గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది. (6), బందిం → బంధిం, చినారు → చారు, వున్నా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ (2), శిధిల → శిథిల (2), చినది. → చింది. using AWB
పంక్తి 1:
{{అయోమయం}}
[[బొమ్మ:Golkonda fort.jpg|framed|right|గోల్కొండ కోట, [[హైదరాబాదు]]లోని సందర్శనీయ స్థలాలలో ముఖ్యమయినది. కోటలోని నగీనా భాగ్ నుండి బాలాహిసార్ వైపు చూస్తున్న దృశ్యము]]
'''గోల్కొండ''' ([[ఆంగ్లం]]: Golkonda fort) ఒక శిధిలమయినశిథిలమయిన [[కోట]] మరియు నగరము. [[తెలంగాణ రాష్ట్రం]] రాజధాని [[హైదరాబాదు]] నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్ధం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. [[1083]] నుండి [[1323]] వరకు [[కాకతీయులు]] గోల్కొండను పాలిస్తూ ఉండేవారు. [[1326]]లో [[ముసునూరి నాయకులు]] మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. [[1371]]లో [[ముసునూరి కాపానీడు]] గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది [[బహుమనీ సామ్రాజ్యము]]లో రాజధానిగా (1365-1512) ఉన్నది, కానీ [[1512]] తరువాత [[ముస్లిము]] సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడింది.
 
==చరిత్ర==
[[బొమ్మ:Golkonda.jpg|thumb|right|300px|గోల్కొండ కోట దృశ్యము.]]
"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే [[1143]]లో మంగళవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించినదికనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయ బడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. [[కాకతీయు]]లకు, వారి వారసులు [[ముసునూరి నాయకుల]]కు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప [[ముసునూరి నాయకులు]] విప్లవముతో [[ఓరుగల్లు]]తో బాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1347లో [[గుల్బర్గ్గా]] రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి వారికి పెక్కు సంఘర్షణలు జరిగాయి<ref>Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair</ref>. మహమ్మద్ షా కాలములో [[ముసునూరి కాపానీడు]] [[కౌలాస్]] కోటను తిరిగి సాధించుటకు తన కొడుకు వినాయక దేవుని పంపాడు. కాని వినాయక దేవ ఈ ప్రయత్నములో విఫలుడయ్యాడు. 1371లో పారశీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా వెలమపట్టణముపై దాడి చేసి వినాయక దేవుని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించాడు<ref>మహమ్మద్ కాసిం ఫెరిష్తా, Translation by John Briggs, History of the Rise of Mahomedan Power in India, Vol. 2, 1829, pp. 310-319, Longman and others, London</ref>. గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టుబెట్టారు. సుల్తాను కూడా తీవ్రముగా గాయపడ్డాడు. ప్రతీకారముతో రగిలిన సుల్తాను పెద్ద సైన్యమును కూడగట్టి కాపానీడిపై యుద్ధమునకు తలపడ్డాడు. ఓరుగంటికి విజయనగర సహాయము అందలేదు. కాపానీడు ఢిల్లీ సుల్తాను సహాయము కోరాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తాను నిరాకరించాడు. బలహీనపడిన కాపానీడు షాతో సంధిచేసుకున్నాడు. 300ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలాడు. ఈ విధముగా 1371లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది. తరువాత నవాబులు పాలించారు.
 
[[1507]] నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశస్తులు]] నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన [[1687]]లో [[ఔరంగజేబు]] విజయముతో అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన [[కోహినూరు వజ్రము]], పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని [[పరిటాల]]-[[కొల్లూరు]] గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును [[1724]] నుండి [[1948]]లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. నిజాం నవాబుల పరిపాలన కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి వ్రాసుకున్నారు. వాటి ప్రకారం 1830 నాటికి గోల్కొండలో నిజాం అంత:పుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. కోటలో విస్తరించి ప్రజలు ఇళ్ళు కట్టుకుని జీవించేవారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> ఐతే రాజధాని తరలిపోయివుండడంతో అక్కడ రాజ్యతంత్రానికి సంబంధించిన, వర్తకవాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి కాదు.
పంక్తి 11:
==కోటలు==
[[బొమ్మ:Golkonda (4).jpg|thumb|right|300px|గోల్కొండ కోట దృశ్యము.]]
గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్టపరుచటలోపటిష్ఠపరుచటలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.
==బారాదరి==
ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి ''గోషామహల్‌ బారాదరి హైదరాబాదు'' భూమార్గము కూడా వుంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము వుంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ నగరమున ముఖ్య కట్టడమైన చార్‌మినార్‌, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్‌, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) పడమరగా ఉన్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుసేన్‌ సాగర్‌ చెరువు, సికింద్రాబాదు నగరము, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర-పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణము, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.
పంక్తి 59:
 
==రాచమందిరాలు==
[[File:Golconda... ruins inside janana.JPG|thumb|right|గోల్కొండ కోటలోని రాచమందిర శిధిలాలుశిథిలాలు]]
ఏటవాలుగా, ఇరుకుగా ఉన్న మెట్లు కింద ఉన్న జనానాకు మరియు రాణీగారి మహలుకు దారితీయును. అక్కడి రాచమందిరాలు, పెద్ద పెద్ద మిట్టలమీద కట్టారు, వాటికి ఎత్తయిన పైకప్పులు ఉన్నాయి, గోడలన్నీ అలంకార వస్తువులతో నింపి పొదరిల్లులు మరియు చూరులు పర్శియను తరహా రూపకల్పనతో ఎంతో అందముగా తీర్చిదిద్దారు. ఆర్చీల మూలలలో సన్నటి పలకలపై నాజూకు ఆకృతులు మరింత శోభను తెచ్చిపెడుతుంది. రాణీ మహలులో ఉండే ఈ విశేష భోహములను చూసి నాటి మొగలులే అసూయచెందేవారు.
 
పంక్తి 81:
గోల్కొండ కోట దక్కన్‌లోనే అతి పెద్ద దుర్గం. ఇంతటి విస్తీర్ణం, వైవిధ్యం, వాస్తు వైభవం వున్న మరో కోట దక్షిణ భారతదేశంలో లేదు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నిర్మించిన మహాదుర్గం గోల్కొండ. ఇలాంటి కట్టడాన్ని పున:నిర్మించడం, పున:సృజించడం దుర్లభం.
 
గొర్రెల కాపరుల గొర్రెలు మేపుకునే ప్రాంతంలో వున్న కొండ కాబట్టి దీనిని మొదట్లో గొల్లకొండ అన్నారన్నది ఒక కథనం. ఇదే కాలక్రమాన గోల్కొండగా ప్రసిద్ధి చెందింది. కాకతీయలు కాలంలో నిర్మించగా 1363 సంవత్సరంలో బహుమనీ సుల్తానుల అధీనంలోకి వచ్చింది. వారి పతనం తర్వాత 1518లో కుతుబ్‌షాల పరమైంది ఈ ప్రాంతం. కుతుబ్‌షాల రాజధానిగా మారిన తర్వాత గోల్కొండ కోటను ఇంకా బాగా పటిష్టపరిచారుపటిష్ఠపరిచారు.
 
వజ్రాల గనిగా పేరొందిన కోట గోల్కొండ. కుతుబ్‌షాల పాలనలో వుండగా ఔరంగజేబు కోట మీద భీకరమైన దాడి చేశాడు. శత్రు దుర్భేద్యమైన గోల్కొండ కోట దాదాపు ఎనిమిది నెలల యుద్ధం తర్వాత మొగలాయిల అధీనంలోకి వచ్చింది. ఔరంగజేబు యుద్ధానంతరం తిరిగి వెళుతూ మొగలుల దక్కన్‌ ప్రతినిధిగా ఆసఫ్‌జాను నియమించాడు. ఆయన నిజాం ఉల్‌ ముల్క్‌ అనే బిరుదును ధరించి స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో గోల్కొండ కోట నిజాం పాలకుల పరమైంది.
"https://te.wikipedia.org/wiki/గోల్కొండ" నుండి వెలికితీశారు