కిరాయి రౌడీలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
}}
==చిత్రకథ==
శివుడు ([[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]]), బాబూరావు([[రావు గోపాలరావు]]), చలపతి([[కొంగర జగ్గారావు) (నటుడు)|జగ్గారావు]]ప్రాణస్నేహితులు<ref>{{cite news|last1=వెంకట్రావ్|title=చిత్రసమీక్ష - కిరాయి రౌడీలు|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56923|accessdate=5 October 2016|work=ఆంధ్రపత్రిక|date=1 January 1982|page=13|language=తెలుగు}}</ref>. బ్యాంకులో కొల్లగొట్టబడిన నగల పెట్టె వీరికి దొరుకుతుంది. బాబూరావు చలపతిని చంపివేసి, శివుడిని చావబాది చలపతిని శివుడే చంపాడని పుకార్లు పుట్టించి నగలను కొట్టివేస్తాడు. కాలక్రమేణా బాబూరావు పెద్ద సారావ్యాపారిగా మారి లక్షలు గడిస్తాడు. చలపతి కొడుకు కోటి ([[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]), శివుడి కొడుకు రాజా ([[చిరంజీవి]]) పొట్టకూటి కోసం కిరాయి రౌడీలుగా మారతారు. రాజా, బాబూరావు కుమార్తె జ్యోతి ([[రాధిక శరత్‌కుమార్|రాధిక]]) ఇద్దరూ ప్రేమించుకుంటారు. బాబూరావు అమ్మిన కల్తీ సారా తాగి ఎందరో అమాయకులు మరణిస్తారు. ఇది సహించలేక కోటి బాబూరావు గిడ్డంగులను దగ్ధం చేస్తాడు. అందుకు ప్రతీకారంగా బాబూరావు కోటి గుడ్డి చెల్లెల్ని బలవంతంగా రప్పించి అనుభవిస్తాడు. ఆ గుడ్డి చెల్లెలు మరణించడంతో కోటి బాబూరావుపై పగబడతాడు. ఆ పగను ఎలా సాధిస్తాడు అనేది మిగిలిన సినిమా కథ.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కిరాయి_రౌడీలు" నుండి వెలికితీశారు