గూడ అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), → using AWB
పంక్తి 4:
 
==జీవిత విశేషాలు==
లక్ష్మమ్మ, లక్ష్మయ్య దంపతులకు [[1955]] లో [[ఆదిలాబాద్]] జిల్లా, [[దండేపల్లి]] మండలం, [[లింగాపూర్ (దండేపల్లి)|లింగాపురం]] గ్రామంలో అంజయ్య జన్మించాడు. ఆయనకు ఐదుగురు సహోదరులున్నారు. ఆయన ప్రాథమిక విద్యను లింగాపురం గ్రామంలో చదివారు.
 
== మరణం ==
పంక్తి 11:
 
==రచయితగా==
నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా ఎన్నో కథలు, పాటలు రాసిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు రాశాడు. వీటన్నింటికి తోడు సినిమాల్లో పాటలు రాసిన తర్వాత తెలుగు నేల నలుమూలలా ఆబాలగోపాలం అందరి నోళ్లలో నానుతున్నాడు. వృత్తిరీత్యా [[హైదరాబాద్‌]] లో ఫార్మసిస్ట్‌గా పనిచేశాడు. ఆయన పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నప్పుడు [[తెలంగాణ]] ప్రభుత్వం వైద్యం చేయడానికి ముందుకు వచ్చింది.<ref>[http://www.deccanchronicle.com/141013/nation-current-affairs/article/telangana-state-takes-responsibility-ailing-poet-guda-anjaiah Telangana State takes responsibility of ailing poet Guda Anjaiah-దక్కన్ క్రానికల్-13-10-2014]</ref> ఆయన వ్రాసిన "ఊరు మనదిరా" పాట 16 భాషలలో అనువాదమయింది. ఆయన తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసాడు.
 
బడికి పోతున్న సమయంలో దారినపోతున్న ఒక రైతును పలకరించగా ''ఊరిడిసి పోవన్నా..ఉరిపెట్టుకోవన్నా...'' అన్న మాటలే తన తొలి పాటకు అన్న ప్రాసన చేశాయని..తను కళ్లారా చూసిన కష్టాలకు, వాటిని అనుభవిస్తున్న వారి నోట వచ్చిన మాటల స్ఫూర్తిగా పాటలల్లడం తనకు బాల్యంలోనే అబ్బిన విద్య అని ''అసలేని వానల్ల ముసలెడ్లు కుట్టుకొని..'' అనే ఆయన తొలిపాట పుట్టుకకు నేపథ్యం అదేనని అంజయ్య ప్రతి సభలోనే చెప్పేవాడు.
 
అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో విప్లవోద్యమ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ పెత్తందార్ల పాలనలో పీడిత జనానికి విముక్తి లేదని, జన ఐక్యతతో ప్రజోద్యమాల ద్వారా శ్రామిక రాజ్యం స్థాపించడమే ఏకైక మార్గమని నమ్మి ఉద్యమ బాటలో పయనించాడు. ఉన్నత చదువులకోసం హైదరాబాద్‌ హాస్టల్‌కు మకాం మార్చిన అంజన్నకు ప్రపంచ ఉద్యమాల పరిచయం ఏర్పడింది. తనలాగే జనం కోసం పాకులాడే వారు హైదరాబాద్‌ లోహైదరాబాద్‌లో చాలామంది ఉన్నారని తెలుసుకున్న అంజయ్య వారందరిని కలుపుకున్నాడు. అరుణోదయ సాంస్కృతిక సంస్థను స్థాపించి జనంనోట విన్న పదాలనే పాటలుగా రాసి బాణీలు కట్టి తెలుగురాష్ర్టం మెత్తం తిరుగుతూ ప్రజల నుండి నేర్చుకుంటూ, ప్రజల ఆలోచనల్లో మార్పుకోసం తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాడు.
 
==రచనలు<ref>[http://kinige.com/author/Guda+Anjaiah Books from Author: Guda Anjaiah-కినిగె.కాంలో పుస్తకాల వివరాలు]</ref>==
పంక్తి 38:
* [http://v6news.tv/telangana-writer-guda-anjaiah-exclusive-interview-v6-telangana-animuthyalu వి6 లో తెలంగాణ రచయిత గూడ లింగయ్య ఇంటర్వ్యూ]
* [https://www.youtube.com/watch?v=E4cTBy4mf4c గూడ అంజయ్య పాట-యూట్యూబ్ లో]
 
 
[[వర్గం:1955 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/గూడ_అంజయ్య" నుండి వెలికితీశారు