"అణుపుంజము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ using AWB)
'''అణుపుంజాలు''' లేదా '''పాలిమర్లు''' (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. [[మోనోమర్లు]] (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే [[నైలాన్]], [[రబ్బర్]], [[పాలిథిన్]] వంటి కృత్రిమమైన [[ప్లాస్టిక్స్]] గుర్తుకొస్తాయి. మన శరీరంలోని [[మాంసకృత్తులు]], [[సెల్యులోజ్]], [[సిల్క్]] మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ [[బేకలైట్]] (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు. పాలిమర్లను అధ్యయనం చేసే వైజ్ఞానిక విభాగాలను పాలిమర్ ఫిజిక్స్, పాలిమర్ కెమిస్ట్రీ, పాళిమర్ సైన్స్ అని అంటారు.
 
పాలిమర్ అణువులు పరిమాణంలో చాలా పెద్దవి. అధిక సంఖ్యలో మోనోమర్లు కలిసినపుడు మోనోమర్లు ఏర్పడుతాయి. కాని పెద్ద పరిమాణంలో ఉండే [[క్లోరోఫిల్]] లాంటి అణువును పరిశీలిస్తే అందులో మోనోమర్ యూనిట్లు ఉండవు. కనుక పెద్ద సైజులో ఉండే అణువులన్నీ పాలిమర్లు కావు. పాలిమర్లన్నీ బృహదణువులే కాని బృహదణువులన్నీ పాలిమర్లు కావు.
 
==వర్గీకరణ==
 
 
*'''క్రాస్ లింక్ డ్ పాలిమర్లు''': మోనోమర్లు త్రిమితీయంగా, పటిష్టమైనపటిష్ఠమైన జాలక నిర్మాణాన్ని ఏర్పరిస్తే వాటిని క్రాస్ లింక్ డ్ పాలిమర్లు (Cross-linked polymers) అంటారు. ఇవి పెళుసుగా, ధృఢ స్వభావంతో ఉంటాయి. ఉదా: బేకలైట్, మెలమైన్
 
 
 
* '''ఎలాస్టోమర్లు''' : పాలిమర్ అణువుల మధ్య బలాలు చాలా బలహీనంగా ఉండడం వలన వాటిపై కొద్దిపాటి ఒత్తిడి కలిగించినా గాని అవి సాగిపోతాయి. ఒత్తిడిని తొలగించగానే యధారూపానికి వస్తాయి. సహజ రబ్బర్ ఇందుకు ఒక ఉదాహరణ.
 
* '''ఫైబర్లు''' : పాలిమర్ అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలున్నట్లయితే అవి ఫైబర్ల రూపంలో ఉంటాయి. నైలాన్ 6, 6 టెర్లిన్, పాలీఎక్రైలోనైట్రేల్ వంటివి ఈ కోవకు చెందుతాయి.
* '''థర్మోప్లాస్టిక్కులు''' : ఇవి వేడి చేసినపుడు మృదువుగా అయ్యి తరువాత యధాస్థితికి వస్తాయి. ఇవి పొడవైన రేఖీయ పాలిమర్లు. సంకలన పాలిమరైజేషన్ ఫలితంగా ఏర్పడతాయి. వీటిలో పెళుసుదనం తక్కువ.
 
* '''థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కులు''' : ఇవి వేడి చేసినపుడు మృదువుగా మారవు (మెత్తబడవు). ఒకవేళ బాగా వేడిచేసినపుడు ద్రవస్థితికి వస్తాయి గాని మళ్ళీ చల్లారినపుడు యధాస్థితికి రావు. ఇవి క్రాస్ లింకింగ్‌తో ఉండే పాలిమర్లు. దృఢంగా, పెళుసుగా ఉంటాయి.
 
* [http://www.theotherpages.org/abbrev.html పాలిమర్ల గురించిన సాంకేతిక సంక్షిప్త పదాలు]
* [http://www.sigmaaldrich.com/img/assets/3900/Glossary.pdf సిగ్మా-ఆల్డ్రిచ్ పాలిమర్ సాంకేతిక పదకోశం]
 
 
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1975339" నుండి వెలికితీశారు