కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (11), ను → ను (4), ప్రధమ → ప్రథమ (2), గ్రంధము → గ్రంథమ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
పంక్తి 46:
లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు [[నాగపూరు]] (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా,బావల వద్ద నాగపూరులో ఉంటూ [[మరాఠీ భాష]]ను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ.లో ఉత్తీర్ణుడయ్యాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. తెలుగు, మరాఠీ, [[ఇంగ్లీషు]] మాత్రమే కాక [[సంస్కృతము]], [[బెంగాలీ]], [[ఉర్దూ]], [[హిందీ]] భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు.
 
మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా [[నాయని వెంకట రంగారావు]] సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజా అభ్యుదయ భావాలు కలిగినవాడు. తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్ధికఆర్థిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యతవల్ల, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.
 
1901లో '''శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం''', 1906 లో '''విజ్ఞాన చంద్రికా మండలి''' స్థాపించడంలో కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖపాత్ర వహించాడు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యాన్ని ప్రారంభించాడు.
పంక్తి 195:
మొదట రాజకీయోద్యమాలలోను, తరువాత గ్రంథాలయోద్యమంలోనూ జీవితాన్నర్పించిన గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ప్రముఖ ఆంధ్ర రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథ రచయిత [[అయ్యదేవర కాళేశ్వరరావు]], తెలంగాణా నాయకుడు ''ఆంధ్రపితామహ'' [[మాడపాటి హనుమంతరావు]], అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలకు సేవచేసిన రావిచెట్టు రంగారావు వంటివారు లక్ష్మణరావు సహచరులు.
 
లక్ష్మణరాయ పరిశోధనామండలి కార్యదర్శిగా తెలంగాణంలో చరిత్ర పరిశోధన సాగించిన ఆదిరాజు వీరభద్రరావు లక్ష్మణరావు దగ్గర శిక్షణ పొందినవాడు. ఆర్ధికఆర్థిక శాస్త్రవేత్తగా [[కట్టమంచి రామలింగారెడ్డి]] విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ద్వారా తెలుగుదేశానికి పరిచయమయ్యాడు.
 
సుప్రసిద్ధ తెలుగు చారిత్రకుడు [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగు లోనికి వచ్చాడు. విజ్ఞాన సర్వస్వం కృషిలో లక్ష్మణరావుకు తోడు నిలచిన రాయప్రోలు సుబ్బారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రథమాచార్యులుగా పనిచేశాడు.