కోదండ రామాలయం, తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రామాలయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , లొ → లో, లో → లో , సాంప్రదాయా → సంప్రదాయా, using AWB
పంక్తి 44:
 
==ఆలయ చరిత్ర==
[[భవిష్యోత్తర పురాణం]] లో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి [[పుష్కరిణి]]లో స్నానమాచరించినట్లు చెప్పబడినదిచెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామాగమన గుర్తుగా ఈ ఆలయాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్టించాడనిప్రతిష్ఠించాడని తరువాత కాలంలో [[జనమేజయ చక్రవర్తి]] పునరుద్ధరించిరని స్థానికుల అభిప్రాయము. ఈ ఆలయమునందలిఆలయము లోని ముర్తులు 'రామచంద్ర పుష్కరిణి'లో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు.
 
[[దస్త్రం:Kodamdaraama swaami vari ratham tirupati.JPG|thumb|left|కోదండ రామ స్వామి వారి రథం:]]
 
గోవిందరాజస్వామి ఆలయంలోని కూరత్తాళ్వాన్ మండపం ఉత్తరగోడ లోపలి భాగంలొభాగంలో లభ్యమైన [[శాసనం]] ప్రకారం ఈ ఆలయాన్ని శాలివాహన శకం 1402 (క్రీ.శ.[[1480]]) లో శఠగోపదాసర్ నరసింహ మొదలియార్, "నరసింహ ఉడయ్యార్" కాలంనాటి సంస్కృతి, సాంప్రదాయాలసంప్రదాయాల చిహ్నంగా, రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించెనని తెలుస్తున్నది. శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ప్రకారం ఈ నరసింహ ఉడయ్యార్ గారే [[సాళువ నరసింహ రాయలు]].
1830లో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుకున్న ఏనుగుల వీరాస్వామయ్య అప్పటిలో ఆలయ స్థితిగతుల గురించి వ్రాశారు. 1830ల నాటికి రామస్వామి ఆలయానికి సర్కారు వారి కుమ్మక్కు (అధికారం) లేదని తెలిపారు. ఆలయం మొత్తంగా ఆచార్య పురుషుల చేతిలోనే ఉండేది <ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==ఆలయ విశేషాలు==
ఈ ఆలయము ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలివుంటుంది. ఆలయపు [[శిల్పకళ]] [[విజయనగర కాలం]] నాటిదిగా గుర్తించవచ్చును. ప్రతి స్తంభంపై అనేక భాగవత, రామాయణ ఘట్టాలు, దేవతా మూర్తులు దర్శనమిస్తాయి.
 
శ్రీ కోదండస్వామి వారు, దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మి, వామ భాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చాముర్తులుగా వెలసివున్నారువెలసి ఉన్నారు. ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండడం [[వైఖానస]] ఆగమశాస్త్ర నియమం. ఇలా కుడి ప్రక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం.
[[దస్త్రం:Kodanda rama entrance.JPG|thumb|left|కోదండ రామ స్వామి వారి ఆలయ రాజ గోపురము]]
[[గర్భగుడి]] ద్వారములు సువర్ణమయమై ముందుగా జయవిజయులు ద్వారపాలకులై సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో పంచబేరముర్తులు ఉన్నారు.
ఈఆలయ ప్రధాన గోపురమునకు ఎదురుగా కొంత దూరములో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి వున్నదిఉంది. దాని కెదురుగా ఆంజనేయ స్వామివారి స్థంబమున్నదిస్తంభమున్నది.
 
==మూలాలు==
*శ్రీ కోదండ రామాలయం, తిరుపతి; తలుపూరు రామరమేశ్ కుమార్, మన దేవాలయాలు, [[సప్తగిరి]] మాసపత్రిక, ఏప్రిల్ 2006 సంచికలో ప్రచురంచబడిన వ్యాసం.
 
{{తిరుమల తిరుపతి}}
 
[[వర్గం:తిరుపతి]]