అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (14), ( → (, లో → లో (6), ని → ని (9), గా → గా , తో → తో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు, అభివృద్ది → అభివృద్ధి, స్వచ్ using AWB
పంక్తి 93:
 
[[బొమ్మ:Antarvedi 1.jpg|thumb|right|250px|దేవాలయ ఆవరణలో అంగళ్ళ వ్యాపారం]]
'''అంతర్వేది''' ([[ఆంగ్లం]] Antarvedi) , [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము, [[తూర్పు గోదావరి]] జిల్లా, [[సఖినేటిపల్లి]] మండలానికి చెందిన [[గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. ]]. అందమైన [[బంగాళాఖాతం|బంగాళాఖాతపు]] సముద్రమున [[గోదావరి]] నదీశాఖయైన [[వశిష్టానది]] సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. [[పశ్చిమగోదావరి జిల్లా]] [[నరసాపురం]]కు సమీపములో కల ఈ త్రికోణాకారపు [[దీవి]] పై ప్రసిద్ధి చెందిన [[లక్ష్మీనరసింహస్వామి]] వారి పురాతన ఆలయం కలదుఉంది.
 
భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు {{coor d|16.3333|N|81.7333|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Antarvedi.html Falling Rain Genomics.Antarvedi]</ref> ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.
పంక్తి 106:
 
==రక్తవలోచనుని కథ==
ఒకానొక సమయంలో రక్తావలోచనుడు ([[హిరణ్యాక్షు]]ని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ [[గోదావరి]] నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి [[విశ్వామిత్రుడు]]కి [[వశిష్ఠుడు]]కి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహా[[విష్ణువు]]ను ప్రార్థించగా మహావిష్ణువు [[లక్ష్మి|లక్ష్మీ]] సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి [[సుదర్శనం|సుదర్శనము]]ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన [[మాయాశక్తి]]ని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా [[రక్తకుల్య]] అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ [[లక్ష్మీనృసింహస్వామి]]గా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన [[చక్రాయుధము]]ను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.
 
==ఆలయ నిర్మాణ విశేషాలు==
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు [[కొపనాతి కృష్ణమ్మ|శ్రీ కొపనాతి కృష్ణమ్మ]]<ref>[http://www.telugudanam.co.in/samskruti/puNyaksheatraalu/aMtarvaedi.php ఆలయ విశేషాలు]</ref>. వీరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ వాస్తవ్యులు. ప్రముఖ నౌకావ్యాపారవేత్త శ్రీ కొపనాతి ఆదినారాయణ గారు వీరి తండ్రిగారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగినదిజరిగింది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా [[విగ్రహము]] కలదుఉంది. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా ([[నడవా]]) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి [[యాత్రికులు]] పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు [[ప్రకృతి]] తిలకించుటకు అనువుగా నిర్మించారు. ఆలయమునకు దూరముగా [[వశిష్టానది]]కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసారు.
ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .
 
==సందర్శనాస్థలములు==
====వశిష్టాశ్రమము====
అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము కలదుఉంది. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన [[ఆశ్రమము]] నిర్మించబడినదినిర్మించబడింది.
ఈ ఆశ్రమము వికసించిన [[కమలము]] మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ [[సరోవరము]] మధ్య కలువపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా [[ద్యానమందిరం]], పఠనాశాల, యోగశాల, [[విశ్రాంతి]] మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు ఉన్నాయి.
 
====దీప స్తంభం====
దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా [[దీప స్తంభం]] ([[లైట్ హౌస్]]) కలదుఉంది. దీనిని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విద్యార్ధులతోవిద్యార్థులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్ హౌస్ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి కలదుఉంది. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, వశిష్టాశ్రమము, మిగిలిన దేవాలయములు, దూరదూరంగా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీరప్రాంతము వెంబడి కల సర్వితోటలు అత్యద్భుతంగా కానవస్తాయి.
====అశ్వరూడాంభిక(గుర్రాలక్క) ఆలయము====
నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో కలదుఉంది. స్థల పురాణ రెండవ కథనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి [[సుదర్శనము]]ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన [[రక్తం]] అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.
====అన్న చెళ్ళెళ్ళ గట్టు====
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగాస్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత
 
====సముద్రతీరం====
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్దిఅభివృద్ధి పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుబ్రంగానూ, స్వచ్చంగానూస్వచ్ఛంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, [[దీపస్తంభం]] (లైట్ హౌస్) , గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.
 
====ఇతర ఆలయాలు====
పంక్తి 131:
 
==ఇతర విశేషాలు==
అంతర్వేది గ్రామము.<ref name="ReferenceA"/>. సినిమా షూటింగులకు పెట్టినపేరు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపుల చిత్రాలైన [[మూగమనసులు]] లాంటి చిత్రాలనుండి [[సరిగమలు]], [[అప్పుడప్పుడు]], [[పెళ్ళైనకొత్తలో]] ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగినదిజరిగింది. ఇంకా జరుగుతున్నవి.
 
==రవాణా సౌకర్యాలు==
పంక్తి 140:
 
==వసతి సౌకర్యాలు==
అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదుఉంది. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ ఉన్నాయి. రెండు ప్రైవేటు లాడ్జిలు ఉన్నాయి. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు.
 
== దేవాలయపు పండుగలు,ఉత్సవాలు ==
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు