చెలికాని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , నారయణ → నారాయణ, ఆర్ధిక → ఆర్థిక, అభ్యర using AWB
చి →‎స్వాతంత్ర్య పోరాటంలో..: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఎంతొ → ఎంతో using AWB
పంక్తి 54:
1930 లో [[హైదరాబాదు]] మెడికల్ కాలేజీలో చదువుతూ 15 రోజులలో పరీక్షలున్నా లక్ష్యపెట్టకుండా- కళాశాల వదలిపెట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో [[బులుసు సాంబమూర్తి]], [[దుర్గాబాయ్ దేశ్‌ముఖ్]], [[మొసలికంటి తిరుమలరావు]] లతో కలిసి పనిచేశారు. 1930-31 శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని కాకినాడలో హిందూ స్థానీ సేవాదళ్ శిక్షణాశిబిరానికి కెప్టెన్ గా ఉండి చట్టధిక్కరణ నేరానికి తిరిగి ఒకటిన్నర సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. అప్పుడు [[బెంగాలీ]] డిటెన్యూలతో పరిచయం ఏర్పడింది. వారిదగ్గర [[కమ్యూనిస్టు]] మూలసూత్రాల గురించి వివరంగా తెలుసుకుని ఆ సిద్ధాంతాల వలన ఎంతో ప్రభావితులయ్యారు.
 
డా.రామారావు తూర్పు గోదావరి జిల్లాలో హరిజన ఉద్యమంలో కూడా ఎంతొఎంతో చురుకుగా పనిచేశారు. 1935 నుంచి జిల్లా హరిజన సేవా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. జిల్లాలో మొట్టమొదటి హరిజన హాస్టల్ ను నిర్వహించారు. అప్పటిలో ఆయన మద్దూరి అన్నపూర్ణయ్య వంటి [[కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ]]కి చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగి వుండేవారు.
 
1939 లో [[సుభాస్ చంద్రబోస్]] [[కాకినాడ]] వచ్చినప్పుడు గాంధీ అనుయాయులంతా ఆయన రాకను వ్యతిరేకించారు. అప్పుడు బోస్ సభకు రామారావు గారు హాజరై ఆసభ విజయవంతంగా జరిగేందుకు తోడ్పడ్డారు. తరువాత డాక్టర్ చెలికాని కమ్యూనిస్టుగా మారి రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. 1940 లో రామచంద్రపురంలో వైద్య వృత్తిలో స్థిరపడి ప్రజాసేవ చేస్తూ దీనజన బాంధవుడిగా పేరుపొందారు. కామ్రేడ్ [[పుచ్చలపల్లి సుందరయ్య]] వంటి ప్రముఖ నాయకులెందరో రామారావుగారి యింట్లో ఆశ్రయం పొందారు. అనేకమంది పార్టీ ముఖ్యులు నెలల తరబడి వైద్యసహాయం పొందారు.
"https://te.wikipedia.org/wiki/చెలికాని_రామారావు" నుండి వెలికితీశారు