"తుని" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, విద్యార్ధు → విద్యార్థు, → using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు కి → ుకు (2), లో → లో (9), కి → కి (5), విశాఖపట్టణం → విశాఖప using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, విద్యార్ధు → విద్యార్థు, → using AWB)
తుని అనగానే చట్టున గుర్తొచ్చే పేరు తలుపులమ్మ లోవ. తలుపులమ్మ తల్లి ఇక్కడ ఒక చిన్న గుహలాంటి ప్రదేశంలో ఉంటుంది. కొండ మలుపులు ఎత్తు పల్లాలు రాళ్ళు రప్పల మధ్య నడక దారిలో చాలా దూరం ప్రాయాణము చేయగా వచ్చే లోయ ఇది. ఇప్పుడంటే బస్సులు వేసేరు కాని పూర్వం తలుపులమ్మ లోవకి వెళ్ళటం అంటే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఘన కార్యంగా భావించేవారు. ఈ లోయలో ఒక ఝరీపాతం ఉంది. ఆ రోజులలో ఈ ఝరీపాతం లోని నీళ్ళు కొబ్బరి నీళ్ళల్లా తియ్యగా ఉండేవి. ఈ సెలయేరుకి ఇటు అటు ఎన్నో రకాల జాతుల మొక్కలు ఉండట వలన ఈ ప్రదేశము సోభాయమానముగా కానవస్తుంది. తలుపులమ్మ లోవ పర్యాటకులని ఆకర్షించటానికి అనువుగా తీర్చిదిద్దిన సుందరమైన ప్రదేశం.
;తుని కిళ్లీ
భోజనం తర్వాత [[తాంబూలము|కిళ్ళీ]]కి కూడా తుని ప్రసిద్ధమే. తుని దగ్గర లకారసామి కొండ దిగువన రాంభద్రపురం పక్కన సత్యవరం అనే పల్లెటూరు ఉంది. ఆ ఊరు మట్టిలో ఉన్న అద్భుతం వలననో ఏమిటో కాని అక్కడ పెరిగే [[తమలపాకులు|తమలపాకుల]] రుచి మహద్బుతంగామహాద్బుతంగా ఉంటుందంటారు. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉంటే తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోతాయి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిళ్ళీ ఉండేదే కాదు అంటారంతా. హొటల్లో భోజనం చేసి, కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని, తర్వాత నూర్జహాన్ కిళ్ళీ వేసుకుని సినిమాకి వెళ్ళటం అంటే ఆ చుట్టుప్రక్కల వాళ్ళకు పాత రోజులలో ఒక లగ్జరీ.
;ఊక మేడ
తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అంటారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవములలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం ఈ ఊరి వర్తకులకి ఉందనిన్నీ ఊకమేడను చూస్తే తెలుస్తుంది.
 
==నీలిమందు==
లక్షిందేవి చెరువు గట్టు మీద ఇటికలతో కట్టిన పెద్ద పెద్ద కుండీలు మూడో, నాలుగో ఉండేవి. ఒక్కొక్క కుండీ 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పు, పది అడుగుల లోతు ఉండేవని అంచనా ఒక అంచనా. ఈ కుండీలు ఒక [[నీలిమందు]] కర్మాగారపు అవశేషాలు. [[నీలి మొక్క]] (లేదా నీలిగోరింట, లేదా మధుపర్ణిక) అనే మొక్క రసం నుండి తయారు చేస్తారు. ఈ నీలిమందుని. ఈ నీలిమందు వాడకం ఎప్పటినుండి మన దేశంలో ఉండేదో తెలియదు కాని, [[బ్రిటిష్]] వాళ్ళ హయాంలో ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. కనుక ఈ కుండీలు క్రీ.శ. 1800 ప్రాంతాలలో ఎప్పుడో కట్టి ఉంటారు. కాని 1880 లో [[జర్మనీ]]లో ఏడాల్ఫ్ బేయర్ అనే ఆసామీ నీలిమందుని కృత్రిమంగా – అంటే నీలిమొక్కల ప్రమేయం లేకుండా – చెయ్యటం కనిపెట్టేడు. అది సంధాన రసాయనానికి స్వర్ణయుగం అయితే, నీలిమందు పండించి పొట్ట పోసుకునే పేద రైతులకి గడ్డు యుగం అయింది. ఏడాల్ఫ్ బేయర్ ధర్మమా అని భారత దేశంలో నీలి మొక్కల గిరాకీ అకస్మాత్తుగా పడిపోయింది. తర్వాత లక్షిందేవి చెరువు దగ్గర కర్మాగారం ఖాళీ అయిపోయింది. తర్వాత వాడుక లేక శిధిలమై కూలిపోయింది. నీలి మొక్కలు తుని నుండి [[తలుపులమ్మ లోవ]]కి వెళ్ళే దారి పొడుక్కీ పుంత పక్కని పెరిగేవి. ఈ తలుపులమ్మ లోవలో దొరికినన్ని [[మొక్కల(బొటానికల్) నమూనాలు]] ఆంధ్రదేశంలో మరెక్కడా దొరకవని అనేవారు. అందుకనే [[విశాఖపట్నం]] లోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి, [[కాకినాడ]] పి. ఆర్. కళాశాల నుండి బోటని విద్యార్ధులువిద్యార్థులు తరచు ‘ఫీల్డ్ ట్రిప్పు’ కని ఇక్కడకి వచ్చేవారు.
 
==గణాంకాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1974900" నుండి వెలికితీశారు