గోగినేని భారతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , గా → గా (2), హైదరాబాద్ → హైదరాబాదు, స్వతం using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''గోగినేని భారతీదేవి''' (1908 - 1972) స్వతంత్ర సమర యోధురాలు మరియు సంఘ సేవిక.
 
ఈమె [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]] తాలూకా, [[మాచవరం]] గ్రామములో వెలగా సుబ్బయ్యకు 15.8.1908 న జన్మించింది. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి. రంగా]] ఈమెను 1924లో వివాహం చేసుకున్నారు. [[గుంటూరు]] శారదా నికేతన్ లోను, చెన్నైలోని విద్యోదయా పాఠశాల లోను విద్యాభ్యాసము చేసి, రంగాతో బాటు [[ఇంగ్లాండు]] వెళ్ళి ఆక్స్ ఫర్డ్ లో రస్కిన్ కళాశాలలో చదివింది.
 
స్వదేశము తిరిగి వచ్చిన పిదప భర్తతో బాటు స్వాతంత్ర్యోద్యమములో పాల్గొని కారాగారవాసం అనుభవించింది. 1931లో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమము సందర్భములో తెనాలిలో[[తెనాలి]]లో ఆరు నెలలు ఆందోళన చేసింది. సహాయ నిరాకరణోద్యములో పోరాడి [[వెల్లూరు]] జైలులో ఒక సంవత్సరము నిర్బంధించబడింది. వెంకటగిరిలో[[వెంకటగిరి]]లో జమీందారీ రైతుల ఆందోళనలో దెబ్బలు తిన్నది. హరిజనోద్యమము, దళితులతో సహభోజనాలు, కులాంతర వివాహాలు మున్నగు పలు కార్యక్రమాలు జరిపింది.
 
ఈమె 1936 లో గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలుగా ఎన్నికయ్యారు.1940-42 మధ్య ఆంధ్ర[[ఆంధ్]]ర కర్షక కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా చేసింది. 1946-47లో మద్రాసు రాష్ట్ర విద్యాసలహా సంఘమునకు సభ్యురాలు. 1956లో [[కృష్ణా జిల్లా]] ఘంటశాలలో[[ఘంటశాల]]లో ఆంధ్ర మహిళా అధ్యక్షురాలు. 1958-64 లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యురాలుగా ఉన్నారు.
 
1952-53లో [[రాయలసీమ]] కరవు వచ్చినపుడు బాధితుల సహాయమనకై నిరంతరము శ్రమించింది. "అన్నపూర్ణ" అని కొనియాడబడింది.
 
నిడుబ్రోలులో[[నిడుబ్రోలు]]లో భర్తకు చేదోడుగా ఉండి, చివరకు సెప్టెంబరు 21, 1972న మరణించింది.
 
==మూలాలు==
* భారతీదేవి, గోగినేని (1908 - 1972), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, [[తెలుగు విశ్వవిద్యాలయం]], [[హైదరాబాదు]], 2005, పేజీ 400-01.
 
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/గోగినేని_భారతీదేవి" నుండి వెలికితీశారు