జమీందార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, → , ( → ( using AWB
పంక్తి 16:
 
== చిత్రకథ ==
శేషు అనబడే శేషగిరిరావు ([[అక్కినేని నాగేశ్వరరావు]]), సరోజ ([[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]]) ఒక పిక్నిక్ లో కలుసుకుంటారు, వారి పరిచయం ప్రేమగా మారుతుంది. శేషు అన్నావదినెలు సుబ్బారావు ([[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]]), లక్ష్మి ([[హేమలత]])లకు శేషును అదుపుచెయ్యడం ఓ పెద్ద పని. వారికి శేషును అదుపుచేస్తూ సరదాగా కాలంగడపడంలోనే సంతోషం. నరహరి ([[ముదిగొండ లింగమూర్తి]]), రాజారెడ్డి ([[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]) యుద్ధంలో పనిచేసే రోజుల్లో ప్రభుత్వసొమ్ము రూ.20లక్షలు ఒక స్థావరం నుంచి మరోదానికి తరలిస్తున్నప్పుడు, అదనుచూసి దొంగిలిస్తారు. ప్రభుత్వోద్యోగం నుంచి ఇద్దరిలో ముందు రిటైరైన నరహరి కాంట్రాక్టరు అవతారమెత్తుతాడు. భార్య ([[సూర్యకాంతం]]), కూతురు సరోజలతో సంపదను అనుభవిస్తూ సుఖంగా జీవిస్తూంటాడు. ఈలోగా రాజారెడ్డి కూడా ఉద్యోగం నుంచి రిటైరై తానూ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేపడదామని డబ్బు ఎక్కడ దాచావంటూ నరహరిని అడుగుతాడు. తనకేమీ తెలియదని నరహరి తెగేసి చెప్తాడు, అయినా దాని సంగతి తేల్చాకే కదులుతానంటూ రాజారెడ్డి ఇంట్లో నరమరి దిగబడతాడు. ఇంతలో ప్రేమించుకున్న శేషు-సరోజల పెళ్ళికి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ సమయంలో అప్పటికే శేషుకు వేరే అమ్మాయితో సంబంధం ఉన్నట్టు, ఆమెకు కడుపుచేసి వదిలేసినట్టు ఓ అన్నచెల్లెళ్ళను పురమాయించి అల్లరిచేయిస్తాడు రాజారెడ్డి. ఇదంతా నిజంకాదని శేషు చెప్పినా వినకుండా అవన్నీ నమ్మి సరోజతో సహా అందరూ అతన్ని అసహ్యించుకుని గెంటేస్తారు.<br />
అదేరోజు రాత్రి రాజారెడ్డి నరహరిని కత్తితో హతమార్చి ఆ నిందను శేషు మీద తోసెయ్యబోతే, అతన్ని కాపాడేందుకు అతని అన్న సుబ్బారావు కేసు తననెత్తిన వేసుకుంటాడు. ఆపైన నేరాన్ని కనుక్కునే క్రైమ్ థ్రిల్లర్ గా సాగుతుంది సినిమా. సినిమా మలుపులు తిరిగి క్లైమాక్సుకల్లా శేషగిరిరావు ప్రభుత్వం నియమించిన సీఐడీ అనీ, పోయిన ఇరవైలక్షల రూపాయలు వెతికేందుకు నియమించిందని తెలుస్తుంది. చివరకి అసలు నేరస్తులు శిక్షింపబడి ఇరవైలక్షల రూపాయలూ ప్రభుత్వానికి స్వాధీనం కావడమూ, హీరోహీరోయిన్ల మధ్య కలతలు తొలిగిపోయి కలిసిపోవడంతో కథ ముగుస్తుంది.
==నటీనటులు==
పంక్తి 28:
* [[సూర్యకాంతం]] - నరహరి భార్య
* [[ఎల్. విజయలక్ష్మి]] - సెక్రటరీ
* [[మిక్కిలినేని]] - జోగీందర్
* [[సత్యనారాయణ]] - జానీ
* [[సీతారాం]] - సుబ్బారావు గుమస్తా
పంక్తి 47:
{{మూలాలజాబితా}}
==వనరులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
==బయటి లింకులు==
* [http://thegreatindian.com/onlinemovies/zamindar1965/ Watch Zamindar movie online at the greatindian.com]
"https://te.wikipedia.org/wiki/జమీందార్" నుండి వెలికితీశారు