ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
పంక్తి 78:
'''ఉదాహరణ 3'''. అమెరికాలో బాగా వాడుకలో ఉన్న “ఫ్లీ మార్కెట్” (flea market) అనే పదబంధాన్నే తీసుకుందాం. ఇది ఫ్రెంచి భాషలోని “మార్సే ఓ పూసే” (ఈగల బజారు) అన్న పదబంధానికి ఇంగ్లీషు అనువాదం. బహిరంగ మైదానంలో బడ్డీలు వేసి, వాటి మీద రకరకాల వస్తువులు (పాతవి, కొత్తవి) అమ్మే ప్రదేశం ఇది. బహిరంగంగా ఉన్న మైదానం కనుక ఈగలు మూగుతాయి. అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఇలాంటి బడ్డీలు మన దేశంలో పర్యాటక స్థలాలలోనూ, తిరణాలలోనూ చూస్తూ ఉంటాం. మన “సంత” వీరి “ఫార్మర్స్ మార్కెట్” (farmer's market) తో తులతూగే అర్థాన్ని ఇస్తుంది.
 
ఫ్రెంచి మాటని యథాతథంగా వాడకుండా ఇంగ్లీషువాడు ఇంగ్లీషు వాసనతో ఎలా మార్చేడో అదే విధంగా ఇంగ్లీషు మాటని తెలుగు వాసనతో తెలుగులోకి ఎలా మార్చవచ్చో ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంగ్లీషులో “స్కై స్క్రేపర్” (skyscrapper) అనే మాట ఉంది. దీనిని “ఎత్తైన భవనం” అంటే న్యాయం చేకూరదు. అందుకని దీనిని “అంబర చుంబితం” అని అనువదిస్తే మాటకి న్యాయం చేకూరుతుంది.{{dubious}}
 
అనువాదం కాని, అనుసరణ కాని రాణించాలంటే భాష మీద పట్టు అవసరం. కాని అదొక్కటీ సరిపోదు. మంచి అనువాదానికి కావలసిన సామగ్రులు: (1) [[వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)|ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]], సంబంధి పదకోశము. మాటలకి సాధికారమైన వర్ణక్రమాలు, నిర్వచనాలు, భాషాభాగాలు, వాడకానికి ఉదాహరణలతో కూడిన సూచనలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి ప్రక్రియలు, మొదలైనవన్నీ ఈ నిఘంటువులో ఉండాలి. ప్రతి ఇంగ్లీషు మాటకి వివరణాత్మకమైన అర్థం ఇస్తే సరిపోదు; ఆ ఇంగ్లీషు మాటకి సమానార్థకం అయిన ఒక తెలుగు మాట కాని తెలుగు పదబంధం కాని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. (2) తెలుగు [[లక్షణ గ్రంథం]] (style manual) కావాలి. ఈ గ్రంథంలో ఏయే భాషా ప్రయోగాలు అభిలషణీయమో సోదాహరణంగా చూపించాలి. (3) కొత్త వారికి ఒక ఒరవడిలా ఉపయోగపడే విధంగా సైన్సుని తెలుగులో బాగా రాసిన వారి రాతలు ప్రచారంలోకి తీసుకు రావాలి. తెలుగులో సైన్సుని వ్యక్తపరుస్తూ రాయలేమనే భ్రమని తొలగించాలి.