జ్వాలాద్వీప రహస్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
==కథ==
 
[[దస్త్రం:Jwaladeepa Rahasyam Movie Stils (1).png|thumb|left|300px|జ్వాలాద్వీప రహస్యం నుండి]]
సిద్ధేంద్రయోగి అనే ఒక సన్యాసి మరణాన్ని జయించాలని ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ తంత్రాలతో కూడిన ఆ పూజలను రాజు ప్రభాకర వర్మ అంగీకరించడు. ఆస్థానంలో ఉన్న విజ్ఞుల సలహా మేరకు ఆ సిద్ధుడిని చంపకుండా దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. సైనికులు అతనిని తీసుకు వెళుతుండగా వారి కన్నుగప్పి తప్పించుకోవాలని ప్రయత్నంలో అతని కాలి చిటికెన వేలు తెగిపోతుంది. అలా అడవిలోకి పారిపోతున్న సిద్ధుడు సర్పకేశి అనే దుష్టశక్తిని మరో మాంత్రికుడి నుంచి రక్షించి తన వశం చేసుకుంటాడు. ఆ దుష్టశక్తి సహాయంతో అందరికీ దూరంగా ''జ్వాలాదీపం'' అనే దీవిని సృష్టించి తన పూజలు నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటాడు. తీరా వరం పొందేటపుడు ఆ శక్తి తను ఇవ్వలేనని, అందునా అతను అంగవికలాంగుడు కాబట్టి అతను అందుకు అర్హుడు కాడని తెలియజేస్తుంది.
 
 
[[దస్త్రం:Jwaladeepa Rahasyam Movie Stils (3).png|thumb|left|300px|జ్వాలాద్వీప రహస్యం నుండి]]
 
అప్పుడు ఆ సిద్ధుడు రాజు సేవకుడిగా పని చేస్తున్న భల్లాటకుడు అనే సేవకుణ్ణి సర్పకేశి సహాయంతో తన వద్దకు రప్పించుకొని తన శక్తితో అతనకి జరామరణాలు లేకుండా చేస్తానని, అందుకు ప్రతిఫలంగా తనను అవమానించిన రాజు ప్రభాకర వర్మను గద్దె దించి వారిని తన కారాగారంలో బంధించమంటాడు. సిద్ధుడు నాగదేవతను ప్రార్ధింఛి భల్లాటకుడికి వజ్రకాయాన్ని మరణం లేకుండా శక్తిని వచ్చేలా చేస్తాడు. కానీ ఎప్పుడూ తనచేతులు రక్తసిక్తం కాకూడదని హెచ్చరిస్తాడు. రాజైన భల్లాటకుడు అందరినీ జ్వాలాదీపంలో బంధించినా చిన్నకుమారుడు ఆనందవర్మ మాత్రం మంత్రి సహాయంతో తప్పించుకొని పెరిగి పెద్దవాడవుతాడు. భల్లాటకుడు రాజ్యంలోని ప్రజలందరూ తననే దేవుడుగా భావించి పూజించమని ఆజ్ఞ జారీ చేస్తాడు. అందుకు వ్యతిరేకించిన వారినందరినీ కఠినంగా శిక్షిస్తుంటాడు. అలా వ్యతిరేకించిన వారిలో రాజు గారి ఆస్థాన సిద్ధాంతి కూడా ఉంటాడు. ఆ సిద్ధాంతిని కూడా భల్లాటకుడు జ్వాలాదీపంలో ఉంచి శిక్షించమనగా ఆయన అతని కుమార్తెను చేపట్టిన వాడిలో అతనికి చావు తప్పదని శాపం ఇస్తాడు.
పంక్తి 21:
 
తరువాత కంఠీరవుని మంచి చేసుకుని అతని సహాయంతో రాజును దెబ్బకొట్టాలని పథకం వేస్తాడు. ఇద్దరూ కలిని జ్వాలాదీపం వెళ్ళి తన తల్లిదండ్రులను విడిపించి రాజకుమార్తెను పెళ్ళి చేసుకోవడంచో కథ ముగుస్తుంది.
 
[[దస్త్రం:Jwaladeepa Rahasyam Movie Stils (2).png|thumb|left|300px|జ్వాలాద్వీప రహస్యం నుండి]]
== గ్యాలరీ ==
<gallery>
[[దస్త్రం:Jwaladeepa Rahasyam Movie Stils (1).png|thumb|left|300px|జ్వాలాద్వీప రహస్యం నుండి]]
[[దస్త్రం:Jwaladeepa Rahasyam Movie Stils (3).png|thumb|left|300px|జ్వాలాద్వీప రహస్యం నుండి]]
[[దస్త్రం:Jwaladeepa Rahasyam Movie Stils (2).png|thumb|left|300px|జ్వాలాద్వీప రహస్యం నుండి]]
</gallery>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/జ్వాలాద్వీప_రహస్యం" నుండి వెలికితీశారు