యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
'''యాతగిరి శ్రీరామ నరసింహారావు''' చారిత్రక పరిశోధకులు. ఆయన [[రాజమండ్రి]]ని రాజమహేంద్రిగా సంభావించేవిధంగా నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంక్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది. అందుకే "రాజమహేంద్రి తనను తాను అద్దంలో చూసుకుంటే కనిపించేది శ్రీ వై.ఎస్.నరసింహారావే. నిజమైన కార్యదక్షుడు శ్రీ వై.ఎస్.ఎన్" అని ఆంధ్రకేసరి యువజనసమితి మాజీ అధ్యక్షులు, నరసాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు అన్నారు.
==జననం - వంశం==
ఆయన తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]లో అమ్మమ్మ అప్పలి సుభద్రమ్మకు చెందిన మామిడితోటలో కట్టుకున్న కొత్త ఇంట్లో 18 అక్టోబర్ 1936న జన్మించిన శ్రీరామ నరసింహారావు రాజమహేంద్రి స్వస్థ్లలం అయింది.మధ్వ సంప్రదాయానికి చెందిన ఈయన తండ్రి వెంకట నరసింహారావు.తల్లి రామాబాయమ్మ. శ్రీరామ నరసింహారావు తాత గారు శ్రీ యాతగిరి పూర్ణయ్య పంతులు.ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] - శ్రీ పూర్ణయ్య పంతులు వీరిద్దరూ నాటక రంగ సహచరులు. శ్రీ వై.ఎస్.నరసింహారావుకి కుమార్తెలు రమాదేవి-రమణి.అల్లుళ్ళు ధర్మపురి శేషగిరిరావు-దామోజీపురపు కృష్ణమోహన్.కొడుకు యాతగిరి రవితేజ-కోడలు ఉష
 
==ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపన==
సహకారశాఖలో ఉద్యోగంచేసిన శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 1962లో ఆంధ్రకేసరి యువజన సమితి ప్రారంభించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారంటే అమితంగా ఇష్టపడే శ్రీ నరసింహారావు ఆయన పేరుతోనే సమితిని నెలకొల్పారు.ఎన్నో సేవాకార్యక్రమాలకు సమితి వేదిక అయింది. కుష్టువ్యాధి నివారణ పధకాన్ని 10 ఏళ్ళపాటు నిర్వహించిన సమితి సాంస్కృతిక వికాసానికి,విద్యాబివృద్దికి,సాంస్కృతిక పరిరక్షణకు కృషిచేస్తూ వచ్చింది. ఇందుకోసం ఎన్నో ఉద్యమాలను కూడా నడిపింది. వీటన్నింటికీ శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చారు. 35గ్రామాల్లో ఈపధకాన్ని సమర్ధవంతంగా అమలు చేసినందుకు సమితి సంస్థాపకునిగా న్యూడిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నుంచి 1968లో సత్కారం అందుకున్నారు.రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం ప్రభుత్వపరం కావడంలోనూ,సిటీ మున్సిపల్ హైస్కూల్ విషయంలోనూ,గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం తదితర అంశాలలో సమితిని పోరాటదిశగా నడిపించారు.