తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
 
==సాహిత్య సేవ==
తేవప్పెరుమాళ్ళయ్యగారికి దేవరాజసుధి యని పండితుల వ్యవహారము. ప్రధానముగా నీసుధీమణి పీఠికాకారుడుగాను, వచన రచనా విశారదుడుగాను బేరందెను. మదరాసులో నానందముద్రాలయమువారి యాదరణమున నీయన మృదువగువచనములో భారత [[భాగవత]] రామాయణములు[[రామాయణము]]లు రచించెను. మను, వసు చరిత్రాది పూర్వకావ్యములకు వ్యాఖ్యలు గావించెను [[నన్నె చోడుడు]] మున్నగు కవుల కాలనిర్ణయమును గూర్చిన వ్యాసములు "[[ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక]]" "[[భారతి]]" మొదలగువానిలో వెలువరించెను. రెండు భాషలయందును జక్కని చిక్కని [[చాటుకవిత]] కొంత సంతరించెను. [[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు]] కార్యస్థానమున బండితుడై పదార్థవిచారము చేసెను. మొత్తము నలువదితొమ్మిదేండ్లు మాత్రము జీవించెను.
 
ఈదేవరాజసుధి పూర్వులు తంజనగర రాజాస్థానమున సంగీత విద్వాంసులుగ నుండిరి. వీరితాతగారు తేవప్పెరుమాళ్ళయ్య యన బడు వారు. ఆయన మంచి పాండితి గలిగి, వాగ్ధాటియుండి భక్తియోగమును గూర్చి యుపన్యాసము లిచ్చుచుండువారట. [[శతావధానము]] చేయగలరనియు వినికి. వీరికి దంజనగర రాజ పోషణము పసివడక చెన్నపట్టణము వచ్చివైచిరి. పట్టణమున బహుకాలము భగవద్విషయక ప్రవచనములతో గాలక్షేపము చేసిరి. ఇట్టి యీతాతగారిపేరు నిలబెట్టుటకు మన తేవప్పెరుమాళ్ళయ్యగారు పుట్టి, వారికంటె నూరురెట్టులు ధట్టుడై వెలసెను. మనదేవరాజసుధి పండితుడుగాని, పండితపుత్రుడు గాడు. ఇతనితండ్రి రంగమన్నారయ్యగారు వ్యాపారసరణిలో జేయి తిరిగిన వారు. ఆయన శతసంవత్సర దీర్ఘాయువునంది మొన్న 1921 లో బుత్ర శోకమనుభవించి, రెండేడులుండి మఱి మరణించెను.