ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, తిది → తిథి (3), చెస్తారు → చేస్తారు, కూడ → using AWB
చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 17:
విభక్తి ప్రత్యయాలతో కొన్ని తెలుగు మాటలని అంతం చేసినట్లే అరబిక్ భాషలో కొన్ని మాటలు “ఆల్” శబ్దంతో ఆరంభమవుతాయి. ఇలా అరబ్బీ భాష నుండి ఎన్నో మాటలు ఇంగ్లీషులోకి వచ్చేయి. ఉదాహరణకి: అల్గరిథం, ఆల్కహాల్, ఆల్కలీ.
 
ఆరబ్బీ భాషలో “కలి” (kali) అనే మూల శబ్దానికి భస్మం అనే అర్థం ఉంది. కాని ఈ మూల శబ్దం వాడాలంటే దానికి ముందు విధిగా “ఆల్” శబ్దం చేర్చాలి. కనుక భస్మాన్ని అరబిక్ లో ఏమంటారు? ఆల్, కలి కలిసి “ఆల్‌కలి” అంటారు. అరబ్బీ భాషలో ఆల్కలీ అంటే బూడిద. ఇప్పుడు ఆల్కహాలు సంగతి చూద్దాం. నిజానికి “ఆల్ కోల్” అనే అరబ్బీ మాట నుండి వచ్చింది “ఆల్కహాలు” అన్న మాట. బెడిసికొట్టిన భాషాంతరీకరణానికి ఇది ఒక ఉదాహరణ. ఈ “ఆల్-కోల్” అనే పదార్థాన్ని తెలుగులో నీలాంజనం అనీ, కపోతాంజనం అనీ, సౌవ్వీరం అనీ పిలుస్తారు. ఈ పదార్థాన్నే ఇంగ్లీషులో ఏంటిమొనీ (Antimony) అంటారు. ఇది ఒక రసాయన మూలకం. వెండి, బంగారం, సీసం, తగరం, పాదరసం వంటిదే ఈ కపోతాంజనం. దీనికీ మనం ఇక్కడ ప్రస్తావించబోయే ఆల్కహాలుకీ ఏ విధమైన సంబంధమూ లేదు. కాని ఐరోపా లోఐరోపాలో ఎవరో పప్పులో కాలేసేరు. వారి ప్రభావం వల్ల “ఆల్-కోల్” అర్థం మారిపోయింది. ఇప్పుడు ఆల్కహాలు అంటే కల్లు, సారా వంటి మాదక ద్రవ్యాలలో ఉండే మత్తు ఎక్కించే పదార్థం అని సామాన్యార్థం.
 
ఈ పూర్వ వృత్తాంతం తెలియకపోయినా ఆల్కహాలు అంటే తెలియనివాళ్లు ఉండరంటే అది అతిశయోక్తి కానేరదు. వేదకాలం నుండీ భారతీయ సంస్కృతిలో ఈ ఆల్కహాలు ఉంది, పేరులో తేడా అంతే. అమరకోశంలో “సురా హలిప్రియా హాలా పరిస్రుద్వరుణాత్మజా గంధోత్తమా ప్రసన్నేరా కాదంబర్యః పరిశ్రుతా మదిరా కశ్య మధ్యే చాప్య వదంశ” అని కల్లుకి కనీసం పదమూడు పేర్లు ఉన్నాయి. కల్లులో రకరకాలకి సంస్కృతంలో వివిధమైన పేర్లు ఉన్నాయి. ఇప్ప పువ్వుతో చేసిన కల్లుకి ఒక పేరు, చెరుకు రసంతో చేసిన కల్లుకి – చేసే పద్ధతిని బట్టి – మూడు పేర్లు. ఈ రకాలన్నీ కలుపుకుంటే దరిదాపు నలభై పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు అన్నింటిలోకి “సుర” అన్న మాటకి అగ్రతాంబూలం ఇవ్వవచ్చు. సుర అంటే సారా అని ఒక అర్థం, దేవతలని మరొక అర్థం.
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు