్సిందే.
"https://te.wikipedia.org/wiki/గోరటి_వెంకన్న" నుండి వెలికితీశారు