చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ని → ని (2), పెళ్లి → పెళ్ళి, పని చేస్తూ → పని using AWB
పంక్తి 15:
|other=
}}
'''చాకొలెట్ ''' చెట్ల నుండి వచ్చే, కాఫీని పోలిన, పదార్థం. దీనిని రకరకాల పానీయాలలోను, తినుభండారాలలోను, [[మిఠాయి]] లలోను కలుపుతారు. చాకొలెట్ కలిసిన వంటకాలు, పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. స్నేహితులైనా, ప్రేమికులైనా, ఆత్మీయులైనా, అధికారులైనా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, అభినందనలు తెలపాలన్నా, స్వాగతిస్తున్నా, వీడిపోతున్నా, ఇచ్చిపుచ్చుకునే కానుక చాకొలెట్. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్నా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాకొలెట్ వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాకొలెట్ ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన పెట్టెలలో అలంకరించి మరీ అందిస్తున్నారు. పెళ్లిపెళ్ళి, పుట్టినరోజు, కొత్త సంవత్సరం, వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాకొలెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.
==చరిత్ర==
[[దక్షిణ అమెరికా]]లో ఒకానొకప్పుడు నివసించిన మాయ, ఆజ్టెక్ జాతులు చాకొలెట్ తో చేసిన పానీయాలు విరివిగా తాగేవారు. పురావస్తు పరిశోధకుల మాటలని బట్టి చూస్తే చాకొలెట్‌ సుమారు 3,000 సంవత్సరాల కిందటే ఉపయోగంలో ఉండేదిట. చాకొలెట్‌ నిచాకొలెట్‌ని మనకి పరిచయం చేసిన ఘనత హాంస్‌ స్లోన్‌ (Hans Sloan) అనే ఐర్లండు దేశపు వైద్యుడికి దక్కుతుంది. (ఈయన లండన్‌ లోలండన్‌లో ఉన్న [[బ్రిటిష్ మ్యూజియం]] సంస్థాపకులలో ఒకడు.) ఈయన జమైకాలో బ్రిటిష్‌ గవర్నర్‌ దగ్గర పని చేస్తూన్నపనిచేస్తూన్న రోజులలో చేదుగా ఉండే కోకో తాగలేక దాంట్లో కాసిన్ని పాలు కలిపేడు. (టీ లోటీలో పాలు కలిపి తాగడం కూడకూడా బ్రిటిష్‌ వాళ్ల అలవాటే!) చేదుగా ఉన్న కొకో లోకొకోలో పాలు కలిపేసరికి దాని రుచే మారిపోయింది. అప్పటివరకు వేడి నీళ్లల్లో కలుపుకు తాగే కోకో పాలల్లో కలిపేసరికి ఎంతో రుచిగా తయారయింది. అప్పటినుండి ఘనరూపంలో ఉన్న చాకొలెట్‌ కిచాకొలెట్‌కి కూడకూడా పాలు కలిపేసరికి తినడానికి వీలుగా తయారయింది.<ref>Davide Castelvecci, Chocalate: Mixing the bitter treat with milk was the popular breakthrough, Scientific American, p 96, September 2009</ref>
==చాకొలెట్ - రకాలు - తయారీ ==
కకోవా (cocoa) గింజలతో చేసే చాక్లెట్ల రుచులూ, రకాలూ కోకొల్లలు. ప్రాథమికంగా చాకొలెట్ మూడు రకాలు.
*కకోవా లిక్కర్ (గింజ తొడిమనుంచి తీసే పొడి లేదా ద్రవం)
*కకోవా బటర్ (గింజలోని కొవ్వుపదార్థం)
*కకోవా పొడి (లిక్కర్, కొవ్వు తీసేయగా మిగిలిన పొడి) ని వాడుతూ చేస్తారు.
 
కకోవా అభిషవానికి (లిక్కర్‌కి) కాస్త కకోవా వెన్న (బటర్), పంచదార కలిపి చేసేదే నల్ల (డార్క్ లేదా బ్లాక్) చాకొలెట్. ఇందులో కలిపే కకోవా అభిషవం గాఢత కనీసం 35 శాతానికి తగ్గకూడదనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాకొలెట్ లో 70 నుంచి 99 శాతం కకోవా లిక్కర్ ఉంటుంది. కకోవా ద్రవం లేదా పొడి కనీసం 20 శాతం ఉండి పాలు, పంచదారతో కలుపుతూ చేసేదే '''పాల చాకొలెట్'''. కకోవా బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే '''తెల్ల చాకొలెట్'''. ఇందులో కకోవా అస్సలు ఉండదు. ఈ మూడు రకాలకీ జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాకొలెట్ లు చేస్తారు. వీటిల్లోనూ పుదీనా, వెనీలా, కాఫీ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల షాడబాలనీ (ఫ్లేవర్లని), బాదం, వేరుసెనగ, పిస్తా, వంటి పలుకులనూ జోడిస్తూ చేసే మరెన్నో రకాలు చాకొలెట్ లు ఉన్నాయి.
 
==చాకొలెట్ ని నిల్వ చెయ్యడం==
తాజాగా ఉన్న చాకొలెట్ మంచి రుచిగా ఉంటుంది. తాజాగా ఉన్న చాకొలెట్ కి ఉన్న కూర్పరితనం (texture), షాడబం (flavor) నిల్వ ఉన్న చాకొలెట్ కి ఉండవు. అందుకని, చాకొలెట్ ని ఎప్పుడు తినదలుచుకున్నామో అప్పుడే కొనుక్కుని తినడం మంచిది. ఘన రూపంలో ఉన్న చాకొలెట్ ని చల్లగా ఉన్న (65 - 68 F), చెమ్మదనం (humidity) తక్కువగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేస్తే చాల రోజులు తాజాగా, కమ్మగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని నిల్వ చేస్తే నల్ల చాకొలెట్ ఏడాది పాటు పాడవకుండా ఉంటుంది. పాల చాకొలెట్, తెల్ల చాకొలెట్ ఆరు నెలలు నిల్వ ఉంటాయి. నిల్వ చేసిన చాకొలెట్ కి గాలి, వెలుగు తగల కూడదు. ఎండ తగిలితే చాకొలెట్ కరిగి ముద్దయిపోతుంది. అందుకనే ఇండియాలో నాణ్యమైన చాకొలెట్ కొనుక్కుని, తిని, ఆనందించడం కష్టం. మనకి బజారులో దొరికే చాకొలెట్ ఎండకి, వేడికి తట్టుకోవాలి కనుక దానిలో ఏదో కలపాలి. అలా కలిపితే చాకొలెట్ అసలు రుచి పోతుంది.
 
ఇండియాలో అన్ని కాలలోను వేడిగానే ఉండే ప్రదేశాలే ఎక్కువ కనుక తినగా మిగిలిన చాకొలెట్ ని రిప్రిజిరేటర్ లో పెట్టక తప్పదు. అటువంటి పరిస్థితులలో చాకొలెట్ ని డబ్బాలో పెట్టి, మూత గట్టిగా పెట్టి, రిప్రిజిరేటర్ లో దాచుకుని, తినే ముందు కొద్ధి క్షణాలు వెచ్చబడనిచ్చి తినడం మంచిది. మూత పెట్టపోతే రిప్రిజిరేటర్ లో ఉన్న వంటకాల వాసనలు చాకొలెట్ కి అంటుకుని రుచి పాడవుతుంది.
 
==వైద్య సంబంధ ఉపయోగాలు ==
* కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. ఎండిన కకోవా గింజలలో బహుఫీనాలుల వంటి "ఏంటీఆక్సిడెంట్లు", షాడబార్థాలు (flavonoids) దరిదాపు 8 శాతం వరకు ఉంటాయి. స్వతంత్ర ప్రతిపత్తితో అతి చురుగ్గా తిరుగాడే బణు సమూహాలు (free radicals) విశృంఖలంగా తిరుగుతూ ఉంటే అవి జీవకణాలకి హాని చేస్తాయి. ఏంటీఆక్సిడెంట్లు ఇటువంటి విశృంఖల రాసులని అదుపులో పెడతాయి. ఉష్ణమండలాలలో పెరిగే కాఫీ, టీ, కోకో (కకోవా), మొదలైన మొక్కలన్నీ ఇటువంటి ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చెయ్యడమనేది గమనించవలసిన విషయం. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే తీక్షణమైన కిరణాల ధాటికి ఈ మొక్కలలోని జీవకణాలలో కూడకూడా విశృంఖల రాసులు తయారవుతాయి. వీటి నుండి రక్షించుకునే ప్రయత్నంలో మొక్కలు ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చేసుకుంటాయి. వాటిని మనం తస్కరించి ఉపయోగించుకుంటున్నామన్నమాట.
* చాకొలెట్ తినడం వల్ల సమకూరే వైద్యపరమైన లాభాలని ప్రశంసించే ముందు ఈ లాభాలు, ప్రయోజనాలు నాటు చాకొలెట్ తినడం వల్ల వస్తాయి కాని, మనం బజారులో కొనుక్కుని తినే మిఠాయి చాకొలెట్ వల్ల కాదని గమనించాలి. కనుక ఈ దిగువ ఇచ్చిన జాబితాని చదివేటప్పుడు వాటిని అక్షరసత్యాలుగా తీసుకోవడం శ్రేయస్కరం కాదు.
** అతిగా తింటే ఏదీ మంచిది కాదు కాని, మోతాదుగా తింటే చాకొలెట్‌ ఆరోగ్యానికి మంచిది. రక్తపోటుని అదుపులో పెట్టడానికి నల్ల చాకొలెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నల్ల చాకొలెట్లో- ''కేటచిన్‌'' అనే షాడబార్థం (ఫ్లావనాయిడ్) ఉంటుంది. ఇది మన రక్త నాళాలను వ్యాకోచించేటట్లు చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అందువల్ల రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
పంక్తి 39:
**100 గ్రా. చాక్లెట్ బార్‌లో 67శాతం ఐరన్, 58 శాతం మెగ్నీషియం, 89 శాతం కాపర్, 98 శాతం మాంగనీసూ 11 గ్రా. పీచూ ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియంలూ, బి1, బి2, డి, ఇ విటమిన్లూ ఉంటాయి. అయితే వంద గ్రా. చాక్లెట్ రోజూ తీసుకోలేం. ఎందుకంటే దీన్నించి 600 క్యాలరీలూ వస్తాయి. అందువల్ల ఒక ఔన్సు అంటే 28.5 గ్రా. చాక్లెట్ బార్‌ని తినడం ఆరోగ్యానికి మంచిదేనన్నది నిపుణుల ఉవాచ. దీనివల్ల ఇతర స్వీట్లూ నూనె పదార్థాలను తినాలన్న కోరిక తగ్గుతుంది.
** కకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది.
** ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫ్రీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్లు చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది .
** ఫ్లావనాల్స్ అనే పదార్థం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
**చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండిపదార్థాలు ఉన్న ఏ పదార్థం ఇరుక్కున్నా పళ్లు పుచ్చిపోతాయి. చాక్లెట్‌లోని సహజ కొవ్వులవల్ల మిగిలిన స్వీట్లకన్నా దీన్ని శుభ్రం చేయడం తేలిక. కకోవాలోని టానిన్లు త్వరగా పాచి పట్టనీయవు.
**కానీ కొంత మందికి కోకోవా పడదు [[అలర్జీ]] వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లోవాడడంలో జాగ్రత్త పడాలి .
 
==చాకోలెట్ - శృంగారవాంఛ==
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు