నూతలపాటి సాంబయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''నూతలపాటి సాంబయ్య''' నాటకరంగ నిపుణుడు. నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, విశ్లేషకుడిగా, పరిషత్తు నిర్వాహకుడిగా ఇతడు రాణించాడు. <ref>[http://www.visalaandhra.com/hyderabad/article-24555 అక్కినేని కళాపరిషత్‌ నాటక పోటీల ముగింపు వేడుకలు Sun, 19 Sep 2010]</ref>
==జీవిత విశేషాలు==
ఇతడు [[గుంటూరు జిల్లా]] [[నడికుడి (దాచేపల్లి మండలం)|నడికుడి]] గ్రామంలో [[1939]], [[జూన్ 19]]వ తేదీన నూతలపాటి కోటమ్మ, కోటయ్య దంపతులకు జన్మించాడు<ref>నాటకారాధ్యుడు, కళాసారథి నూతలపాటి సాంబయ్య - నటకులం మాసపత్రిక - సెప్టెంబరు 2016 - పేజీలు 1-3</ref>. ఇతని ప్రాథమిక విద్య నడికుడిలో, మాధ్యమిక విద్య [[దాచేపల్లి]]లో గడిచింది.తరువాత [[గుంటూరు]]లోని [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఎ.సి.కాలేజీ]]లో ఇంటర్మీడియట్, మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. 1962లో ఇతనికి సరస్వతితో వివాహం జరిగింది. 1965లో కల్వకుర్తిలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరి 1970లో సత్తెనపల్లి హైస్కూలుకు బదిలీ అయ్యాడు.
 
==నాటకరంగం==
ఇతడు విద్యార్థి దశలోనే 1954లో చెంచునాయుడు, అలెగ్జాండర్ మొదలైన ఏకపాత్రలను ధరించడం ద్వారా నటనను ప్రారంభించాడు. ఆ సమయంలోనే కొన్ని నాటికలకు దర్శకత్వం వహించాడు.1965లో [[పినిశెట్టి శ్రీరామమూర్తి]] వ్రాసిన "పల్లెపడుచు" నాటకాన్ని జనరంజకంగా ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. పత్రి జగన్నాథరావు దర్శకత్వంలో "మాస్టర్‌జీ" నాటకాన్ని తయారు చేసి టికెట్టు నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ నాటకాన్ని అనేక నాటక పోటీలలో ప్రదర్శించి అనేక బహుమతులు పొందాడు. [[భీశెట్టి లక్ష్మణరావు]] రచించిన "సమాజం మారాలి", గోళ్ళపాటి నాగేశ్వరరావు వ్రాసిన "సరస్వతీ నమస్తుభ్యమ్‌", [[భమిడిపాటి కామేశ్వరరావు]] వ్రాసిన "మనస్తత్వాలు" అనే నాటకాలు/నాటికలు ఇతనికి మంచిపేరును తెచ్చిపెట్టాయి.
"https://te.wikipedia.org/wiki/నూతలపాటి_సాంబయ్య" నుండి వెలికితీశారు