కన్యాశుల్కం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → using AWB
చి →‎ఇస్లాంలో కన్యాశుల్కం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తితుల → స్థితుల using AWB
పంక్తి 9:
 
==ఇస్లాంలో కన్యాశుల్కం==
దీనిని ముస్లిములు [[మహర్]] అంటారు. ఇది అందరూ పాటించదగిన మంచి సంప్రదాయం. కట్నం లేదా వరకట్నం కన్యాశుల్కానికి వ్యతిరేకమైనవి. ముస్లిముల్లో వరుడు వధువుకు కట్నం ధారాళంగా ఇవ్వాలి, ఇచ్చితీరాలి (కురాన్ 2;136,4:19,24) వధువుకు కట్నం ఇవ్వకుండా పెళ్ళి చేయటానికి ఇస్లామ్ లో అనుమతే లేదు (తిర్మిజి :881). వధువుకు ఇచ్చిన కట్నాన్ని ఎట్టి పరిస్తితుల్లోపరిస్థితుల్లో తిరిగి తీసుకోకూడదు.
=== సౌదీలో కన్యాశుల్కం ===
భారత్‌లాంటి దేశాల్లో [[వరకట్నం]] పేద కుటుంబాల అమ్మాయిలకు భారంగా మారితే... సౌదీ అరేబియాలో పరిస్థితి తారుమారైంది. ఇక్కడ [[పెళ్లి]] కోసం అమ్మాయిలు పెట్టే కఠిన షరతులు నెరవేర్చలేక, కోరినంత కన్యాశుల్కం ఇవ్వలేక అబ్బాయిల కుటుంబాలే సతమతమైపోతున్నాయి. ఒక్కోసారి అమ్మాయిల షరతులు అసాధ్యంగా ఉంటున్నాయట. ఈ విషయాన్ని తాజాగా అల్-వతన్ దినపత్రిక వెల్లడించింది. పత్రిక కథనం ప్రకారం... అమ్మాయిలు భారీ మొత్తాలను కన్యాశుల్కంగా కోరుతున్నారు.[[విడాకులు]] తీసుకోవడం ఎక్కువైపోతుండడంతో తమ జీవనభద్రత కోసం సౌదీ [[అమ్మాయిలు]] ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. [[వివాహ ఒప్పందం]]లో వారి కఠిన షరతుల కారణంగా తర్వాత ఆ బంధాన్ని తెంచుకోవాలనుకునే భర్తలు కాస్త ముందూవెనుకా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంప్రదాయం ప్రకారం ముస్లిం వివాహం ఒక ఒప్పందంలా జరుగుతుంది. ఒప్పంద పత్రంలో తనకిష్టమైన షరతులను విధించే హక్కు [[వధువు]]కు ఉంటుంది. ఈ హక్కును ఎవరూ కాదనడానికి లేదని జెడ్డాలోని అల్-సాదా గ్రాండ్ మసీదు ఇమామ్, వివాహ అధికారి అల్-అమ్రీ తెలిపారు. అయితే అసాధారణమైన షరతుల వల్ల దంపతుల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనీ, అవే విడాకులకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. కొందరు వివాహ బంధానికి హామీగా లక్ష రియాళ్లు (రూ.11 లక్షలు) చెల్లించాలన్న షరతు పెడుతున్నారని చెప్పారు. ఈ షరతు ప్రకారం భర్త విడిపోవాలనుకున్నప్పుడు ఆ సొమ్మును ఆమెకు చెల్లించాల్సి ఉంటుంది. మరికొందరు తమ బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తం వేయాలనీ, తమ పేరుతో భవనం కొనాలనీ, డ్రైవర్ సహా కారు ఇవ్వాలని షరతులు పెడుతున్నట్లు అమ్రీ వివరించారు.<ref>ఈనాడు 20.7.2008</ref>
"https://te.wikipedia.org/wiki/కన్యాశుల్కం" నుండి వెలికితీశారు