ఘంటసాల బలరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Ghantasalabr.jpg|right|frame|ఘంటసాల బలరామయ్య]]
 
'''ఘంటసాల బలరామయ్య''' ([[జూలై 5]], [[1906]] - [[అక్టోబర్ 29]], [[1953]]) సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నిర్మాత మరియు దర్శకులు.<ref>https://26lettersto24frames.wordpress.com/2012/01/06/ghantasala-balaramaiah-the-legend-who-created-legends/</ref>
 
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో [[కలకత్తా]] వెళ్ళి చిత్రరంగంలొచిత్రరంగంలో అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో [[సతీ తులసి]], 1938లో [[మార్కండేయ]] మరియు 1940లో [[మైరావణ]] చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి [[పార్వతీ కళ్యాణం]] సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాత కాలంలో చిత్ర నిర్మాణం మరియు దర్శకత్వం రెండు నిర్వహిస్తూ [[గరుడ గర్వభంగం]] (1943), [[సీతారామ జననం]] (1944), [[ముగ్గురు మరాఠీలు]] (1946), [[బాలరాజు]] (1948), [[శ్రీ లక్ష్మమ్మ కథ]], [[స్వప్న సుందరి]] మరియు [[చిన్న కోడలు]] (1952) మొదలైనవి తయారుచేశారు.
 
1944లో నిర్మించిన [[సీతారామ జననం]] చిత్రం ద్వారా వీరు [[అక్కినేని నాగేశ్వరరావు]] మరియు అమర గాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1948లో నిర్మించిన [[బాలరాజు]] సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి [[శ్రీ లక్ష్మమ్మ కథ]] చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు.
 
వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు. తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు [[అక్టోబర్ 29]], [[1953]] అర్థరాత్రిన గుండెపోటుతో పరమపదించారు. ఆ సమయంలో ఆయన [[రేచుక్క (1955 సినిమా)|రేచుక్క]] చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రాన్ని [[పి.పుల్లయ్య]] పూర్తిచేశారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఘంటసాల_బలరామయ్య" నుండి వెలికితీశారు