నా పేరు '''ఇనగంటి రవిచంద్ర.''' మా స్వగ్రామం [[శ్రీకాళహస్తి]] పక్కన [[చేమూరు]] అనే చిన్న పల్లెటూరు. నా బాల్యంలో చాలా భాగం మా అమ్మమ్మ గారి ఊరైన [[ముచ్చివోలు]] లో గడిచింది. నా పై చదువుల కోసం ఆ గ్రామాన్ని వదలడం నన్ను ఇప్పటికీ భాధిస్తుంటుంది. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఆంగ్ల భాష తో కుస్తీ పడే నాకు నా మాతృ భాష ఋణం తీర్చుకోవడానికి నాకు ఇంతకంటే మంచి మార్గం తోచలేదు. స్వతహాగా సాంప్రదాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక గ్రామాలన్నా, అక్కడి ప్రజలు, వారు కనబరిచే ఆత్మీయత, అక్కడి ప్రశాంత జీవనం, పచ్చటి పొలాలు, చెట్లు, సెలయేళ్ళు, ఈత బావులు మొదలైనవంటే ఎంతో ఇష్టం.
<li><p>చిన్న వ్యాసాలను విస్తరించి తెలుగు వికీ నాణ్యతను పెంచడం.
<li><p>సాధ్యమైనంతవరకు ఎక్కువమంది చదువరులకు ఆసక్తిగల కొత్త వ్యాసాలను ప్రారంభించడం
<li><p>కొత్త సభ్యులకు సహాయం చెయ్యడం.
</ol>
==నేను రాయాలనుకుంటున్న వ్యాసాలు==
* [[కణ భౌతికశాస్త్రం]] - [[:en:Particle physics]]
===వికీపీడియా గురించి===
<ol>
<li><p>ప్రతి ఒక్కరికీ చేరువలో స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం అనే నినాదంతో ప్రారంభమైన వికీపీడియా ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడుతున్న తొలి పది వెబ్‌సైట్లలో ఒకటి. దీన్ని అభివృద్ధి చేయడం లో ఎవరైనా పాల్గొనవచ్చు.
<li><p>వ్యాసాలను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, తటస్థ దృక్కోణంలో రాయాలి.
<li><p>ప్రస్తుతం వికీపీడీయాలో కొద్ది మంది సభ్యులు మాత్రమే క్రియాశీలకంగా పని చేస్తున్నారు. మీకు తెలిసిన వారికి వికీపీడియా గురించి పరిచయం చేసి తెవికీ విస్తృతినీ, వాసినీ పెంచండి.