"ఎ. ఆర్. రెహమాన్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు, ప్రతిష్ట → ప్రతిష్ఠ (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , నేపధ్య → నేపథ్య, మళయాళం → మలయాళం, → , , using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు, ప్రతిష్ట → ప్రతిష్ఠ (2) using AWB)
 
== సంగీత ప్రస్థానం ==
తన సంగీత జీవితాన్ని [[రాజ్ - కోటి]] లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం [[సంతోష్-శివన్]] ల దర్శకత్వంలో [[మోహన్ లాల్]] కథానాయకునిగా నటించిన [[యోధ]] సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం ] సినిమా [[రోజా]] ద్వార మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు. "[[స్లమ్‌డాగ్ మిలియనీర్]]" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైనప్రతిష్ఠాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. రెహ్మాన్ ప్రభావానికి తనుకూడా లోనుకాక తప్పలేదని తనకు రెహ్మాన్ అంటే భయమనీ, జలసీ అని ప్రఖ్యాత స్వరకర్త ఎస్ ఎల్ వైద్యనాథన్ అన్నాడు. రెహ్మాన్‌లా తను కూడా వేర్వేరు ప్లేన్స్‌లో, లేయర్స్‌లో, సకాలంలో వచ్చేకౌంటర్స్‌తో బాణీలు కట్టాలని ప్రయత్నించి చాలా సార్లు విఫలమైనానని ఒప్పుకున్నాడు. [[కర్నాటక సంగీతం|కర్నాటక సంగీతాన్ని]], [[ఖవ్వాలీ]] సంప్రద్రాయాన్ని, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, [[సూఫీ]] ఆఫ్రికన్, అరేబియన్, పాశ్చాత్య సంగీతాన్ని శ్రావ్యంగా మిళితం చేయగలిగాడు రెహ్మాన్. అలా చేస్తూ కూడా పూర్తి స్థాయి ఒరిజినల్ బాణీలను తయారుచేశాడు.
 
== గౌరవాలు బిరుదులు ==
టైమ్ మ్యాగజైన్ రెహ్మాన్‌ కు "మొజార్త్ ఆఫ్ మద్రాస్" బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. "[[స్లమ్‌డాగ్ మిలియనీర్]]" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైనప్రతిష్ఠాత్మకమైన "[[గోల్డెన్ గ్లోబ్ అవార్డు]]", రెండు [[ఆస్కార్ అవార్డు]]లను అందుకొన్న తొలి భారతీయుడు. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు. భార్య సైరా బాను, ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమ్‌, అమన్‌ .
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు ==
తన స్వంత సంగీత పాఠశాల ‘‘కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ’’ని రంజాన్ పర్వదినం నాడు 9 ఆగస్టు, 2013న ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేత లాంఛనంగా ప్రారంభింపజేశాడు. ఈ సంగీత కళాశాల ప్రారంభోత్సవానికి అంబానీతోపాటు ఆయన సతీమణి నీతూ అంబానీ కూడా పాల్గొన్నారు. రెహామాన్ స్థాపించిన ఈ మ్యూజిక్ కాలేజ్ క్యాంపస్ వైశాల్యం దాదాపు 27వేల సెక్టార్లు ఉంటుంది. ఈ క్యాంపస్‌లో వాద్యబృంద సంగీత కళాశాలను పేదపిల్లల కోసం సంగీతంలో శిక్షణ ఇస్తూ వారిందరికీ వసతి కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ సంగీత కళాశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రికార్డింగ్ స్టూడియోలను విడివిడిగా నిర్మించి వాటిలో మ్యూజిక్ డ్రమ్స్, పియానో, తీగ వాయిద్యాలు వంటి పరికరాలను ఏర్పాటుచేసినట్టు తెలిపాడు.
ఈ సంస్థ ఏర్పాటు చేసి సంగీత ప్రియులకు అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని రెహ్మాన్ చెప్పాడు. కేవలం తాము స్థాపించిన ఈ సంగీత కళాశాలను సినిమా వినోదం కోసం కాదని సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేందుకు వీలుగా ఎంతోగానూ తోడ్పతుందని రెహ్మాన్ చెప్పాడు. కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ముఖేష్, నీతూ అంబానీదంపతులు విచ్చేసిన సందర్భంగా అక్కడి విద్యార్ధులువిద్యార్థులు ప్రత్యేక మ్యూజిక్ ప్రదర్శనతో అంబానీ దంపతులకూ ఘన స్వాగతం పలికారు. సంగీత శిక్షణలో ఫూల్‌టైమ్, ఫార్ట్‌టైమ్ కోర్సులు చేయాలనుకునేవారికి లండన్‌లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడెల్‌సెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు.
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976948" నుండి వెలికితీశారు