చెలికాని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల (2), స్కూళ్ళు → పాఠశాలలు, కాలేజి → కళాశాల using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , నారయణ → నారాయణ, ఆర్ధిక → ఆర్థిక, అభ్యర using AWB
పంక్తి 35:
| weight =
}}
'''చెలికాని వెంకట రామారావు''' ([[జులై 15]], [[1901]] - [[సెప్టెంబరు 25]], [[1985]]) ([[ఆంగ్లం]]:Chelikani Ramarao) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, [[హేతువాది]] మరియు [[సోషలిస్టు]]. 20 వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోని ఉజ్వల అధ్యాయాలకు ప్రతీకగా నిలుస్తారు. మానవత, నిజాయితీ, వినమ్రత, విస్పష్టమైన నిబద్ధత మొదలైన విశిష్ట లక్షణాలతో ఆయన తన కాలంనాటి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. వివేకానందుని బోధనలు, బ్రహ్మ సమాజ ఉద్యమం, [[రఘుపతి వెంకటరత్నం]] గారి శిష్యరికం, స్వతంత్ర పోరాటం, జైలు జీవితం, హరిజనసేవ, స్త్రీ జనోద్దరణ, [[కమ్యూనిస్టు]] ఉద్యమం, [[పార్లమెంటు]] సభ్యత్వం, వైద్యసేవ మొదలైన అంశాలకు ఆయన ఒక వాహిక లాగా నిలవడమే గాక వాటిపై తనదైన ముద్ర వేశారు.
==జీవిత విశేషాలు==
ఈయన [[జులై 15]], [[1901]]లో నారయణస్వామినారాయణస్వామి, సూరమ్మ దంపతులకు [[తూర్పు గోదావరి జిల్లా]] [[పిఠాపురం]] సమీపంలోని [[కొండెవరం]] లో జన్మించారు. సంఘ సంస్కరణోద్యమాలు, సాయుధ విప్లవోధమాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లాలోణి అద్వితీయమైన వాతావరణం ప్రభావం బాల్యం నుండే ఆయన పై చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా పిఠాపురం రాజావారి వ్యక్తిత్వం చిన్నతనంలోనే రామారావును విశేషంగా ఆకట్టుకుంది. రాజావారి సహాయం తోనే రామారావు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు రాసి ఉన్నత పాఠశాలలో ప్రథముడిగా ఇలిచాడు ఉన్నత పాఠశాల జీవితం లోనే స్వదేశీ ఉద్యమం వైపు మొగ్గు చూపిన రామారావు కాలేజీ చదువుకోసం కాకినాడ వెళ్ళేనాటికి థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యారు. దేశం పరిపాలనలో మగ్గిపోతుంటే సుఖంగా కూర్చుని చదువుకోవడం సాంఘిక ద్రోహమని 1921, జనవరి 26న చదువుకు స్వస్తి చెప్పి ఇల్లొదిలి విశాలమైన ప్రజా జీవితం లోకి ప్రవేశించారు. జాతీయ ఉద్యమంలో చేరాడు. 1922లో [[రాజమండ్రి]]లో మొదటిసారి జైలు శిక్షను అనుభవించాడు. 1924లో [[కాకినాడ]]లో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసాడు. 1926-30 [[నిజాం సంస్థానం]]లో M&S చదివి, అక్కడి, సంస్కరణోద్యమాలతో సంబంధాలు నెలకొల్పాడు. 1930లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నాడు. 1931లో [[డాక్టరు]] డిగ్రీ పట్టా పొందారు.తరువాత రోజుల్లో సర్ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] గారి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు ఆయనను బాగా ఆకర్షించాయి. తెలుగునాట సాంఘిక విప్లవానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాయకత్వం వహించిన [[కందుకూరి వీరేశలింగం పంతులు]] కూడా ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. 1934 లో కందుకూరి దగ్గర పెరిగిన డాక్టర్ కమలమ్మను రామారావు గారు కులాంతర వివాహం చేసుకున్నారు. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించాడు. ఇంకా జిల్లా హరిజన సంఘ అధ్యక్షులుగా 1935 లో వ్యవహరించాడు. ఈయన డాక్టరుగా 1937 నుండి [[రంగూన్]]లో ఉన్నాడు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించాడు. 1952లో కాకినాడ [[పార్లమెంటు]] సభ్యునిగా తొలి లోక్‌సభకు సి.పి.ఐ ([[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]]) అభ్యర్ధిగాఅభ్యర్థిగా ఎన్నికైనాడు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్ధిగాఅభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి [[సెప్టెంబరు 25]], [[1985]]న దివంగతులైనాడు.
==కమ్యూనిష్టు వాదిగా==
తాను నమ్మిన ఆశయాలను మనసా వాచా కర్మణా ఆచరించి తరువాత తరాలకు ఆదర్శప్రాయుడైన మహానుభావుడు ఆయన. తన దగ్గర వైద్యం చేయించుకున్న బీదసాదల నుంచి ఏవిధమైన రుసుమూ తీసుకోకుండా ఖర్చులకోసం తిరిగి వారికే కొంత డబ్బు ముట్టచెప్పేవారు. మూర్తీభవించిన సౌజన్యంతో జీవితంలో కడదాకా కష్టజీవుల అభ్యున్నతికోసం కృషిచేసిన డాక్టర్ రామారావు గారు చరిత్రలో ఒక "లిజెండరీఫిగర్" గా నిలిచిపోతారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో [[మహాత్మ గాంధీ]] ఆయనను బాగా ఆకర్షించారు. ఆయన ప్రభావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన డాక్టర్ రామారావు గారి జీవితంలో సంభవించిన విప్లవ పరిణామక్రమంలో చివరకు ఆదర్శ [[కమ్యూనిస్టు]]గా మారారు.
 
==స్వాతంత్ర్య పోరాటంలో..==
పంక్తి 50:
డాక్టర్ చెలికాని 1922 మార్చి నెలలో చట్టధిక్కరణ నేరానికి ఒక సంవత్సరం [[రాజమండ్రి]] జైలులో నిర్భంధించబడ్డారు. అక్కడ [[నీలకంఠ బ్రహ్మచారి]] అనే విప్లవకారునితో పరిచయమైంది.అతని ద్వారానే రామారావుగారు [[రష్యా విప్లవం]] గురించీ [[లెనిన్]] గురించీ ముఖ్యమైన విషయాలెన్నో తెలుసుకున్నారు.
 
జైలు నుంచి విడుదలయ్యాక [[బులుసు సాంబమూర్తి]], [[మొసలికంటి తిరుమలరావు]]గార్లతో కలిసి జిల్లా కాంగ్రెస్ సంఘం అభివృద్ధికి ఆయన ఎంతో కృషిచేశారు. ప్రభుత్వంవారు కాకినాడలో బంగారువారి సత్రంలో ఉండే పట్టణ కాంగ్రెస్ కార్యాలయాన్ని రూపుమాపి, ఎవరైనా కాంగ్రెస్ ఆఫీసుకు ఇల్లు ఇస్తే ఆ యింటి యజమానికి జైలు శిక్ష విధింపబడుతుందని దండోరా వేయించారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో శ్రీమతి పెద్దాడ కామేశ్వరమ్మ, వేదాంతం వెంకట కృష్ణయ్య మొదలైన వారితో కలసి రామారావుగారు ధైర్యంగా కాంగ్రెస్ ఆఫీసు తిరిగి ప్రారంభించారు. 1923 లో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు మహాసభల ఆహ్వాన సంఘంలో ప్రధానమైన బాధ్యతలు నిర్వహించారు. 1925 నుంచి ఉదృతంగా ఖాదీ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. జాతీయ దృక్పధంతో విద్యనేర్పాలనే ఉద్దేశ్యంతోఉద్దేశంతో [[బందరు]]లో స్థాపించబడ్డ జాతీయ కళాశాల నిధులకోసం చందాలు వసూలుచేశారు.
 
1930 లో [[హైదరాబాదు]] మెడికల్ కాలేజీలో చదువుతూ 15 రోజులలో పరీక్షలున్నా లక్ష్యపెట్టకుండా- కళాశాల వదలిపెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో [[బులుసు సాంబమూర్తి]], [[దుర్గాబాయ్ దేశ్‌ముఖ్]], [[మొసలికంటి తిరుమలరావు]] లతో కలిసి పనిచేశారు. 1930-31 శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని కాకినాడలో హిందూ స్థానీ సేవాదళ్ శిక్షణాశిబిరానికి కెప్టెన్ గా ఉండి చట్టధిక్కరణ నేరానికి తిరిగి ఒకటిన్నర సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. అప్పుడు [[బెంగాలీ]] డిటెన్యూలతో పరిచయం ఏర్పడింది. వారిదగ్గర [[కమ్యూనిస్టు]] మూలసూత్రాల గురించి వివరంగా తెలుసుకుని ఆ సిద్ధాంతాల వలన ఎంతో ప్రభావితులయ్యారు.
పంక్తి 62:
తరువాత కాలంలో క్షయవ్యాధితో పాడైన ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఈరెండు ఆపరేషన్లూ శారీరకంగా డాక్టర్ రామారావు గారిని ఎంతో దెబ్బతీశాయి. అయినా ఆయనలోని విప్లవ కార్యదీక్ష ఏమాత్రం కుంటుపడలేదు.
 
1952 లో జరిగిన ఎన్నికలలో [[కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం]] నుంచి [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]] అభ్యర్ధిగాఅభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనారోగ్యంతో శానిటోరియంలో ఉన్న రామారావుగారు ప్రచారంలో పాల్గొనక పోయినా ఆ ఎన్నికలలో [[మొసలికంటి తిరుమలరావు]], [[బులుసు సాంబమూర్తి]] మొదలైన హేమాహేమీలపై విజయం సాధించారు. శ్రామికజన పక్షపాతిగా ఆయన తనవాణిని లోక్ సభలో సమర్ధవంతంగా వినిపింపచేశారు. సభ దృష్టికి ఆయన తీసుకువచ్చిన ఎన్నోసమస్యలకు సంబంధించి పండిట్ నెహ్రూ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. 1956లో లోక్ సభ స్పీకర్ [[అనంతశయనం అయ్యంగార్]] నాయకత్వంలో [[చైనా]] పర్యటించిన అధికార ప్రతినిధివర్గంలో సభ్యునిగా డాక్టర్ చెలికాని [[చైనా]] అధ్యక్షుడు [[మావో]]తో సహా ముఖ్యనాయకులందరినీ కలిసి చర్చలు జరిపారు.
 
రామారావుగారి జీవనసహచరి కమలమ్మగారు 1976 లో మరణించే ముందు ఒక సంవత్సరం పైగా అనారోగ్యంతో మంచంమీద కదలలేని స్థితిలో ఉండిపోయారు. ఆ సంవత్సర కాలమూ రామారావుగారు ఆమె దగ్గరే ఉండి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. "ఇంతమంది ఉండగా ఈ వయసులో మీకెందుకు శ్రమ?" అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు గుండెను కదిలిస్తుంది. "జీవితమంతా రాజకీయాలలో మునిగిన నేను భర్తగా ఆవిడకు న్యాయం చేకూర్చలేకపోయాను. ఈ స్థితిలో ఆవిడకు సేవచేయ్యడం నా బాధ్యత!"అన్నారు. ఆర్ధికఆర్థిక సంబంధాలు బెడిసికొడితే భార్యాభర్తలే పరస్పరం విరోధులుగా మారుతున్న ఈ దౌర్భాగ్యపు వ్యవస్థలో డాక్టర్ రామారావుగారి జవాబు ఆయనలోని ఉదాత్తమైన జీవితాదర్శాన్ని తెలియచేస్తుంది.<ref>1985అక్టోబరు 5 సంతాపసభ సందర్భంలొ ‘[[విశాలాంధ్ర]]’ దినపత్రిక ప్రచురించిన '''అదృష్టదీపక్''' రచన</ref>
==విశేషాలు==
*ఈనాడు జాతీయోద్యమ విలువలు లేవు.డబ్బు, అధికారం రాజకీయ జీవితాన్ని కలుషితం చేస్తున్నాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డాక్టరు చెలికాని వెంకట్రామారావుగారి ఆదర్శ జీవితాన్ని స్మరించుకోటం ఎంతైనా అవసరం- [[చండ్ర రాజేశ్వరరావు]]
"https://te.wikipedia.org/wiki/చెలికాని_రామారావు" నుండి వెలికితీశారు