టి.యస్.విజయచందర్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), లు → లు (2), → (2), , → ,, ) → ) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేసి → పనిచేసి, ) → ) using AWB
పంక్తి 40:
కాకినాడ పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో ఉండగా ఆయన దృష్టి నాటకాల వైపు మళ్ళింది. [[ఏడిద నాగేశ్వరరావు]], [[వి.బి.రాజేంద్ర ప్రసాద్]]లు ఆయనకు సీనియర్లు. ఆయన వేసిన తొలి నాటిక లోభి. మాడా వెంకటేశ్వరరావు, ఏడిద నాగేశ్వరరావు తదితరులు స్థాపించిన రాఘవ కళాసమితిలో అనేక నాటకాల్లో పాల్గొన్నాడు. తర్వాత డిగ్రీ కోసం మళ్ళీ మద్రాస్ కు వెళ్ళాడు. 1963లో డిగ్రీ పూర్తయింది. వాళ్ళ నాన్న 1954లోనే కాకినాడలో వదిలి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఈయన డిగ్రీ ఐపోయాక హైదరాబాద్ వచ్చేసి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు.
 
తొలుత విద్యుత్ శాఖలో 84 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు. తర్వాత 200 రూపాయలు జీతంతో [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్]]కు మారాడు. అయితే ఒకసారి ఉద్యోగుల సమస్యలపై యూనియన్ వాళ్ళను నిలదీయడంతో వారు ఆయన్ను గన్ ఫౌండ్రీ శాఖ నుంచి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయ]]శాఖకు బదిలీ చేశారు. అక్కడే కొద్ది కాలం పని చేసినాపనిచేసినా అసంతృప్తితో బయటకు వచ్చి సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాస్ కు వెళ్ళాడు.
 
[[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో వచ్చిన మరో ప్రపంచం సినిమాలో జర్నలిస్టుగా అవకాశం ఇచ్చారు. తర్వాత [[కె.ఆర్.విజయ]] ప్రధాన పాత్రలో నిర్మించిన దేవీ లలితాంబ సినిమాలో విలన్ గా నటించాడు. తరువాత ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన సినిమా కరుణామయుడు. ఈ సినిమా విడుదలకు నాలుగేళ్ళు సమయం పట్టినా అద్భుతమైన స్పందన వచ్చింది. అదే పంథాలో [[రాజాధిరాజు]], [[దయామయుడు]], ఇలా వరుసగా సినిమాలు నిర్మించాడు. 1985 లో దర్శకుడు [[పి.వాసు]] తీసిన షిరిడీ సాయిబాబా మహత్యం ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన మరో సినిమా. ఇంకా [[ఎన్.శంకర్]] తీసిన భద్రాచలం సినిమా కూడా మంచి పేరు తీసుకుని వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/టి.యస్.విజయచందర్" నుండి వెలికితీశారు