ఆత్మబలం (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (2), హైదరాబాద్ → హైదరాబాదు (3), ప్రతిష్ట → ప్రతిష్ using AWB
పంక్తి 16:
}}
 
'''ఆత్మబలం''', 1964లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. జగపతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక చిత్రాలలో ఇది ఒకటి. ఇందులో "చిటపట చినుకులు పడుతూ ఉంటే" అనే పాట చరణం తెలుగునాట చాలా మందికి పరిచయమైనది.
==కథ==
కుమార్ (జగ్గయ్య) ఒక ధనికుల కుమారుడు. అతను చిన్నప్పటినుండి తనకు కావలసినదానిని ఇతరులు పొందితే సహించలేని మనస్తత్వం కలిగినవాడు. వారి ఎస్టేటులో పని చేసే జయ అంటే అతనికి ఇష్టం. అయితే జయ ఆనంద్‌ (అక్కినేని నాగేశ్వరరావు)తో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని కుమార్ తను ఆత్మహత్య చేసుకొని ఆ నేరం ఆనంద్‌పైకి వచ్చేలా చేస్తాడు. ఫలితంగా ఆందుకు ఉరిశిక్ష పడుతుంది. ఒక మానసిక వైద్యుని (గుమ్మడి) సహాయంతో మరియు ఆత్మబలంతో జయ ఉరికంబందాకా వెళ్ళిన ఆనంద్‌ను కాపాడుకోవడం ఈ సినిమా కథ.
==సినిమా విశేషాలు==
నిర్మాతగా [[వి.బి. రాజేంద్రప్రసాద్‌]] కు ఇది రెండో విజయం. తనకు అండదండ, వెన్నూదన్నూ అనుకున్న ప్రధాన భాగస్వామి [[పర్వతనేని రంగారావు]] హఠాత్తుగా కాలం చేశారు. దాంతో మిగిలిన భాగస్వాములు కూడా ఎవరి దారిన వాళ్లు ళ్లిపోయారు.ఇప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఒంటరి. తన వాళ్లనుకున్నవాళ్లెవరూ అండగా లేరు. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి.వి.బి.రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నాడు. గుండెల నిండా త్మవిశ్వాసం నింపుకున్నాడు. మళ్లీ సినిమా మొదలుపెట్టాలి. ఉన్నపళంగా కథ కావాలి.
అప్పట్లో తెలుగు సినిమా వాళ్లందరికీ కలకత్తానే పెద్ద అడ్డా. బోలెడన్ని బెంగాలీ సినిమాలు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఉద్వేగాలు వాటిల్లో పుష్కలం. వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా కలకత్తా ప్రయాణం కట్టాడు. అప్పుడు అక్కడ ఉత్తమ్‌కుమార్ నటించిన ‘అగ్ని సంస్కార’ సినిమా ఆడుతోంది. ఈయనకు బాగా నచ్చేసింది. అప్పటికప్పుడు నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగారు.ఇప్పుడు దీన్ని అక్కినేనికి చూపించాలి. ఆయన చూడ్డానికి కొంచెం టైం పట్టింది. కానీ చూడగానే ‘ఓకే’ అనేశారాయన. ఇంకేముంది... ‘ఆత్మబలం’ సినిమా ప్రారంభం. వి.మధుసూదనరావు దర్శకుడు. [[కేవీ మహదేవన్]] సంగీతం. సి.నాగేశ్వర్రావు ఛాయాగ్రహణం. [[ఆత్రేయ]] మాటలూ పాటలూ. ప్రధాన నాయికగా[[బి.సరోజాదేవి]] ని ఎంచుకున్నారు. [[జగ్గయ్య]], [[కన్నాంబ]], [[రేలంగి]], [[రమణారెడ్డి]], [[గిరిజ]], [[సూర్యకాంతం]]... ఇలా హేమాహేమీలను మిగిలిన పాత్రలకు ఎన్నుకున్నారు.
చిత్ర తారాగణం ఎంపికైన తర్వాత పిడుగు లాంటి వార్త వినవలసి వచ్చించి. అదేమంటే 'అక్కినేని మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్హైదరాబాదు వెళ్లిపోతున్నారు. ఇక ఏ నిర్మాత అయినా అక్కడకు వెళ్లి సినిమా తీయాల్సిందే'. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా హైదరాబాద్‌కుహైదరాబాదు‌కు పయనమయ్యారు. మొదట పాటల తయారీ మొదలైంది. స్వరాల కోసం [[కె. వి. మహదేవన్]], ఆత్రేయ, మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్... నలుగురూ [[బెంగళూరు]] వెళ్లారు. బృందావన్ హోటల్‌లో బస. కె. వి. మహదేవన్ కు కథ చెబితే ‘‘ఇందులో పాటలు పెట్టడం కష్టం. సిట్యుయేషన్స్ కుదరవు’’ అనేశారు. అప్పటికాయన సుప్రసిద్ద సంగీత దర్శకుడు. ‘ఆంధ్రపత్రిక’ ఎడిటోరియల్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాడని ప్రతీతి. అలాంటాయనే ఇందులో సిట్యుయేషన్ కుదరదన్నాడంటే?.. వి.మధుసూదనరావుకి గుండెల్లో రాయి పడింది. రాత్రంతా ఆలోచించి సిట్యుయేషన్స్ ఎంచుకున్నారు. పొద్దున్నే మహదేవన్ కు చెబితే ఓకే అన్నారు. మనసుకవి ఆత్రేయ కూడా పాటలు రాయడానికి సిద్దం అయిపోయారు.
==పాటలు==
# ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు శాన్నాళ్ళు శాన్నాళ్ళు - [[ఘంటసాల]], [[కె. జమునారాణి]]
పంక్తి 39:
==మూలాలు==
* సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
* డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 
"https://te.wikipedia.org/wiki/ఆత్మబలం_(1964_సినిమా)" నుండి వెలికితీశారు