కుబేరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , ఉద్దేశ్యం → ఉద్దేశం, ఉద్దేశ్యము → ఉద్దేశమ using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 28:
కుబేరుని భార్య చిత్ర రేఖి (కానీ మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం, కుబేరుని భార్య పేరు భద్ర), పుత్రులు – పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు మరియు పుత్రిక – మీనాక్షి. వీరిలో మణిగ్రీవుడు, నలకూబరుడు భాగవతం ద్వారా మనందరికీ సుపరిచితులే (నారద మహాముని శాపం వలన వారిరువురూ మద్ది చెట్లై ఉంటే శ్రీకృష్ణుడు వారికి శాప విమోచనం కలిగిస్తాడు). ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి పాంచాలికుడు. తండ్రయిన కుబేరుని లాగానే ఇతను కూడా శివ భక్తి కలవాడు, శివునికి ప్రీతి పాత్రుడు. దక్ష యజ్ఞంలో తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీ దేవి అగ్నికి ఆహుతయ్యింది. ఈ విషయం తెలిసిన పరమ శివుడు ఆగ్రహంతో దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేసినా, భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె దూరమవటాన్ని తట్టుకోలేక దుఃఖంతో అంతా సంచరిస్తున్నాడు. అటువంటి సమయంలో మన్మధుడు ఈశ్వరుని మీదకు “ఉన్మాదనాస్త్రాన్ని” ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన విపరీతమయిన విరహ తాపానికి గురవుతూ, ఆ బాధ తట్టుకోలేక యమునా నదిలోనికి దిగుతాడు. ఈ వేడి జ్వాలలు ఆ నదిని దహించివేస్తాయి. దానితో ఆ నదీ జలం నల్లగా మారిపోవటంతో యమునా నదికి “కాళింది” అనే పేరు వచ్చింది. కానీ శివుని విరహ తాపం మాత్రం తీరటం లేదు. ఇంతలో మన్మధుడు “సంతాపనాస్త్రాన్ని” వేస్తాడు. ఈ అస్త్ర ప్రభావంతో మరింతగా బాధపడుతూ అగ్ని జ్వాలల్లాంటి నిట్టూర్పులను విడుస్తూ ప్రపంచాన్నంతా తాపంతో ముంచెత్తాడు. ఈ సారి మన్మధుడు “విజృంభణాస్త్రాన్ని” ప్రయోగించేసరికి శివుడు మరింత ఉన్మత్తుడై తిరగసాగాడు.
ఆ సమయంలో శివునికి కుబేరుని కుమారుడయిన పాంచాలికుడు కనిపిస్తాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి సహాయం కోరతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తనకి వచ్చిన అదృష్టావకాశానికి పొంగిపోతూ ఆజ్ఞాపించమంటాడు. దానితో తన బాధను పాంచాలికునికి వివరించి, తన మీద ప్రయోగింపబడిన మూడు (ఉన్మాదన, సంతాపన, విజృంభణ) అస్త్రాల వేడినీ తీసుకోమని కోరతాడు. మహా శివుడే తట్టుకోలేని వేడిని తాను మాత్రం ఎలా తట్టుకోగలడు? వాటిని తీసుకుంటే ఆ అస్త్రాల ప్రభావానికి తన జీవితమే నాశనమయిపోతుంది అని తెలిసినా కూడా అడిగినది పరమేశ్వరుడు కనుక నిస్సంకోచంగా, దైవాజ్ఞను ఆచరించి తీరాలి అనే ఆశయంతో ఆ మూడు అస్త్రాల వేడినీ తాను తీసుకుని శివునికి ఉపశమనం కలిగిస్తాడు. అతని భక్తికి, చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు ఎంతో ఆనందించి ఆ వేడి పాంచాలికుడిని బాధించకుండా వరం ప్రసాదించి, మహోన్నతమైన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు నుండీ పాంచాలికుడు కాలింజరానికి ఉత్తర భాగంలో, హిమవత్పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశంలో పాంచాలికేశ్వరుడిగా కొలువవుతాడనీ, చైత్ర మాసంలో ఈయనని చూసినా, విగ్రహాన్ని ముట్టుకున్నా, భక్తిగా స్మరించుకున్నవారు ఎవరయినా (చిన్న/పెద్ద, ఆడ/మగ భేదం లేకుండా) ఉన్మత్తులు అవుతారని చెప్తాడు. అయితే ఈ ఉన్మత్తత వ్యాధిలాగానో, అగ్నిలాగానో బాధించకుండా నాట్యగానాలలో, వాద్య సంగీతాలలో నేర్పుతో పాటు చతురోక్తులు విసరటం వంటి కళలలో అత్యున్నత స్థానానికి చేరి తిరుగులేని వారిగా ఉంటారని, అదే వారు అనుభవించే ఉన్మత్తమనీ వివరిస్తాడు. ఆ విధంగా పాంచాలికుడు కళాకారులకి ఆరాధ్య దైవంగా మారి, తనను కొలిచిన వారందరికీ వరాలనిచ్చే శక్తిని పొందాడనీ వామన పురాణం వివరిస్తోంది.
ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదలనొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే “లాఫింగ్ బుద్ధ” మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్ధికఆర్థిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక. ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, మొ., ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం.
 
“రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
"https://te.wikipedia.org/wiki/కుబేరుడు" నుండి వెలికితీశారు