అడవి: కూర్పుల మధ్య తేడాలు

+మూలం#1, చిరు మార్పులు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అహారం → ఆహారం, యూరప్ → ఐరోపా, వైవిద్య → వైవిధ్య, పటిష్ట using AWB
పంక్తి 12:
== అడవులలో రకాలు ==
=== కోనిఫెరస్ అడవులు ===
కోనిఫెరస్ అడవులు (Coniferous Forests) శీతల ప్రాంతాలలో పెరుగుతాయి. ఎక్కువ వర్షపాతం, పటిష్టమైనపటిష్ఠమైన రుతు శీతోష్ణస్థితులు, చాలాకాలం కొనసాగే అతి శీతాకాలం, కొద్దికాలం ఉండే వేసవికాలం, ఈ అడవులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి కొన్ని ఖండాలను కలుపుతూ వరుసగా పెరుగుతాయి. ఉత్తర అమెరికా, యూరేసియా, కెనడా, స్వీడన్, ఫిన్లాండ్, సైబీరియా దేశాల్లో ఇవి వ్యాపించి ఉన్నాయి. సతతహరిత వృక్ష జాతులైన పైన్, స్ప్రూస్, ఫర్ మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి. చెవుల పిల్లులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ముళ్ళపందులు, ఉడతలు, హైలా, రాఅనా, అనేక జాతుల పక్షులు, పెద్ద శరీరంతో ఉండే సకశేరుకాలు మొదలైనవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మృత్తిక పలుచగా హ్యూమస్ రహితంగా ఉంటుంది. మట్టి సారవంతమై ఉండదు. కోనిఫెర్ ల గింజలు జంతువులకు మంచి అహారంగాఆహారంగా ఉపయోగపడతాయి.
 
=== ఆకురాల్చే సమశీతోష్ణ అడవులు ===
ఆకురాల్చే సమశీతోష్ణ అడవులు (Tropical Deciduous Forests) శీతోష్ణస్థితి సమంగా ఉండే ప్రాంతాలలో ఉంటాయి. ఇక్కడ చెట్లు వెడల్పు ఆకులతో ఉంటూ, వర్షాకాలంలో ఆకులు రాల్చి, చలికాలంలో పత్రరహితంగా ఉండి, వసంతకాలంలో తిరిగి చిగుర్చుతాయి. ఇవి ఉత్తర అమెరికా, యూరప్ఐరోపా, తూర్పు ఆసియా, చిలీ, ఆస్ట్రేలియా, జపాన్ మొదలైన దేశాలలో ఉన్నాయి. అతి శీతలంగా ఉండే చలికాలం, సంవత్సరానికి 80-180 సెం.మీ. వర్షపాతం, 10-20 డిగ్రీల వేడిమి ఈ అడవుల ముఖ్య లక్షణాలు. చెట్లు 40-50 మీ. ఎత్తు పెరుగుతాయి. ఓక్, బీచ్, కాడన్ ఉడ్, ఎల్మ్ వంటి పెద్ద వృక్షాలు ఉంటాయి. నాచులు, శైవలాలు, లైకేన్లు వృక్ష కాండాలమీద పెరుగుతాయి. జింకలు, ఎలుగుబంట్లు, ఉడతలు, నక్కలు, వడ్రంగి పిట్టలు, తాబేళ్లు, బల్లులు, పాములు ముఖ్యమైనవి. క్షీరదాలలో పందులు, పర్వత సింహాలు ఉంటాయి.
 
=== సతతహరిత సమశీతోష్ణ అడవులు ===
సతతహరిత సమశీతోష్ణ అడవులు (Tropical Evergreen Forests) మధ్యధరా ప్రాంతానికి చెందిన శీతోష్ణ పరిస్థితులలో పెరుగుతాయి. పొడిగా ఉండే ఎండాకాలం, అతిచల్లని శీతాకాలం ఉండటం దీని లక్షణం. ఈ వృక్షాలకు చిన్నగా సూది ఆకారంలో ఉండే ఆకులు గానీ, కొద్ది వెడల్పుగా ఉండే ఆకులు గానీ ఉంటాయి. దీనిలో మహావృక్షాలు ఉండవు. చెట్లు 3.8 మీ. ఎత్తు పెరుగుతాయి. ఈ అడవులు ఎక్కువగా కాలిపోతుంటాయి. అందువల్ల ఇక్కడి చెట్లు త్వరగా పునరుత్పత్తి చేసుకోగలిగే అనుకూలనాలతో ఉంటాయి. కంచర గాడిదలు, జింకలు, కుందేళ్ళు, అడవి ఎలుకలు, బల్లులు ఇక్కడ ఉండే ముఖ్యమైన జంతువులు. వేగంగా పరుగెత్తే ఖురిత జంతువులు , దుమికే జంతువులు, ఇక్కడ నివసించే ముఖ్యమైన శాకాహార జీవులు.
 
=== వర్షాధార సమశీతోష్ణ అడవులు ===
పంక్తి 24:
 
=== వర్షాధార ఉష్ణమండల అడవులు ===
వర్షాధార ఉష్ణమండల అడవులు (Tropical Rain Forests) భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణోగ్రత, తేమ రెండూ కూడా ఎక్కువగా స్థిరంగా ఉండే ప్రాంతాలలో ఉంటాయి. సంవత్సర వర్షపాతం 200-225 సెం.మీ. ఏడాది పొడవునా సమంగా ఉంటుంది. ఇవి మధ్య, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, దక్షిణఆఅసియా, మలయా, బోర్నియా, న్యూగినీ, ఆస్ట్రేలియా లలో ఉన్నాయి. ఈ రకం అడవులలో వృక్ష జాతుల్లో వైవిద్యంవైవిధ్యం బాగా కనిపిస్తుంది. వృక్షాలు బాగా దగ్గర దగ్గరగా, చాలా ఎత్తు పెరిగి దట్టమైన అడవులుగా ఏర్పడతాయి. ఆకురాల్చే చెట్లు ఉన్నా అన్నీ ఏకకాలంలో ఆకులను రాల్చవు గనుక ఈ ఆడవులు సతతహరితంగా ఉంటాయి. ఆకులు మందంగా, ముదురు రంగులో ఉంటాయి. ఇక్కడ అకశేరుకాలు సమృద్ధిగా ఉంటాయి. పురుగులు, నత్తలు, శతపాదులు, సహస్రపాదులు, తేళ్ళు, సాలె పురుగులు, కీటకాలు జలగలు ప్రముఖంగా చెప్పుకోదగ్గవి. సకశేరుకాలలో వృక్షవాసులు, నిశాచరులు ఎక్కువ. భారతదేశంలో ఈ అడవులలో ఏనుగులు, పెద్ద పులులు, సాంబార్ జింక, మచ్చల జింక మొదలైన క్షీరదాలు ఉన్నాయి.
 
=== రుతుబద్ధ ఉష్ణమండల అడవులు ===
రుతుబద్ధ ఉష్ణమండల అడవులు (Tropical Seasonal Forests) లో సంవత్సరపు వర్షపాతం చాలా ఎక్కువ. అయితే దీనిలో తేమతో కూడినది గాను లేదా తేమ లేనిది గాను విభజించబడి ఉంటుంది. ఇవి దక్షిణ, మధ్య అమెరికాలో తూర్పు దక్షిణ ఆసియాలో, పశ్చిమ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఉష్ణమండల ద్వీపాలలో ఉంటాయి. వీనిలో వృక్షాలు 40 మీ. ఎత్తు వరకు పెరుగుతాయి. అతి ఎత్తులో ఆకురాల్చే వృక్షాలు, కొద్దిగా కిందుగా సతత హరిత వృక్షాలు ఉంటాయి. ఈ విధంగా ఇవి రెండు అంతస్థులుగాఅంతస్తులుగా అమరి ఉంటాయి. ఇక్కడ [[టేకు]], [[వెదురు]] చెట్లు బాగా పెరుగుతాయి.
 
== అడవులలో జంతుజాలం ==
"https://te.wikipedia.org/wiki/అడవి" నుండి వెలికితీశారు