ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు ని → ును (2), లో → లో (3), ని → ని (5), గా → గా , తో → తో , జెర్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
పంక్తి 8:
ముందుగా కొన్ని నిర్వచనాలతో మొదలుపెడదాం. ఒక భాషనుండి మరొక భాషలోకి తర్జుమా (derivation) చెయ్యడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: అనువాదం (translation), అనుకరణ (adaptation). ఈ అనుకరణలనే “స్వేచ్ఛానువాదాలు” అనటం కూడా కద్దు. కవిత్రయం తెలిగించిన ఆంధ్ర మహాభారతం సంస్కృత మూలానికి అనుకరణ. ఏనుగు లక్ష్మణకవి తెలిగించిన నీతి శతకం సంస్కృత మూలానికి అనువాదం. అనుకరణ చేసేటప్పుడు మూలానికి మార్పులు, చేర్పులు చేసే వెసులుబాటు ఉంటుంది.
 
వైజ్ఞానిక, సాంకేతిక, వాణిజ్య, వ్యాపార రంగాలలో ఇంగ్లీషు నుండి ఇతర భాషలలోకి తర్జుమా చెయ్యవలసిన అవసరం తరచు వస్తూనే ఉంటుంది. పాఠ్య పుస్తకాలు, ఉపకరణాలు ఎలా వాడుకోవాలో తెలియజేసే కైపొత్తాలు (handbooks), కల్పనా సాహిత్యం, మనోవికాశక గ్రంథాలు, జనరంజక విజ్ఞానం, మొదలైన వాటిని ఏ ముక్కకాముక్క అనువదించకపోయినా పరవా లేదు – అనుకరణ సరిపోతుంది. కాని ఆర్ధికఆర్థిక విషయాలు, లావాదేవీలకి సంబంధించినవి, ఆస్తి హక్కులకి సంబంధించిన దస్తావేజుల వంటి రూఢి పత్రాలు, వగైరాలు అనుకరిస్తే సరిపోదు – వాటిని అనువదించాలి. ఇలా అనువాదాలకి, అనుసరణలకి మధ్య తేడాలు ఉన్నాయని గుర్తించి, రాత సౌకర్యం కొరకు ఈ రెండు ప్రక్రియలనీ గుత్తగుచ్చి అనువాదాలనే అందాం. అవసరం వచ్చినప్పుడు తేడాని గుర్తిస్తూ మాట్లాడుకోవచ్చు.
 
మన జీవితాలలో మూడు రకాల అనువాదాల అవసరం కనబడుతుంది: (1) తీరుబడిగా మూల గ్రంథాన్ని చదివి, జీర్ణం చేసుకుని, అనువాదం తయారు చేసి, దానిని బిగుతుగా తిరగ రాయటం, (2) ఒక గడువుని చేరుకోవాలనే తొందరలో మూల గ్రంథాన్ని చదువుతూ, త్వరగా అనువాదాన్ని తయారు చెయ్యటం. పత్రికా విలేఖరులు తరచుగా ఎదుర్కునే సమస్య ఇది, (3) ఒక వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే, అదే సమయంలో దానిని తెలుగులో చెప్పటం. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావన మొదటి అంశానికే పరిమితం.
 
===దేశ, కాల, సంస్కృతులని పరిరక్షించటం===
ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ ప్రపంచం సమతలంగా మారుతోందని ఉత్ప్రేక్షిస్తున్నారు. ఇక్కడ “సమతలం” అంటే దేశకాల పరిస్థితుల వల్ల కాని, ఆర్ధికఆర్థిక భేదాల వల్ల కాని, రాజకీయ సిద్ధాంత ధోరణులవల్ల కాని బాహ్యంగా ప్రస్పుటమయే అడ్డుగోడలని పగులగొట్టి ప్రపంచం అన్ని చోట్లా ఒకేలా కనిపిస్తోందని భాష్యం చెప్పుకోవచ్చు. ఎన్ని అడ్డు గోడలని ఛేదించినా మాట్లాడే మాట, రాసే రాత అనే గోడ ఇంకా బలంగానే ఉందని చెప్పడానికి రెండు ఉదాహరణలు: (1) సెల్ ఫోను సౌకర్యం ప్రపంచమంతటా పాకిపోయింది. మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, సర్వులూ వాడుతూన్న పరికరం ఇది. వీరందరికీ ఇంగ్లీషు రావాలంటే ఎలా? ఈ పరికరాన్ని వాడుకునే విధివిధానాలు వారికి తెలుగులో చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లీషు మోజులో పడిపోయిన వారికి ఆ అవసరం కనబడక పోయినా నోకియా వాడికి కనబడింది. (2) తెలుగువాళ్లు తండోపతండాలుగా విమానాలలో ప్రయాణాలు చేస్తున్నారు. వీరిలో తెలుగు తప్ప మరొక భాషతో వెసులుబాటు లేని వాళ్లు ఉంటూనే ఉన్నారు. వీరు విమానంలో కక్కసు దొడ్లోకి వెళ్ళి అక్కడ పాయిఖానా వసతులని వాడుకోవటం తెలియక వాటిని పాడు చేస్తున్నారు. మనమీద అభిమానం కొద్దీ కాకపోయినా వాడి విమానం శుభ్రంగా ఉండాలని ఎమిరేట్స్ విమానం కంపెనీ కక్కసు ఎలా వాడుకోవాలో తెలుగులో (తమిళంలో లేదు, మలయాళంలో లేదు, మరాఠీలో లేదు) సూచనలు రాసేరు. ఇంగ్లీషుని తెలుగులోకి మార్చి వాడవలసిన అవసరం [[నోకియా]] వాడికీ, ఎమిరేట్స్ వాడికీ కనబడింది.
 
ఇంగ్లీషుని తెలుగులోకి మార్చే సందర్భాలలో కొన్ని సాంస్కృతిక మైన ఇబ్బందులు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇంగ్లీషులో "మై మదర్, యువర్ మదర్" అన్న పదబంధాలు ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించేటప్పుడు యడాగమసంధితో "నాయమ్మ, నీయమ్మ" అని అనువదిస్తే నీచ్యార్థం ధ్వనించే అవకాశం ఉంది. మూలంలో బహువచనం లేకపోయినా, తెలుగు నుడికారానికి తల ఒగ్గి, వీటిని "మా అమ్మ, మీ అమ్మ" అని మార్చితేనే బాగుంటుంది.