పురావస్తు శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
ఈ శాస్త్రంలో మానవుల [[చరిత్ర]], [[పూర్వ చరిత్ర]] గురించి అధ్యయనం చేస్తారు. అంటే తూర్పు ఆఫ్రికా, [[కెన్యా]]లో బయటపడ్డ 30 లక్షల సంవత్సరాల రాతిపనిముట్ల నుంచి ఇటీవలి కాలం నాటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తారు. ఎటువంటి లిఖిత పూర్వక ఆధారాలు లేని పూర్వీకుల సమాజం, వారి జీవన విధానం గురించి తెలుసుకునేందుకు పురావస్తు శాస్త్రం చాలా కీలకమైనది. అసలు చరిత్ర లో 99% మానవ సమాజాల్లో అక్షర జ్ఞానం అభివృద్ధి కాక మునుపటి పరిస్థితుల్లో దాగి ఉంది. వివిధ మానవ జాతుల సాంస్కృతిక చరిత్ర అర్థం చేసుకోవడం, పూర్వీకుల జీవన విధానాన్ని పునర్నిర్మించడం, వాటిని అక్షరబద్ధం చేయడం, కాలంతో పాటు జీవన విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో పరిశోధించడం ఈ శాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలు.
 
భూముల్ని సర్వే చేయడం, తవ్వకాలు జరపడం, అక్కడ కనిపించిన సమాచారాన్ని సమీకరించి విశ్లేషించి గతం గురించి మరింత తెలుసుకోవడం ఈ శాస్త్రంలోని ప్రధాన అంశాలు. ఇలా పరిశోధన చేయడానికి చరిత్ర, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, సమాచార సాంకేతిక శాస్త్రం, గణాంక శాస్త్రం, భాషా శాస్త్రం లాంటి ఇతర శాస్త్రాల సహాయం కూడా తీసుకుంటారు.
 
యూరప్ లో 19 వ శతాబ్దంలో పురాతన వస్తువులను, ప్రదేశాలను, గ్రంథాలను అధ్యయనం చేయడం ప్రారంభించడంతో ఈ శాస్త్రం క్రమంగా అన్ని దేశాలకూ విస్తరించింది.
 
== కొన్ని పురాతత్వ పరిశోధనలు ==
"https://te.wikipedia.org/wiki/పురావస్తు_శాస్త్రం" నుండి వెలికితీశారు