జమ్మి కోనేటిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజ్ఞాన శాస్త్ర రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → , ) → ) (3) using AWB
పంక్తి 1:
'''జమ్మి కోనేటిరావు''' తెలుగులో విజ్ఞానశాస్త్ర విషయాలపై రచనలు చేసే అతికొద్ది మంది రచయితలలో ఒకడు.
==విశేషాలు==
ఇతడు [[1929]], [[మార్చి 1]]వ తేదీన జన్మించాడు. ఇతడు [[విశాఖపట్టణం]] కు చెందినవాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. తెలుగు సైన్సు రచయితల సంఘం[Science Writers Association in Telugu (SWATI) ]ను స్థాపించాడు. తరువాత ఈ సంస్థ [[న్యూఢిల్లీ]]లోని ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్ (ISWA) కు అనుబంధంగా మారింది. అతని భార్య పేరుమీద జమ్మి శకుంతల అవార్డును నెలకొల్పి ప్రతియేటా ఒక సైన్సు రచయితకు జాతీయ సైన్స్ దినం రోజు ఆ అవార్డును ప్రదానం చేశాడు. ఈ అవార్డును పొందిన వారిలో [[కె.ఆర్.కె.మోహన్]], [[మహీధర నళినీమోహన్]], ఆర్.ఎల్.ఎన్.శాస్త్రి, బి.జి.వి.నరసింహారావు, [[సి.వి.సర్వేశ్వరశర్మ]] మొదలైనవారు ఉన్నారు. ఇతడు 80కి పైగా తెలుగులో శాస్త్ర సంబంధమైన గ్రంథాలు రచించాడు. 1954నుండి ఇతని రచనావ్యాసంగం మొదలై ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రముఖ [[ఇంగ్లీషు]], [[తెలుగు]] దిన, వార, మాస, త్రైమాస పత్రికలలో వెయ్యికి పైగా వైజ్ఞానిక వ్యాసాలు వ్రాశాడు. వందకు పైగా రేడియో ప్రసంగాలు చేశాడు.
 
==శీర్షికలు==
"https://te.wikipedia.org/wiki/జమ్మి_కోనేటిరావు" నుండి వెలికితీశారు