యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
అది యాదృచ్చికమో ఏమో గానీ ఇంచుమించు చాలామంది రాష్ట్రపతులు, ప్రధానులతొ అనుబంధం శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావుకి వుండడం విశేషం. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంధ్రప్రసాద్ 1955లో విజయవాడ మున్సిపల్ హైస్కూల్ లో హిందీ ప్రేమీమండలి ఉత్సవాల్లో మాట్లాడుతుంటే శ్రీ వైఎస్ఎన్ చూసారు. ఇక 1962 సెప్టెంబర్-అక్టోబర్ లలో రెండునెలల పాటు జరిగిన సహకార శిక్షణ పొందిన శ్రీ వైఎస్ ఎన్ నాయకత్వంలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని కలుసుకున్నారు. అలాగే 1962లో ఆనాటి ఉప రాష్ట్రపతి శ్రీ జాకీర్ హుస్సేన్ ని ఆయన అధికార నివాసంలో, 1970లో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ని రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. అఖిల భారత కుష్టు నివారణ సంఘ్ కార్యవర్గ సమావేశం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అధ్యక్షతన 6ఆగస్టు1983లో జరగ్గా సమితి పక్షాన శ్రీ వైఎస్ఎన్ హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, 1957 ఏప్రియల్ లో రాజమండ్రి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చినపుడు భారత్ సేవక్ సమాజ్ పట్టణ కార్యదర్శిగా వున్న శ్రీ వైఎస్ఎన్ కలుసుకుని వినతిపత్రం అందించారు. అలాగే భారత తొలిప్రధాని నెహ్రు రాజమండ్రి ఎన్నికల ప్రచారానికి 1951డిశెంబర్లో వచ్చినపుడు చూసారు.ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంంధితో డిల్లీలో సన్మానం అందుకున్నారు. ఇక మాజీ ప్రధాని పి.వి.అయితే సమితి శాశ్వత సభ్యులు కావడంతో అనుబంధం చివరివరకూ కొనసాగింది.
==స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కు==
ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని రాజమండ్రి పాల్ చౌక్ (ఇన్నీసుపేట)లో నెలకొల్పి,విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వై.ఎస్.ఎన్.చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమరయోధుల గురించి లిఖించారు.శ్రీ వై.ఎస్.నరసింహారావు 25 సంవత్సరాలపాటు శ్రీ కందుకూరి వీరేశలింగం టౌన్ హాలు ట్రస్ట్ బోర్దు కార్యదర్శిగా సేవలందించారు.టౌన్ హాలు జూబ్లి పబ్లిక్ లైబ్రెరీ అభివృద్ధికి కృషి చేసారు. టౌన్ హాలులో పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు.
 
==ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్==